iDreamPost
android-app
ios-app

అందమైన అమ్మాయిల డెడ్ బాడీస్ తో పెర్ఫ్యూమ్ తయారు చేస్తే!.. OTT లో వెరైటీ ఫాంటసీ థ్రిల్లర్

  • Published Aug 07, 2024 | 1:56 PM Updated Updated Aug 07, 2024 | 1:56 PM

OTT Best Fantasy Thriller: కొందరికి కొన్ని వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే మనుషులకు కొంతమంది మనుషుల స్మెల్ నచ్చి.. వారిని చంపి పెర్ఫ్యూమ్ తయారు చేస్తే.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Fantasy Thriller: కొందరికి కొన్ని వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే మనుషులకు కొంతమంది మనుషుల స్మెల్ నచ్చి.. వారిని చంపి పెర్ఫ్యూమ్ తయారు చేస్తే.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Aug 07, 2024 | 1:56 PMUpdated Aug 07, 2024 | 1:56 PM
అందమైన అమ్మాయిల డెడ్ బాడీస్ తో పెర్ఫ్యూమ్ తయారు చేస్తే!.. OTT లో వెరైటీ ఫాంటసీ థ్రిల్లర్

ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసి ఉంటారు, సైకలాజికల్ మర్డర్స్ చూసి ఉంటారు. సైకో కిల్లర్ మర్డర్స్ చూసి ఉంటారు. కానీ ఇలాంటి సినిమా మాత్రం అసలు చూసి ఉండరు. ఈ మూవీ పేరు వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కొందరికి కొన్ని వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే మనుషులకు కొంతమంది మనుషుల స్మెల్ నచ్చి.. వారిని చంపి పెర్ఫ్యూమ్ తయారు చేస్తే.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ 18 వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో మొదలుతుంది. జాన్ అనే వ్యక్తిని పోలీసులు జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చి అక్కడకు వచ్చిన జనాలకు చూపిస్తారు. రెండు రోజులలో అతనిని ఉరి తీయబోతున్నారని.. ఉరి తీసే ముందు అతనికి చిత్ర హింసలు పెట్టి కాళ్ళు చేతులు విరగొట్టబోతున్నారని ఓ వ్యక్తి చెప్పగానే.. జనం అంతా సంతోషంగా ఉంటారు. అసలు జాన్ గతం ఏంటంటే.. జాన్ పుట్టగానే అతని తల్లి మరణిస్తుంది. కట్ చేస్తే జాన్ ను చుట్టూ ఉన్న వాళ్ళు ఒక అనాధ ఆశ్రమంలో వదిలేస్తారు. అక్కడ కొంతమంది పిల్లలు జాన్ ను చంపబోతారు. అయితే జాన్ కు స్మెల్ ద్వారా ఈ విషయం పసిగట్టి అరవడంతో.. అక్కడ ఉన్న వాళ్ళు అతనిని రక్షిస్తారు. అలా జాన్ పెరిగిపెద్దవాడయ్యే కొద్దీ ఆ వాసన చూసే పవర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఏకంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును , వ్యక్తిని కూడా జాన్ స్మెల్ చేయగలడు. కొన్నేళ్ల తర్వాత జాన్ పారిస్ కు వెళ్లి అక్కడ జంతు చర్మాలను అమ్మడం మొదలు పెడతారు. అప్పటినుంచి జాన్ కొత్త స్మెల్స్ కోసం ఎదురుచూస్తుంటాడు.

ఈ క్రమంలో అతనికి ఒక అమ్మాయి ఒంటి వాసన బాగా నచ్చేస్తుంది. ఆ వాసనతో జాన్ పిచ్చెక్కిపోయే.. ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. జాన్ ఆమెను పట్టుకుని గట్టిగా ముక్కు మూసేయడంతో ఆమె చనిపోతుంది. కానీ జాన్ కు మాత్రం ఆ అమ్మాయి సువాసనను తనలోనే దాచుకోవాలని అనుకుంటాడు. దీనితో మనుషుల బాడీతో పెర్ఫ్యూమ్ చేయాలనీ అనుకుంటాడు. అప్పటినుంచి దానికోసం రకరకాల ప్రయోగాలు చేస్తాడు. కానీ మనిషితో మాత్రం చేయడం కుదరని అర్థమౌతుంది. కట్ చేస్తే అతనికి అచ్చం అలాంటి వాసనే మరొక అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది. అయితే మనుషుల నుంచి పెర్ఫ్యూమ్ తయారు చేయడం కోసం 13 మంది అమ్మాయిలను చంపేసి నగ్నంగా రోడ్ మీద పడేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? జాన్ మనుషుల శరీరంతో పెర్ఫ్యూమ్ తయారు చేశాడా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “పెర్ఫ్యూమ్:ది స్టోరీ ఆఫ్ మర్డరర్” అనే ఈ సినిమాను చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet