OTT Suggestions- Taapsee Pannu Phir Aayi Haseen Dillruba: OTTలో దుమ్మురేపుతున్న 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా'.. తప్పక చూడాల్సిందే!

OTTలో దుమ్మురేపుతున్న ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా’.. తప్పక చూడాల్సిందే!

OTT Suggestions- Taapsee Pannu Phir Aayi Haseen Dillruba: మీరు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మైండ్ గేమ్స్ ఉండే మూవీని మాత్రం అస్సలు చూసుండరు. ఈ చిత్రంలో భార్యాభర్తలు ఇద్దరు చేసే పనులకు పిచ్చెక్కిపోతారు.

OTT Suggestions- Taapsee Pannu Phir Aayi Haseen Dillruba: మీరు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మైండ్ గేమ్స్ ఉండే మూవీని మాత్రం అస్సలు చూసుండరు. ఈ చిత్రంలో భార్యాభర్తలు ఇద్దరు చేసే పనులకు పిచ్చెక్కిపోతారు.

ఓటీటీలో ఒక క్రేజీ లవ్ స్టోరీ చూడాలి అని మీరు అనుకుంటుంటే మాత్రం మీకు ఇది చాలా బెటర్ ఛాయిస్ అవుతుంది. ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కి ఇది సీక్వెల్. అ మూవీ మరేదో కాదు.. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా’. తాప్సీ పన్ను- విక్రాంత్ మస్సే కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. హసీన్ దిల్ రుబా సినిమా కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా అనే సినిమాని తెరకెక్కించారు. అయితే ఈసారి ట్విస్టులు, షాకులు ఒకటికి రెండింతలు చేశారు అనే చెప్పాలి. కథ పరంగా కావచ్చు.. టేకింగ్ పరంగా కావచ్చు మూవీ నెక్ట్స్ లెవల్ అనే టాక్ సొంతం చేసుకుంది. అంత గొప్పగా ఆ మూవీలో ఏముంది? అసలు ఎందుకు తప్పకుండా చూడాలో చూద్దాం.

హసీన్ దిల్ రుబా మూవీ అంత బాగా హిట్టు కావడానికి కారణం అందులో ఉండే మైండ్ గేమ్స్. ఈసారి ఆ మైండ్ గేమ్స్ ని డబుల్ చేశారు. పైగా సీక్వెల్ లో అభిమన్యు అనే కొత్త పాత్రను తీసుకొచ్చారు. మొదట్లో ఆ పాత్ర ఎంతో సైలెంట్ గా కనిపిస్తుంది. కానీ, కథ ముందుకు వెళ్లే కొద్ది ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా.. కాస్త కంగారు కూడా పెడుతుంది. రాణి(తాప్సీ) తన భర్త తనని వెంటాడుతున్నాడు అనే సీన్ తో సినిమా స్టార్ట్ చేసి.. అక్కడి నుంచి ప్రేక్షకుడిని సీటు అంచుకు తీసుకొచ్చేలా కథనం సాగుతుంది. తాను చనిపోయినట్లు రాణి భర్త రిషి(విక్రాంత్ మాస్సే) లోకాన్ని నమ్మిస్తాడు. కానీ, ఆగ్రా పోలీస్ అధికారి(జిమ్మీ షెర్గిల్)గా వచ్చిన మోంటోని మాత్రం నమ్మించలేకపోయాడు. అతను ఫస్ట్ పార్ట్ లో రాణి- రిషి హత్య చేసిన నీల్ కి మేనమామ. అతను పాత నీల్ హత్య కేసును తవ్వి తీస్తాడు.

అక్కడి నుంచి ఈ మూవీలో ఆసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా థాయ్ ల్యాండ్ వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న రిషి- రాణి ప్లాన్ దాదాపుగా ఫెయిల్ అవుతుంది. ఒకవైపు మోంటో వీరిని వెంటాడుతూ ఉంటే.. మరోవైపు రాణి అభిమన్యుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా దాదాపుగా మొదటి పార్ట్ తరహాలోనే కథ ఉంటుంది అనిపిస్తుంది. కానీ, ట్విస్టులు- నరేషన్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. ఈ భార్యాభర్తలు ఎలాంటి పథకాలు రచించారు? అసలు అభిమన్యు పాత్ర ఎందుకు వచ్చింది? నీల మరణం వెనుక ఉన్నది వీళ్లే అని నిరూపించగలిగారా? హీరో-హీరోయిన్ థాయ్ ల్యాండ్ పారిపోవాలి అనుకున్న ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో కథ సాగుతుంది. అలాగే యమునా నదికి కూడా ఈసారి కథను లింక్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా’ మూవీని నడిపించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి పార్ట్ చూసిన వారికి ఈ సెకండ్ పార్ట్ బాగా నచ్చుతుంది. నేరుగా సీక్వెల్ చూసే వారికి కథ అంత ఎఫెక్టివ్ గా అర్థం కాకపోవచ్చు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments