iDreamPost
android-app
ios-app

ఏడాది తర్వాత OTT లోకి మెహరీన్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ‘స్పార్క్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Sep 13, 2024 | 11:00 PM Updated Updated Sep 13, 2024 | 11:00 PM

OTT Telugu Movie -Spark: ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు కొత్త మూవీస్ వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. అందులోను తెలుగు మూవీస్ అంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Telugu Movie -Spark: ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు కొత్త మూవీస్ వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. అందులోను తెలుగు మూవీస్ అంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Sep 13, 2024 | 11:00 PMUpdated Sep 13, 2024 | 11:00 PM
ఏడాది తర్వాత OTT లోకి మెహరీన్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ‘స్పార్క్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగు సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. అయితే ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎలాగూ వదిలిపెట్టకుండా చూస్తూ ఉంటారు. కానీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలను మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది కూడా అలాంటి ఓ సినిమానే. కొన్ని సినిమాలు ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది తర్వాత మెహరీన్ నటించిన ఓ తెలుగు సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటి .. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

మెహరీన్ నటించిన ఈ సినిమా పేరు స్పార్క్. ఈ సినిమాలో విక్రాంత్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా హీరోగా మాత్రమే కాకుండా ఈ సినిమాకు.. విక్రాంత్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , రైటర్ గా కూడా వ్యవహరించడం విశేషం. కాగా ఈ సినిమాలో మెహరీన్ తో పాటు రుక్స‌ర్ థిల్లాన్ కూడా మరొక హీరోయిన్ గా నటించింది. గత ఏడాది నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో విక్రాంత్ ,మెహరీన్ , రుక్స‌ర్ థిల్లాన్ తో పాటు.. సుహాసిణి మ‌ణిర‌త్నం, వెన్నెల‌కిషోర్‌, స‌త్య, బ్ర‌హ్మాజీ , బిగ్‌బాస్ బ్యూటీస్ ఆషురెడ్డి, ల‌హ‌రి సేరి కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సైలెంట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ మూవీని కూడా యాడ్ చేసుకోండి.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఇదొక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గురవుతారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ మెహరీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ క్రమంలో ఆ కేసుకు తన బాయ్ ఫ్రెండ్ విక్రాంత్ కు సంబంధం ఉందని తెలుస్తుంది. అలాగే విక్రాంత్ ను ప్రేమించిన అనన్య కూడా అనూహ్యంగా చనిపోతుంది. అసలు విక్రాంత్ ఎవరు ? నిజంగానే ఆ హత్యలకు అతనికి సంబంధం ఉందా ? ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు ? ఈ కథ ఎలా ముందుకు సాగింది ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet