iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘సైన్స్’.. సడెన్ గా ఇంటి చుట్టూ ఏలియన్స్ ఉంటే!

  • Published Sep 10, 2024 | 3:08 PM Updated Updated Sep 10, 2024 | 3:08 PM

OTT Best Science Fiction Thriller- Signs Movie :ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలైనా హర్రర్ , కామెడీ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సజ్జెషన్ గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Best Science Fiction Thriller- Signs Movie :ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలైనా హర్రర్ , కామెడీ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సజ్జెషన్ గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Sep 10, 2024 | 3:08 PMUpdated Sep 10, 2024 | 3:08 PM
OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘సైన్స్’.. సడెన్ గా ఇంటి చుట్టూ ఏలియన్స్ ఉంటే!

లాంగ్వేజ్ , జోనర్ తో సంభందం లేకుండా కంటెంట్ ఉండే.. సినిమాలన్నిటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇక ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓటీటీ లో రెగ్యులర్ గా వచ్చే సినిమాలైనా హర్రర్ , కామెడీ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో .. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. గ్రహం అనే వ్యక్తి సిటీ అవుట్ స్కర్ట్స్ లో.. కొడుకు , కూతురు , తమ్ముడితో కలిసి జీవిస్తూ ఉంటాడు . అతను ఒక చర్చ్ ఫాదర్. కానీ తన భార్య చనిపోయిన దగ్గర నుంచి అతను దేవుడిని నమ్మడం మానేశాడు. అలా హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో.. ఓ రోజు పక్కనే ఉన్న పొలంలో నుంచి పిల్లల అరుపులు వినిపిస్తూ ఉంటాయి . దీనితో గ్రహం, తన కూతురు కంగారుగా ఆ పొలంలోకి వెళ్తారు. అక్కడ చూస్తే పొలంలోని చెట్లన్నీ విరిగిపోయి.. విచిత్రంగా పెద్ద పెద్ద ఆకారాలు కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత అతను తన ఫ్రెండ్ కు ఈ విషయం చెప్పగానే ఇదంతా.. ఇంకెవరో చేసారని చెప్తాడు. కట్ చేస్తే అక్కడకు ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చి.. దానిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ తర్వాత వేరే ఫార్మ్ లో అక్కడ కొన్ని జంతువులు ఉన్నట్లుండి విచిత్రంగా బెహేవ్ చేస్తున్నాయని.. ఆ పోలీస్ చెప్తుంది.

ఇక ఆ తర్వాత వారిద్దరూ పిల్లల దగ్గరకు వెళ్తారు. అక్కడ తన మీదకు, తన చెల్లి మీదకు వాళ్ళ కుక్క ఎటాక్ చేస్తుందని చెప్పి.. గ్రహం కొడుకు దానిని చంపేస్తాడు. దానితో అతను కంగారుగా వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నైట్ నిద్రపోతున్న గ్రహం దగ్గరకు.. తన కూతురు తన దగ్గరకు వచ్చి.. బయట ఒక మోన్స్టార్ ఉంది నాకు ఒక గ్లాస్ వాటర్ కావాలని అడుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళ ఇంటి రూఫ్ పైన ఎవరో ఉండడం గమనిస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థంకాదు. కట్ చేస్తే అక్కడ అన్ని టెలివిజన్స్ లో ఒకటే న్యూస్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏలియన్స్ తిరుగుతున్నాయని చెప్తారు. అసలు అక్కడికి ఏలియన్స్ ఎలా వచ్చాయి? ఏలియన్స్ నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ‘సైన్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş