iDreamPost
android-app
ios-app

బార్ ఓనర్ గా నిత్యా మీనన్.. ఇదో డిఫరెంట్ డ్రామా.. OTTలో ఈ సిరీస్ మిస్ అయ్యారా !

  • Published Aug 06, 2024 | 7:47 PM Updated Updated Aug 06, 2024 | 7:47 PM

OTT Telugu Feel Good Web Series: వెండి తెరపై అలరించిన నటి నటులు ఓటీటీ లలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో నిత్యా మీనన్ , కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ కలిసి నటించిన.. ఓ తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఏంటో.. ఈ సిరీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Telugu Feel Good Web Series: వెండి తెరపై అలరించిన నటి నటులు ఓటీటీ లలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో నిత్యా మీనన్ , కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ కలిసి నటించిన.. ఓ తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఏంటో.. ఈ సిరీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Aug 06, 2024 | 7:47 PMUpdated Aug 06, 2024 | 7:47 PM
బార్ ఓనర్ గా నిత్యా మీనన్.. ఇదో డిఫరెంట్ డ్రామా..  OTTలో ఈ సిరీస్ మిస్ అయ్యారా !

వెబ్ సిరీస్ లను ఈ మధ్య విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. పైగా అవి తెలుగులో ఉంటే కనుక కథను బట్టి వాటికి మంచి క్రేజ్ లభిస్తుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కనీసం వారానికి ఒక తెలుగు వెబ్ సిరీస్ అయినా రిలీజ్ అవుతూనే ఉంది. అవి కూడా డిఫరెంట్ జోనర్స్ లో ఉండడంతో.. ఈ వెబ్ సిరీస్ లను చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ క్రమంలో వెండి తెర నటి నటులు ఓటీటీ లలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలియనిది కాదు. మరి నిత్యా మీనన్ , కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ కలిసి నటించిన ఓ తెలుగు వెబ్ సిరీస్ ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఏంటో.. ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. రామరాజులంక అనే గ్రామంలో శ్రీమతి(నిత్యా మీనన్) అనే అమ్మాయి ఉంటుంది. ఆమె తన చిన్న తనంలో వారి ఇంటిని ఎవరికీ అమ్ముడుపోకుండా చూసుకుంటానని తన తాతయ్యకు మాట ఇస్తుంది. అలాగే ఆమె తండ్రి చిన్నతనంలోనే ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఆమెకు ఆమె బాబాయ్ కేశవరావుకు మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతూ ఉంటాయి. తన బాబాయ్ మాత్రం ఆ ఇల్లు తనదే అంటూ.. దానిని తనకు నచ్చిన వాళ్లకు అమ్ముతాను అని తరచూ గొడవలు చేస్తూ ఉంటాడు. దీనితో శ్రీమతి ఆ ఇంటిని తానే కొంటానని చెప్తుంది. దానికి కేశవరావు కేవలం 6 నెలలు గడువు మాత్రమే ఇస్తాడు. ఆరు నెలల్లో 38 లక్షలు డబ్బులు కట్టి ఆ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్తాడు . కానీ అప్పటికి ఆమె జీతం నెలకు కేవలం 13వేల రూపాయలు మాత్రమే. ఇక మరో వైపు శ్రీమతికి 30 దాటినా ఇంకా పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ఆమె తల్లి కంగారు పడుతూ ఉంటుంది. మరో వైపు శ్రీమతి పక్కింట్లో ఉండే శ్రీరామ్(నిరుపమ్) అనే అతను ఆమెను సైలెంట్ గా ప్రేమిస్తూ ఉంటాడు.

కానీ శ్రీమతి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా.. ఎలా అయినా డబ్బులు సంపాదించి తన తాతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. దీనితో శ్రీరామ్ ఇచ్చిన సలహాతో ఆమె ఏకంగా ఊరిలో ఎవరు చేయని ఓ పనిని చేయాలని అనుకుంటుంది. అదేంటంటే త్వరగా డబ్బులు సంపాదించడం కోసం ఆ ఊరిలో ఆమె బార్ పెట్టాలని అనుకుంటుంది. అలాగే పెడుతుంది కూడా. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి ? ఆమె తన తాతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా లేదా ? శ్రీమతి బాబాయ్ ఆస్తి కాజేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు ? ఆమె బార్ &రెస్టారెంట్ ఎలా ఫేమస్ అవుతుంది ? ఆ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే “కుమారి శ్రీమతి” అనే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom