iDreamPost
android-app
ios-app

థ్రిల్లర్ సినిమాలకు బాబులాంటి మూవీ ‘సెవెన్’.. లాస్ట్ ట్విస్ట్ హైలెట్

  • Published Sep 04, 2024 | 2:00 AM Updated Updated Sep 04, 2024 | 2:00 AM

OTT Suggestions- Best Crime Thriller Seven: క్రైమ్ థ్రిలర్స్ అంటే ఇష్టం ఉంటె కనుక ఈ సినిమాను అసలు మిస్ చేయొద్దు. ఇప్పటివరకు చూసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్ని ఒకెత్తయితే ఈ సినిమా ఒకెత్తు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Suggestions- Best Crime Thriller Seven: క్రైమ్ థ్రిలర్స్ అంటే ఇష్టం ఉంటె కనుక ఈ సినిమాను అసలు మిస్ చేయొద్దు. ఇప్పటివరకు చూసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్ని ఒకెత్తయితే ఈ సినిమా ఒకెత్తు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Sep 04, 2024 | 2:00 AMUpdated Sep 04, 2024 | 2:00 AM
థ్రిల్లర్ సినిమాలకు బాబులాంటి మూవీ ‘సెవెన్’.. లాస్ట్ ట్విస్ట్ హైలెట్

కొంతమంది కొన్ని పర్టిక్యులర్ జోనర్ లో ఉండే సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా హర్రర్ సినిమాలు ఎలాగూ సెర్చ్ లిస్ట్ లో ముందే ఉంటాయి. ఇక ఆ తర్వాత అందరు సెర్చ్ చేసేది మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కోసమే. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. ఇది కొత్త మూవీ అయితే కాదు కానీ.. చూస్తే మాత్రం.. ఇప్పటివరకు చూసిన హర్రర్ సినిమాలకు బాబులా అనిపిస్తుంది. 1995 లో వచ్చిన ఈ మూవీని ఇప్పటికి బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ? ఈ సినిమాను మీరు చూసారా లేదా ? ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా సోమవారం తో స్టార్ట్ అయ్యి ఆదివారంతో ఎండ్ అవుతుంది. సోమర్ సెట్ అనే డిటెక్టీవ్ హత్య జరిగిన ప్లేస్ కు వెళ్లి ఆ హత్య ఎలా జరిగింది అని ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. ఆయనకు మిల్స్ అనే ఇంకొక డిటెక్టీవ్ కూడా ఆ ఎంక్వయిరీ లో జాయిన్ అవుతాడు. ఇక డిటెక్టీవ్ సోమర్ సెట్ కు అదే లాస్ట్ కేస్. కట్ చేస్తే వీరిద్దరికి ఒక మర్డర్ జరిగిందని ఓకే కాల్ వస్తుంది. అక్కడికి వెళ్తే బాగా లావు ఉన్న అతను తాను తినే ఫుడ్ లో తల పెట్టి చనిపోయి ఉంటాడు. తన కాళ్ళు చేతులు కూడా ఫెన్సింగ్ వైర్ తో కట్టేసి ఉంటాయి. ఇక వీరిద్దరూ ఆ కేసును ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడప్పుడు వీరికి కేసు విషయంలో కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతాయి . ఎందుకంటే వారిలో ఒకరు సీనియర్ .. ఒకరు జూనియర్. కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ.. సోమర్ సెట్ ఆ కేసును మిల్స్ కు అప్పచెబుతాడు.

కట్ చేస్తే సిటీలో ఇంకొక దారుణమైన మర్డర్ జరుగుతుంది. ఆ కేసును కూడా మిల్స్ ఏ టెక్ అప్ చేస్తాడు. అక్కడ రక్తం తో గ్రిల్ల్డ్ అని రాసి ఉంటుంది. ఇక సోమర్ సెట్ ఎలాగూ వారంలో రిటైర్ అయిపోతాడని చెప్పి కేసును లైట్ తీసుకుంటాడు. పై అధికారులకు ఈ విషయం అర్ధం అవుతుంది. దీనితో కేసును ఇంకాస్త లోతుగా ఎక్స్ప్లోర్ చేయమని ఆదేశాలు జారీ చేస్తాడు. అయితే ఈ క్రమంలో వారు ఆ రెండు హత్యలు ఎలా జరిగాయో తెలుసుకుంటారు. అది బైబుల్ లోని ఏడు అంశాల ఆధారంగా జరిగినట్లుగా గుర్తిస్తారు. అంటే ఇంకా ఐదు హత్యలు త్వరలో జరగునున్నట్లుగా తెలుసుకుని.. ఎలా అయినా వాటిని ఆపాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ కిల్లర్ ఆ హత్యలను ఎందుకు చేస్తున్నాడు ? అది కూడా బైబుల్ ఆధారంగా ఎందుకు చేస్తున్నాడు ? ఆ కిల్లర్ ఎవరు ? డిటెక్టివ్స్ ఆ కిల్లర్ ని పెట్టుకున్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ‘సెవెన్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.