iDreamPost
android-app
ios-app

దేవుడినే ఎదిరించే ప్రేతాత్మ.. OTTలో ఈ మూవీకి చెమటలు పట్టేస్తాయి!

  • Published Jun 05, 2024 | 3:58 PM Updated Updated Jun 05, 2024 | 3:58 PM

OTT Suggestions- Spine Chilling Horror Movie: హారర్ మూవీస్ చూడటం మీ వీక్ నెస్ అయితే మీకోసమే ఈ మూవీ. ఈ చిత్రాన్ని చూస్తే ఎంతటి హారర్ ప్రియులకు అయినా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. అలాంటి ఒక సినిమాని చాలా రోజులగా లైట్ తీసుకున్నారు.

OTT Suggestions- Spine Chilling Horror Movie: హారర్ మూవీస్ చూడటం మీ వీక్ నెస్ అయితే మీకోసమే ఈ మూవీ. ఈ చిత్రాన్ని చూస్తే ఎంతటి హారర్ ప్రియులకు అయినా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. అలాంటి ఒక సినిమాని చాలా రోజులగా లైట్ తీసుకున్నారు.

  • Published Jun 05, 2024 | 3:58 PMUpdated Jun 05, 2024 | 3:58 PM
దేవుడినే ఎదిరించే ప్రేతాత్మ.. OTTలో ఈ మూవీకి చెమటలు పట్టేస్తాయి!

హారర్ సినిమాలు చూడటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే అలాంటి ఇలాంటి హారర్ చిత్రాలు చూడాలి అంటే దాదాపుగా అందరికీ కాస్త చిరాకుగానే ఉంటుంది. హారర్ చిత్రం అంటే ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ మాంటేజ్ వరకు రెండు కాళ్లు వణుకుతూ ఉండాలి. దుప్పటి కప్పుకుని చిన్న రంద్రంలోంచి సినిమా చూడాలి. ఇంట్లో చీమ చిటుక్కుమన్నా.. మన ప్యాంటు తడిసిపోవాలి. అలాంటి హారర్ చిత్రాన్ని ఎవరైనా ఇష్టపడతారు. ఈ రేంజ్ ఎలివేషన్స్ తో సినిమా వచ్చి చానేళ్లు అయ్యిందిలే అని సింపుల్ గా రియాక్ట్ కాకండి. సరిగ్గుండే ఒక హారర్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. కానీ, మీకే ఆ విషయం తెలియలేదు. మరి.. ఆ సినిమా ఏదో చూద్దాం.

హాలీవుడ్ లో వచ్చే హారర్ చిత్రాలకు తెలుగులో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు హాలీవుడ్ నుంచి హారర్ మూవీస్ వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ చిత్రం 2023లోనే విడుదలైంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. ఈ సినిమాలో ఒక ప్రేతాత్మ ఉంటుంది. అది కూడా ఒక పవిత్రమైన దేవుడి సన్నిధిలాంటి ఒక నన్స్ ఉండే పాఠశాలలో ఉంటుంది. అక్కడ అందరూ దేవుడి సేవలో ఉండే సిస్టర్స్ ఉంటారు. వారు అక్కడ వారిని వారు మెరుగు పరుచుకునేందుకు.. దేవుడి సేవలో తరించేందుకు వెళ్తూ ఉంటారు. అయితే అలాంటి పాఠశాలలో ఒక ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుంది.

Sister Death

ఆ ఆత్మకు అస్సలు భయం అనేది తెలియదు. ఆ కాన్వెంట్ లోనే తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటారో.. వారిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అది గనుక ఎవరి పేరు రాస్తే.. వాళ్ల ప్రాణం పోయినట్లే. దాని నుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. అలాంటి ఆత్మ చేతిలో హీరోయిన్ చిక్కుకుంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ఆ కాన్వెంట్ కి వస్తే.. అక్కడే తనకు అసలు కష్టాలు మొదలవుతాయి. అక్కడ ప్రాణం తీసుకోవడమే ఎంతో సుఖంగా ఉంటుంది. కానీ, అది కూడా ఆ ఆత్మ తల్చుకుంటేనే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ చిక్కుకుంటుంది. తనకు వచ్చిన కష్టాలను ఎవరికి చెప్పాలో తెలియదు. ఎవరు తనను కాపాడతారో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటుంది.

ఈ సినిమా పేరు ‘సిస్టర్ డెత్’. ఈ సిస్టర్ డెత్ అనే మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2023లోనే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడాలి అంటే కాస్త గుండె గట్టిది అయి ఉండాలి. హార్ట్ పేషెంట్స్ ఇలాంటి చిత్రాలకు దూరంగా ఉంటే మంచిది. ఇందులో వచ్చే సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ పిచ్చెక్కిస్తాయి. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్.. సస్పెన్స్ సీన్స్ అయితే చెమటలు పట్టించేస్తాయి. ఇందులో వచ్చే యాక్టర్స్ మాత్రమే కాదు.. చైల్డ్ ఆర్టిస్టులు కూడా వారి నటనతో భయ పెట్టేస్తారు. మరి.. ఈ హారర్ చిత్రం చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss