iDreamPost
android-app
ios-app

OTT లో ప్రపంచాన్నే భయపెట్టిన హర్రర్ సినిమా.. నిజమైన దెయ్యం కథ!

  • Published Jun 29, 2024 | 5:49 PM Updated Updated Jul 08, 2024 | 4:48 PM

OTT Real Horror Movie: ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. నిజమైన దెయ్యాలు కథల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను మాత్రం చూసి ఉండరు. అసలు ఈ సినిమా ఏంటి మీరు చూశారా లేదా చెక్ చేసేయండి.

OTT Real Horror Movie: ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. నిజమైన దెయ్యాలు కథల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను మాత్రం చూసి ఉండరు. అసలు ఈ సినిమా ఏంటి మీరు చూశారా లేదా చెక్ చేసేయండి.

  • Published Jun 29, 2024 | 5:49 PMUpdated Jul 08, 2024 | 4:48 PM
OTT లో ప్రపంచాన్నే భయపెట్టిన హర్రర్ సినిమా.. నిజమైన దెయ్యం కథ!

దాదాపు హర్రర్ సినిమాలన్నీ కూడా ఊహాగానాలే.. వాటితోనే ప్రేక్షకులను భయపెడుతూ.. ఇలాంటి సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నారు మేకర్స్. మరి అలాంటిది ఎక్కడో జరిగిన నిజమైన దెయ్యాల కథను ఆధారంగా తీసుకుని.. సినిమాను తీస్తే.. ఇక ఈ సినిమా చూసి భయపడని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే.. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. నిజమైన దెయ్యాలు కథల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను మాత్రం చూసి ఉండరు. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూసారో లేదో చెక్ చేసేయండి.

అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం అయితే ఎవరికీ తెలియదు కానీ.. దెయ్యాలు ఉన్నాయని మాత్రం కొంతమందే నమ్ముతారు. కొంతమంది నమ్మరు. కానీ స్పెయిన్ లో జరిగిన ఓ నిజమైన దెయ్యం కథ మాత్రం ప్రపంచాన్నే వణికించింది. దానిని రిఫరెన్స్ గా తీసుకుని రూపొందించిన సినిమానే “వెరోనికా”. అసలు ఈ సినిమా కథేంటంటే.. ఈ మూవీ స్టార్టింగ్ లో ఎమెర్జెన్సీ పోలీస్ సర్వీస్ కు ఓ కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఓ అమ్మాయి కంగారుగా మాట్లాడుతూ.. వాళ్ళ ఇంట్లో ఎదో వింత ఆకారం ఉందని.. అది వారిని చంపడానికి ప్రయత్నిస్తుందని… వారిని కాపాడాలంటూ చెప్తుంది. దీనితో పోలీసులు అంతా ఆ ఇంటికి వెళ్ళి.. అక్కడ సంఘటనలు చూసి షాక్ అవుతారు.

Veronica

కట్ చేస్తే ఇక్కడ మెయిన్ స్టోరీ చెప్తారు. ఇక్క వెరోనికా అనే అమ్మాయి ఉంటుంది. అప్పటికే ఆమె తండ్రి చనిపోడంతో.. ఆమె తల్లి ఓ బ్యాకరీలో పని చేస్తూ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. వెరోనికాకు ఇద్దరు చెల్లెళ్ళు , తమ్ముడు కూడా ఉంటారు. ఇక ఎప్పటిలానే వెరోనికా వాళ్ళను తీసుకుని స్కూల్ కు వెళ్తుంది. ఆరోజు సూర్య గ్రహణం కావడంతో.. టీచర్ దానికి సంబంధించిన లెస్సన్ చెప్తూ ఉంటుంది. ఆరోజు చాలా మతాల ప్రజలు క్షుద్ర పూజలు చేస్తూ.. మనుషుల్ని బలి ఇస్తూ ఉంటారని టీచర్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత టీచర్ అందరిని సూర్య గ్రహణం చూడడానికి తీసుకుని వెళ్తే.. వెరోనికా మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉండే స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. తనతో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. అక్కడ చనిపోయిన ఆత్మలతో మాట్లాడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

వెరోనికా తన తండ్రితో మాట్లాడానికి కొన్ని మంత్రాలూ చదువుతూ ఉంటారు. దానితో ఒక్కసారిగా ఆ రూమ్ మొత్తం వింతగా మారిపోతుంది. సూర్య గ్రహణం మొదలయ్యే సమయంలోనే.. తన తండ్రి ఆత్మ బయటకు వస్తుంది. అక్కడ వింత వింత శబ్దాలు వినిపించడంతో మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ భయపడతారు. వెరోనికా కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పటినుంచి వెరోనికాకు వింత వింత అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి. తన తండ్రి ఆత్మ అప్పటినుంచి వెరోనికకు నరకం చూపిస్తుంది. అసలు ఆ తర్వాత ఏమైంది! ఎందుకు తండ్రి ఆత్మ వీరిపై పగ పట్టింది ! ఆ స్కూల్ లో వెరోనికా కు హెల్ప్ చేసేది ఎవరు ! చివరికి ఈ కథ ఎలా ముగిసింది! వెరోనికా ఈ ఆత్మ నుంచి ఎలా తప్పించుకుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss