iDreamPost
android-app
ios-app

ఆ వీడియో చూసిన వారంతా 7 రోజుల్లో చనిపోతారు. OTT లో భయంకరమైన మూవీ

  • Published Jul 16, 2024 | 1:00 AM Updated Updated Jul 16, 2024 | 1:00 AM

OTT Best Frightening Movie: హారర్ సినిమాలో దెయ్యాలు కనిపిస్తూ భయపెడతాయి. కానీ కొన్ని సినిమాలలో కేవలం వాయిస్ వినిపిస్తూనే భయపెడుతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఓ లుక్ వేసేయండి.

OTT Best Frightening Movie: హారర్ సినిమాలో దెయ్యాలు కనిపిస్తూ భయపెడతాయి. కానీ కొన్ని సినిమాలలో కేవలం వాయిస్ వినిపిస్తూనే భయపెడుతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 16, 2024 | 1:00 AMUpdated Jul 16, 2024 | 1:00 AM
ఆ  వీడియో చూసిన వారంతా  7 రోజుల్లో చనిపోతారు. OTT లో భయంకరమైన మూవీ

హర్రర్ సినిమాలంటే ఇష్టమైన వారు దాదాపు.. ఇప్పటికే ఓటీటీ లో ఉన్న హర్రర్ సినిమాలన్నిటిని చూసే ఉంటారు. ఎంత భయపడినా సరే ఈ జోనర్ మూవీస్ ను చూడడం మాత్రం అసలు ఆపరు. సాధారణంగా హర్రర్ సినిమాలలో దెయ్యాలు కనిపిస్తూ భయపెడతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కేవలం వాయిస్ వినిపిస్తూనే భయపెడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ భయంకరమైన సినిమానే. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాము అనే ఫీలింగ్ వస్తుంది. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ? ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే… ఈ మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు టీనేజర్స్ ఉంటారు.. కెటి , బెక్కా .. వాళ్లిద్దరూ ఓ విచిత్రమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. అదేంటంటే.. బెక్కా ఓ వింత వీడియో టేప్ ను చూసిందని.. ఆ వీడియో టేప్ ను చూసిన వారందరికీ ఎవరో ఒక ఆమె కాల్ చేసి సెవెన్ డేస్ అని చెప్తుందని.. దానితో కచ్చితంగా వారం రోజులకు వారు చనిపోతారని బెక్కా.. కెటితో చెప్తుంది. అయితే కెటి తానూ ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చూశానని.. ఈరోజే సెవెంత్ డే అని చెప్తుంది. వాళ్ళు విన్న దానిప్రకారం కెటి ఆ తర్వాత రోజు చనిపోవాలి. కానీ వాళ్లిద్దరూ ఆ విషయాన్నీ అంతగా నమ్మలేదు. కానీ ఉన్నంట్లుండి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కట్ చేస్తే కెటి నిజంగానే ఆరోజు చనిపోతుంది.

ఇక నెక్స్ట్ సీన్ లో.. ఓ చిన్న బాబును చూపిస్తారు. అతను విచిత్రమైన డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. అయితే ఆ బాబు మరెవరో కాదు కెటి కజిన్. కెటి చనిపోడానికి నెల రోజుల ముందే తానూ చనిపోతున్నట్లు తన కజిన్ ఏడెన్ తో చెప్తుంది. దీనితో అతను కెటి చనిపోతున్నట్లు అప్పుడే డ్రాయింగ్ వేస్తాడు. ఇది చూసిన వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. దీని వెనుక అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక కెటి ఫ్రెండ్ బెక్కా మెంటల్ హాస్పిటల్ లో ఉంటూ వింత వింతగా ప్రవర్తిస్తుంది. ఇక ఏడెన్ వాళ్ళ అమ్మ.. కెటి చావు వెనుక ఉన్న నిజ నిజాలను తెల్సుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు చాల భయంకరమైన విషయాలు తెలుస్తాయి. అసలు అక్కడ ఏం జరిగింది ? ఏడెన్ వాళ్ళ అమ్మకు తెలిసిన నిజాలేంటి ? ఒక వీడియో టేప్ విన్న ఏడు రోజులకు మనుషులు ఎందుకు చనిపోతున్నారు ? ఆ వీడియోలో ఏం ఉంది ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఏడెన్ కే ముందే కొన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి ? ఇవన్నీ తెలియాలంటే “ది రింగ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియా సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో ప్రపంచాన్నే భయపెట్టిన హర్రర్ సినిమా.. నిజమైన దెయ్యం కథ!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss