iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి సరే.. మీరు రాజశేఖర్ కల్కి చూశారా? ప్రశాంత్ వర్మ ట్విస్ట్‌లు హైలెట్!

డార్లింగ్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ.. కల్కి 2898 ఏడీ. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే.. చాలా మంది కంగారులో రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్స్ బుక్ చేసుకుని లబోదిబోమంటున్నారు. మరీ అంతలా ట్రెండ్ అవుతున్న కల్కి మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా..?

డార్లింగ్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ.. కల్కి 2898 ఏడీ. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే.. చాలా మంది కంగారులో రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్స్ బుక్ చేసుకుని లబోదిబోమంటున్నారు. మరీ అంతలా ట్రెండ్ అవుతున్న కల్కి మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా..?

ప్రభాస్ కల్కి సరే.. మీరు రాజశేఖర్ కల్కి చూశారా? ప్రశాంత్ వర్మ ట్విస్ట్‌లు హైలెట్!

తెలుగు ఇండస్ట్రీల్లో టాలెంట్ యంగ్ డైరెక్టర్లలో ఒకరు ప్రశాంత్ వర్మ. ఆ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. అనతికాలంలోనే టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన హనుమాన్ మూవీతో రూ. 300 కోట్లను కొల్లగొట్టి హిందీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా చేశాడు దర్శకుడు. ప్రస్తుతం జై హనుమాన్ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే రణవీర్‌తో ఓ సినిమా కూడా పట్టాలెక్కినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..ఇప్పుడు ఈ దర్శకుడు తెరకెక్కించిన ఓ చిత్రం చర్చనీయాంశంగా మారింది. అదే రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి. ప్రభాస్ కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ కాగా, చాలా మంది రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు.

దీంతో మరోసారి 2019 నాటి కల్కి మూవీ ట్రెండ్ అవుతుంది. ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు బుక్ అయిపోవడంతో.. రాజశేఖర్ కూడా ఫన్నీగా స్పందిస్తూ.. నాకు ఏం సంబంధం లేదని.. ప్రభాస్ కల్కి టీంకి విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే రాజశేఖర్ మూవీ కల్కి మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే..కల్కి 2019లో జూన్ 28న రిలీజ్ అయ్యింది. డార్లింగ్ మూవీ జూన్ 27న విడుదల కాబోతుంది. ప్రభాస్ మూవీ సరే రాజశేఖర్ కల్కి సినిమాను చూడక పోయి ఉంటే ఓటీటీలో ఉంది చూసేయండి. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, ఆదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం రెండు ఓటీటీల్లో చూసేయచ్చు. గతంలో అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ఈటీవీ విన్‌లో కూడా చూసేయచ్చు. ఇక ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే..

స్వాతంత్య్రం వచ్చాక.. నిజాం సామ్రాజ్యం కొనసాగుతున్న సమయంలో కొల్లాపూర్ సంస్థానానికి సేనాధిపతిగా ఉన్న నర్సప్ప (అశుతోష్ రాణా).. రజాకార్లతో చేతులు కలిపి రాజుకు వెన్నుపోటు పొడుస్తాడు. రాజు కుటుంబం మొత్తాన్ని అంతంచేసి సంస్థానాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. అయితే, నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ)కు ఊళ్లో మంచి పేరు ఉంటుంది. అందరికీ సాయపడుతుంటాడు. అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఐపీఎస్ అధికారి కల్కి (రాజశేఖర్) వస్తారు. ఈ విచారణలో భాగంగా కొన్ని నిజాలు తెలుస్తుంటాయి..? ట్విస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఏమైందీ అనేది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.