iDreamPost
android-app
ios-app

OTTలో శోభితా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. హీటు పుట్టడమే కాదు.. వణికిపోతారు!

  • Published Apr 21, 2024 | 5:54 PM Updated Updated Apr 21, 2024 | 5:54 PM

OTT Suggestions: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. నిజానికి ఇది రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శోభితా ధూళిపాళ్ల తన యాక్టింగ్ తో ఇరగదీసేసింది.

OTT Suggestions: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. నిజానికి ఇది రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శోభితా ధూళిపాళ్ల తన యాక్టింగ్ తో ఇరగదీసేసింది.

  • Published Apr 21, 2024 | 5:54 PMUpdated Apr 21, 2024 | 5:54 PM
OTTలో శోభితా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. హీటు పుట్టడమే కాదు.. వణికిపోతారు!

ఓటీటీలో ఏ సినిమా చూసినా చూడకపోయినా.. వారినికి ఒక క్రైమ్ థ్రిల్లర్ అయినా చూడాల్సిందే. అదే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అయితే ఇంకా కిక్ ఉటుంది. అలాంటి టేస్ట్ ఉన్న మూవీ లవర్స్ ఎంతో మంది ఉన్నారు. అందుకే ఇప్పటికీ రొమాంటిక్ క్రైమ్ థ్లిల్లర్స్ కి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాంటి అలవాటు మీకు కూడా ఉందా? ఏదో ఒక మూవీ సెలక్ట్ చేసి స్టార్ట్ చేశాక బాధ పడుతున్నారా? అయితే మేము ఇచ్చి సజీషన్ ని ఫాలో అయిపోండి. మంచి మంచి ఓటీటీ మూవీస్ ని ఎంజాయ్ చేసేయండి. ఈసారి మీకోసం శోభితా ధూళిపాళ్ల- హిమేశ్ హష్మీ కాంబోలో వచ్చిన ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

సాధారణంగా క్రైమ్ అంటే చంపడం, బాడీ కనపడకుండా చేయడం చేస్తుంటారు. కానీ, ఈ మూవీలో కనిపించకుండా పోయిన శవం వచ్చి సినిమా మొత్తాన్ని నడిపించడం చూస్తే పిచ్చెక్కిపోతారు. ఈ మూవీ పేరు ‘ది బాడీ’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రిషీ కపూర్, హిమేశ్ హష్మీ, శోభితా ధూళిపాళ్ల, వేదిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొత్తం ఒక ఇల్లీగల్ ఎఫైర్, ఒక హత్య, కనిపించకుండా పోయిన శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ అందరినీ మెప్పిస్తుంది. అసలు చనిపోయిన శోభితా శవం ఏమైంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అలాగే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న రిషీ కపూర్ కి కూడా ఆ విషయం అంతు చిక్కదు. మరోవైపు పెళ్లాన్ని మోసం చేసి వేదికతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న హిమేష్ హష్మీకి ఊహించని షాక్ తగులుతుంది.

తన భార్య ఏమైంది? తనకి ఎలా కనిపిస్తోంది? తన ప్రియురాలు వేదికపై ఎవరు దాడి చేశారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అతని మదిలో మెదులుతూ ఉంటాయి. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ అంటే స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉండాలి. ఆ విషయంలో ఈ మూవీ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ని ఇచ్చాడు. దీనికి అదనంగా హిమేష్ హష్మీకి- వేదిక- శోభితా ధూళిపాళ్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కాస్త హీటు పుట్టిస్తాయి. ప్రతి సీన్ ఒక క్లయిమ్యాక్స్ లాగానే ఆడియన్స్ కి మంచి థ్రిల్ ని ఇస్తాయి. ఒక మంచి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ అయితే ఆడియన్ కు కలుగుతుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ది బాడీ మూవీని చూసేయండి. నెట్ ఫ్లిక్స్ లేకపోతే ఈ మూవీ యూట్యూబ్ లో కూడా రెంట్ ఆన్ వ్యూ బేస్ మీద అందుబాటులో ఉంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio