iDreamPost
android-app
ios-app

భార్యని మభ్య పెట్టి.. లవర్ తో ఎంజాయ్! OTTలో 12th ఫెయిల్ హీరో మూవీ!

  • Published May 27, 2024 | 8:36 PM Updated Updated May 27, 2024 | 8:36 PM

OTT Suggestions- Vikrant Massey Crime Thriller: 12th ఫెయిల్ సినిమాతో విక్రాంత్ మాసే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అందుకే విక్రాంత్ చేసిన సినిమాలు అంటే ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అతను చేసిన ఒక సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉంది.

OTT Suggestions- Vikrant Massey Crime Thriller: 12th ఫెయిల్ సినిమాతో విక్రాంత్ మాసే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అందుకే విక్రాంత్ చేసిన సినిమాలు అంటే ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అతను చేసిన ఒక సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉంది.

  • Published May 27, 2024 | 8:36 PMUpdated May 27, 2024 | 8:36 PM
భార్యని మభ్య పెట్టి.. లవర్ తో ఎంజాయ్! OTTలో 12th ఫెయిల్ హీరో మూవీ!

ఓటీటీ వచ్చిన తర్వాత అన్నీ జానర్స్ చిత్రాలను ప్రేక్షకులు చూసేస్తున్నారు. అయితే టెక్నాలజీ, సైంటిఫిక్ చిత్రాలు అంటే మాత్రం హాలీవుడ్ చిత్రాలు మాత్రమే అనుకుంటారు. కానీ, టాలీవుడ్- బాలీవుడ్ నుంచి కూడా అదిరిపోయే సైంటిఫిక్ యాక్షన్ డ్రామాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక సినిమా ఏదో తెలియక చాలా మంది చూడటం మానేస్తున్నారు. కానీ, మీకోసం ఈసారి ఒక బాలీవుడ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఇది చూస్తే మీకు ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి అనుకున్న సాధించడం కోసం ఇంతకు తెగిస్తాడా? అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది.

మీరు చాలానే సైంటిఫిక్, టెక్నాలజీ ఫిల్మ్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన టెక్నాలజీ ఓరియంటెడ్ మూవీని మాత్రం చూసుండరు. అందుకే ఇది ప్రేక్షకులను మెప్పించింది. నిజానికి ఈ మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ దక్కలేదు. అందుకా చాలా తక్కువ మందికే ఈ సినిమా ఒకటి ఉందని తెలుసు. అయితే ఇది చాలా చిన్న చిత్రమే. గట్టిగా ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, టెక్నాలజీని ఇలా కూడా వాడచ్చా? అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అనే అనుమానాలు, భయాలు కలుగుతాయి. అంతేకాకుండా.. టెక్నాలజీ మీద ఆధారపడితే ఎలాంటి అనర్థాలు కలుగుతాయి అనే విషయం కూడా అర్థమవుతుంది.

ఇదంతా ఒక వ్యక్తి తన రెండో భార్యతో గడిపేందుకు చేసిన ఒక ప్లాన్ అనే విషయం అర్థమవుతుంది. తన మొదటి భార్యకు అనుమానం రాకుండా.. ఇంకొక మహిళతో గడిపేందుకు తనలాంటి ఒక రోబోని కొనుగోలు చేస్తాడు. అతను లేని సమయంలో అతని కుటుంబంతో గడపడం, తన వ్యాపారాన్ని చూసుకోవడం వంటివి చేసేందుకు దానిని కొనుగోలు చేస్తాడు. అయితే ఇక్కడే అతనికి అసలు కష్టం వస్తుంది. అదేంటంటే.. తాను కొనుగోలు చేసిన రోబో అతని స్థానాన్ని కబ్జా చేయాలి అనుకుంటుంది. రోబో అలా అనుకున్న తర్వాత హీరో లైఫ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి? అసలు హీరో రోబో నుంచి తప్పించుకున్నాడా? రోబో ఎందుకు అతని స్థానంలోకి రావాలి అనుకుంది అనేదే కథ.

ఈ మూవీలో విక్రాంత్ మాసే నటన ఇరగదీశాడు. సాధారణంగా 12త్ ఫెయిల్ సినిమా తర్వాత విక్రాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. కానీ, అంతకన్నా ముందే వచ్చిన ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చేస్తుంది. ఈ మూవీ పేరు ‘కాపీ(Copy)’. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. కాకపోతే కేవలం హిందీలో మాత్రమే ఇది స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక షార్ట్ అండ్ స్వీట్ టెక్నాలజీ క్రైమ్ థ్రిల్లర్. తప్పకుండా ఒకసారి చూసేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş