iDreamPost
android-app
ios-app

ఇంటి నిండా శవాలు.. చేతబడుల పేరిట అరాచకాలు.. ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలోకి ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. ఇంటి నిండా శవాలతో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ కథ ముందుకు వెళ్తుంది.

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలోకి ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. ఇంటి నిండా శవాలతో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ కథ ముందుకు వెళ్తుంది.

ఇంటి నిండా శవాలు.. చేతబడుల పేరిట అరాచకాలు.. ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

సిరీసుల్లో క్రైమ్ సిరీస్లు వేరయా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశారు అంటే.. నిద్ర కూడా పోలేరు. ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని స్టార్ట్ చేస్తే పూర్తి చేసే వరకు మీకు నిద్ర కూడా పట్టదు. అలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ మీరు గతంలో ఏమైనా చూశారా? అలాంటి ఒక సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. ఈ సిరీస్లో చాలానే పాయింట్లు ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు ఎంగేజ్ చేసేందుకు ఎన్నో కాన్ ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఓపెనింగ్ సీనే.. మీకు ఇంటి నిండా ఉన్న శవాలతో స్టార్ట్ చేస్తారు. అసలు ఆ సీన్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఇంటిల్లిపాది శవాలు చూసినప్పుడే ఆడియన్స్ కి కాళ్లు, చేతులు ఆడవు. అలాంటి కేసులో ఇన్ వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది.

ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంత తేలిగ్గా పూర్తి చేసేది కాదని అధికారులకు కూడా తెలుసు. అందుకే దర్యాప్తు కోసం సస్పెన్షన్ లో ఉన్న ఒక తిక్క పోలీసును తీసుకుంటారు. ఆయనకు ఉన్న కోపం వల్లే డిపార్టుమెంట్ కి దూరంగా ఉన్నాడు. అలాంటి ఆయన్ను తప్పని పరిస్థితుల్లో ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఆ కేసును ఆ తిక్క పోలీసు మాత్రమే సాల్వ్ చేయగలడని వారికి బాగా తెలుసు. ఎంత కోపం తగ్గించుకోమన్నా కూడా ఆ పోలీసాయన మాత్రం కోపంతో ఊగిపోతూనే ఉంటాడు. తిక్కలేస్తే అవతలి వాళ్లను కొట్టేస్తాడు కూడా. అసలు అతను ఎవరు? చేయి చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అయిద్దా అనే కాలుక్యులేషన్స్ ఏం ఉండవు.

అలాంటి ఒక క్రేజీ కాప్ కి కూడా ఈ కేసు ఛాలెంజింగ్ గానే మారుతుంది. మరోవైపు ఈ సిరీస్ ని రక్తి కట్టిస్తూ ఇందులో ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ డాక్టర్ కు మానవ మాత్రులకు కనిపించని కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చెప్తే కనీసం ఎవరూ నమ్మలేరు కూడా. తనకు ఉన్న శక్తుల గురించి తెలిసిన ఆమె మిత్రులు మాత్రం అది వరం అనుకుటారు. కానీ, అది ఎంత పెద్ద శాపమో ఆ డాక్టరమ్మకు బాగా తెలుసు. అలా ఈ కథ ఒక కుటుంబం మృతితో స్టార్ట్ అవుతుంది. అసలు అవి ఆత్మహత్యలా? హత్యలా? లేక బలిదానాలా? అక్కడ ఏవో పూజలు చేసిన దాఖలాలు కూడా ఉంటాయి.

వీటన్నింటికి తోడు ఆ కుటుంబానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్, టీఆర్పీ కోసం పాకులాడే కొన్ని ఛానల్స్ కూడా ఈ కేసు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ క్రైమ్ సిరీస్ పేరు ‘గాంట్ ఛాప్టర్ 1’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ బాలీవుడ్ ది అయినా కూడా.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి.. ఈ గాంట్ సిరీస్ సీజన్ 1 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.