Ahaలో ట్రెండింగ్ హారర్ థ్రిల్లర్స్ ఇవే.. ఒంటరిగా చూస్తారా?

Aha Top Horror Movies: హారర్ సినిమాలు అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు. కానీ, ఓటీటీలో ఎన్నో హారర్ చిత్రాలు ఉంటే ఇన్ఫర్మేషన్ లేకుండా చూడకుండా ఉంటున్నారు. అందుకే మీకోసం ఆహాలో ఉన్న టాప్ 5 హారర్ చిత్రాలు తీసుకొచ్చాం.

Aha Top Horror Movies: హారర్ సినిమాలు అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు. కానీ, ఓటీటీలో ఎన్నో హారర్ చిత్రాలు ఉంటే ఇన్ఫర్మేషన్ లేకుండా చూడకుండా ఉంటున్నారు. అందుకే మీకోసం ఆహాలో ఉన్న టాప్ 5 హారర్ చిత్రాలు తీసుకొచ్చాం.

హారర్ సినిమాలను ఎవరు ఇష్టపడరు చెప్పండి. హారర్ సినిమాలు చూడటం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. అయినా వాటిని మానేయడం చాలా కష్టం. భయపడుతున్నా.. దుప్పట్లో దూరేసైనా హారర్ సినిమాలు చూడాల్సిందే. అలాంటి వాళ్లు చాలామందే ఉంటారు. అందుకే తెలుగులో హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ సరైన హారర్ సినిమా వస్తే బాక్సాఫీస్ పరుగులు పెట్టాల్సిందే. అలాంటి వారి కోసం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయితే అన్నీ చూడలేరు కాబట్టి.. ప్రస్తుతం ఆహాలో ట్రెండ్ అవుతున్న టాప్ తెలుగు హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం. వాటిని మీరు గనుక చూడకపోతే ఒకసారి చూసేయండి. అస్సలు డిస్సప్పాయింక్ కారు. ఈ మూవీస్ వెన్నులో వణుకుపుట్టిస్తాయి కూడా.

మసూద:

మసూద సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు సరైన్ హారర్ సినిమా చూడక ఉన్న తెలుగు ప్రేక్షకుల ఆకలి తీర్చిన చిత్రం అది. ఒక్కో సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలాగే ఈ మూవీలో కథ, టేకింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి. భయం కూడా బాగానే ఉంటుంది. సంగీత, తిరువీర్, కావ్యా కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేశ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రం ఆహాలో ఉన్న టాప్ హారర్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంత్రాలు, తాంత్రిక విద్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కాస్త భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా చూడండి.

పొలిమేర 2:

పొలిమేర సినిమా తెలుగు ఓటీటీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర చిత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే మంచి సీక్వెల్ మీద భారీ అంచనాలను పెంచేసింది. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా థియేటర్లలో విడుదలైన పొలిమేర 2 అదరగొట్టింది. సత్యం రాజేశ్, సాయి కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను లీడ్ రోల్స్ ప్లే చేశారు. పార్ట్ 1కి మంచి పార్ట్ 2లో కథ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది. ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోతే మంచి హారర్ థ్రిల్ ని మిస్ అయినట్లే.

ఆన్యాస్ ట్యూటోరియల్:

రెజీనా కశాండ్రా, నివేదితా సతీష్, సాయి కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ ‘ఆన్యాస్ ట్యూటోరియల్’ వెబ్ సిరీస్ కి ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా సమయంలో జరిగిన కథలా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. రెజీనా చెల్లి ఆన్యాగా నివేదితా సతీష్ నటనలో మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ గా అవ్వాలి అని అనుకున్న ఆన్యా.. ఒంటరిగా ఒక పాడుబడిన అపార్టుమెంట్లో ఉంటుంది. తన గదిలో దెయ్యం ఉంది అని మాయమాటలు చెప్పి ఫేమస్ అవుతుంది. కానీ, తన అక్క వల్ల అది ఫ్రాడ్ అని తెలుస్తుంది. కానీ, ఈ కథలో నిజమైన దెయ్యం ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ అంతా మారిపోతుంది. ఈ వెబ్ సిరీస్ వర్త్ వాచ్ అనే చెప్పాలి.

పిండం:

రీసెంట్ టైమ్స్ లో విడుదలైన హారర్ చిత్రాల్లో ‘పిండం’ బెస్ట్ మూవీ అనచ్చు. అంతేకాకుండా హీరో శ్రీరామ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఈ చిత్రంతోనే మొదలు పెట్టాడు. రీఎంట్రీ చాలా సాలిడ్ గా ఇచ్చాడు. హారర్ చిత్రాల్లో పిండం మూవీకి సెపరేట్ ప్రియారిటీ ఉంటుంది. ఇది మంచి కథ మాత్రమే కాకుండా.. బాగా వణికించే మూవీ కూడా. ఒక హాంటెడ్ హౌస్ లోకి దిగిన శ్రీరామ్ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది? అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఒకే ఇంట్లో అన్ని ఆత్మలు ఎందుకు ఉన్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా చూసేయండి.

తంత్ర:

తాజాగా ఆహా ఓటీటీలోకి వచ్చిన తంత్ర మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆహాలో టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఒక ఫుల్ లెంగ్త్ హారర్ చిత్రంగా వచ్చిన ఈ తంత్ర మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పైగా ఈ మూవీలో అనన్య మాత్రమే కాకుండా.. ధనుష్ రఘుముద్రి, సలోనీ, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ లీడ్ రోల్స్ లో అలరించారు. తాంత్రిక విద్య, చే*తబడి, వ*శీకరణ వంటి విద్యల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. చూడటానికి కాస్త ధైర్యం కూడా కావాలి. ఈ మూవీని ఇంకా చూడటం స్టార్ట్ చేయకపోతే ఒకసారి చూసేయండి. ఆహాలో ఈ మూవీస్ టాప్ హారర్ చిత్రాలు అని చెప్పచ్చు. ఇవి కాకుండా మీకు బాగా నచ్చిన చిత్రాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments