OTT Releases- Heroine Anjali Horror Movie: OTTని షేక్ చేస్తున్న అంజలి హారర్ మూవీ.. అదిరిపోయే రికార్డు!

OTTని షేక్ చేస్తున్న అంజలి హారర్ మూవీ.. అదిరిపోయే రికార్డు!

OTT Releases- Heroine Anjali Horror Movie: ప్రస్తుతం అంతా హారర్ మూవీస్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంక తెలుగులో వచ్చిన హారర్ సినిమా అయితే అస్సలు వదలడం లేదు. తాజాగా ఓటీటీలో అడుగుపెట్టిన హీరోయిన్ అంజలి హారర్ కామెడీ థ్రిల్లర్ రికార్డులు సృష్టిస్తోంది.

OTT Releases- Heroine Anjali Horror Movie: ప్రస్తుతం అంతా హారర్ మూవీస్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంక తెలుగులో వచ్చిన హారర్ సినిమా అయితే అస్సలు వదలడం లేదు. తాజాగా ఓటీటీలో అడుగుపెట్టిన హీరోయిన్ అంజలి హారర్ కామెడీ థ్రిల్లర్ రికార్డులు సృష్టిస్తోంది.

ఓటీటీల్లోకి కొత్త సినిమా వస్తోంది అంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతున్నారు. ఏ కాస్త స్టోరీ ఉన్నా అస్సలు వదలడం లేదు. ఇప్పటికే ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు ఓటీటీలను షేక్ చేస్తున్నాయి. అయితే రికార్డులు బద్దలు కొట్టడం అంటే అంత ఈజీ కాదు మరి. కానీ, తాజాగా వచ్చిన అంజలి హారర్ మూవీ స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని ఒక రేర్ ఫీట్ ని చేసి చూపించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మిలియన్ల కొద్దీ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో.. తెలుగు సినిమా అభిమానులు వావ్ అంటున్నారు. అంజలి హారర్ మూవీ మంచి అప్లాజ్ సొంతం చేసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ హారర్ మూవీ మరేదో కాదు.. గీతాంజలి మళ్లీ వచ్చింది. గతంలో వచ్చిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకులను భయపెడుతూనే.. కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా తీసుకొచ్చారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఇరగదీసింది. మే 8న ఆహాలోకి వచ్చిన ఈ మూవీ ఏకంగా రెండు వారాలు కూడా కాకుండానే 75 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది ఆ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన తర్వాత తెలుగు ఆడియన్స్ వావ్ అంటున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల మూవీస్ కి కూడా అంత రెస్పాన్స్ రాదు అంటున్నారు.

కథ ఏంటి?:

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ విషయానికి వస్తే.. గీతాంజలి- అంజలి అక్కా చెల్లెళ్లు. రావు రమేశ్ గీతాంజలిపై మనసు పడి.. ఆమెను లొంగదీసుకోవాలి అని చూస్తాడు. చెంపదెబ్బ కొట్టడంతో ఆమెను హత్య చేయిస్తాడు. ఆ తర్వాత రావు రమేశ్ కూడా చనిపోతాడు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలంక శంకర్, సత్యం రాజేశ్ సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి ఒక నిర్మాత పిలిచి మరీ అవకాశం ఇస్తాడు. కథ కూడా తానే చెప్తాడు. కానీ, షూటింగ్ కి మాత్రం ఒక బూత్ బంగ్లాను సెలక్ట్ చేస్తాడు. అక్కడ 3 దెయ్యాలు ఉంటాయి. వాటికి మరో కథ ఉంటుంది. అసలు ఆ నిర్మాత కథ ఎందుకు చెప్పాడు? ఆ బంగ్లాలోనే సినిమా తీయాలి అని ఎందుకు కండిషన్ పెట్టాడు? ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వీళ్లు అక్కడే ఎందుకు సినిమా తీయడానికి వెళ్లారు? అసలు ఆ మూడు ఆత్మల కథ ఏంటి? వాళ్లు ఎందుకు చచ్చిపోయారు? ఇలా చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాని ఆహాలో చూడాల్సిందే.

Show comments