iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది సిక్స్త్ సెన్స్’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

  • Published Sep 05, 2024 | 11:00 PM Updated Updated Sep 05, 2024 | 11:00 PM

OTT Best Suspense Thriller - The Sixth Sense Movie: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని కూడా ప్రేక్షకులను చివరి వరకు సినిమాలను చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ కాబట్టి .. ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Suspense Thriller - The Sixth Sense Movie: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని కూడా ప్రేక్షకులను చివరి వరకు సినిమాలను చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ కాబట్టి .. ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Sep 05, 2024 | 11:00 PMUpdated Sep 05, 2024 | 11:00 PM
OTT లో బెస్ట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది సిక్స్త్ సెన్స్’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో.. కొత్త సినిమాలను , సిరీస్ లను మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఉన్న కొన్ని సినిమాలను మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ సినిమాలన్నీ కూడా చివరి వరకు ప్రేక్షకులను కదలనివ్వకుండా చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బెస్ట్ చైల్డ్ సైకియాట్రిస్ట్ గా ఓ డాక్టర్ కు అవార్డు వస్తుంది. దీనితో ఆ భార్య భర్తలు ఇద్దరు దానిని హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఓ రోజు వారి ఇంట్లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశిస్తాడు. నాకు 10 ఏళ్ళ అప్పుడు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి వచ్చారని చెప్తాడు. దీనితో డాక్టర్ కు అతను ఎవరో గుర్తొస్తుంది. అసలు తన ప్రాబ్లమ్ ఏంటంటే.. అతనికి చనిపోయిన వారంతా ఆత్మలుగా కనిపిస్తుంటాయని అతని నమ్ముతాడు. కానీ డాక్టర్ ఏమో కేవలం బాధ వలన మాత్రమే అతను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి అలా ఫీల్ అవుతున్నాడు. అతనికి ట్రీట్మెంట్ ఏ అవసరం లేదని చెప్తాడు. దీనితో మళ్ళీ ఆ పేషంట్ డాక్టర్ ను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ పేషంట్ ఏమో డాక్టర్ ను కాల్చేసి తాను కాల్చుకుని చనిపోతాడు. కట్ చేస్తే.. స్టోరీ 10 ఏళ్ళ తర్వాత చూపిస్తారు.

ఇక్కడ మరొక 9 సంవత్సరాల పిల్లాడికి ఇలాంటి ఓ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ పిల్లాడు అచ్చం తనని తానూ కాల్చుకుని చనిపోయిన పేషంట్ లానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. దీనితో అతనిని కేసును సాల్వ్ చేయడానికి ఓ డాక్టర్ వస్తాడు. ప్రతి నిమిషం ఆ పిల్లడు గురించే ఆలోచిస్తూ.. తన భార్యతో కూడా ఎక్కువగా మాట్లాడాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ పిల్లాడు స్కూల్ కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో అతను చేసిన పనులన్నీ కూడా. వాళ్ళ అమ్మకు తనపై అనుమానం కలిగిస్తూ ఉంటాయి. డాక్టర్ కూడా అతనిని ఫాలో అవుతూ ఉంటాడు. అసలు అతనికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి ? పదేళ్ల క్రితం చనిపోయిన ఆ వ్యక్తికీ.. ఈ వ్యక్తికీ సంబంధం ఏంటి ? డాక్టర్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ది సిక్స్త్ సెన్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అసలు మిస్ చేయకూడదు. ఈ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.