iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ యానిమేటెడ్ మూవీ.. ‘ఇన్సైడ్ అవుట్’.. అసలు మిస్ చేయొద్దు

  • Published Aug 27, 2024 | 6:28 PM Updated Updated Aug 27, 2024 | 6:28 PM

OTT Suggestions- Best Animated Movie Inside Out: ఎప్పుడు ఓటీటీ లో హర్రర్ థ్రిల్లర్ , ఇన్వెస్టిగేషన్ మూవీస్ లాంటివి చూసి చూసి బోర్ కొట్టేస్తే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే డిఫరెంట్ మూవీ తప్పకుండ ట్రై చేయాల్సిందే. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Suggestions- Best Animated Movie Inside Out: ఎప్పుడు ఓటీటీ లో హర్రర్ థ్రిల్లర్ , ఇన్వెస్టిగేషన్ మూవీస్ లాంటివి చూసి చూసి బోర్ కొట్టేస్తే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే డిఫరెంట్ మూవీ తప్పకుండ ట్రై చేయాల్సిందే. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 27, 2024 | 6:28 PMUpdated Aug 27, 2024 | 6:28 PM
OTT లో బెస్ట్ యానిమేటెడ్ మూవీ.. ‘ఇన్సైడ్ అవుట్’.. అసలు మిస్ చేయొద్దు

ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు కూడా మిస్ కాకుండా చూస్తూనే ఉంటారు. ఇక అలా రిలీజ్ అయ్యే వాటిలో దాదాపు హర్రర్, కామెడీ, సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ఏ ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఇంట్రెస్టింగ్ గా చూసినా కానీ.. అప్పుడప్పుడు ఈ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ మూవీ చూడాలనే ఫీలింగ్ అందరికి వస్తుంది. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. దాదాపు ఇలాంటి మూవీస్ పై అందరికి కచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

యానిమేషన్ సినిమాలు కేవలం చిన్న పిల్లలను మాత్రమే కాదు.. పెద్ద వాళ్ళను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. నోస్టాలోజిక్ మూవీస్ గా వారికి ఇలాంటి మూవీస్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటాయి. ఇప్పటివరకు ఎన్నో యానిమేషన్ మూవీస్ ను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం.. కచ్చితంగా మీ మనుసును కదిలించేస్తుంది. కాబట్టి ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మూవీ చూసిన తర్వాత కచ్చితంగా .. మనసుకు హాయిగా అనిపిస్తుంది కూడా.. పైగా ఈ సినిమా రన్ టైమ్ కూడా చాలా తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి.. చాలా ఈజీగా చూసేయొచ్చు. మరి ఈ సినిమా ఏంటో.. ఈ సినిమా కథేంటో చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రైలీ అనే అమ్మాయి 11 ఏళ్ళ చిన్న పాప. ఆమె జీవితం మినిసోటా నగరంలో ఆనందంగా సాగిపోతుంది. కానీ ఓ రోజు ఆమె తల్లితండ్రులు సాన్ ఫ్రాన్సిస్కో కు వలస వెళ్లాలని డిసైడ్ అవుతారు. రైలీకి ఇదొక పెద్ద మార్పు. కొత్త సిటీ.. కొత్త మనుషులు.. కొత్త స్కూల్.. ఇలా అన్ని మార్పులు ఆమె జీవితాన్ని తారు మారు చేస్తాయి. ఈ ప్రాసెస్ లో భయం , కోపం , అసహనం లాంటివి రైలీ పై ఎఫెక్ట్ చేస్తాయి. ఆమె జీవితం ఎలా మారుతుంది అనేదే ఈ సినిమా కథ. తల్లిదండ్రులు రైలీ ని అర్థంచేసుకున్నారా లేదా .. అనేది తెలియాలంటె ఈ ఇన్సైడ్ అవుట్ అనే సినిమాను చూడల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంది. కానీ ఆ సినిమా మాత్రం ఇంకా ఓటీటీ లోకి రాలేదు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş