iDreamPost
android-app
ios-app

OTTలో హారర్ సిరీస్.. దెయ్యాన్ని లైవ్ లో చూపిస్తానన్న కాజల్ కి ఏమైంది?

  • Published Mar 16, 2024 | 4:26 PM Updated Updated Mar 16, 2024 | 4:26 PM

OTT Suggestions: కాజల్ అగర్వాల్ ని అందంగా, లవబుల్ క్యారెక్టర్స్ లో చూసుంటారు. కానీ, దెయ్యంలాగా భయపెట్టడం మాత్రం చూసుండరు. ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ భయ పెట్టడమే కాదు.. వణికించేస్తుంది.

OTT Suggestions: కాజల్ అగర్వాల్ ని అందంగా, లవబుల్ క్యారెక్టర్స్ లో చూసుంటారు. కానీ, దెయ్యంలాగా భయపెట్టడం మాత్రం చూసుండరు. ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ భయ పెట్టడమే కాదు.. వణికించేస్తుంది.

  • Published Mar 16, 2024 | 4:26 PMUpdated Mar 16, 2024 | 4:26 PM
OTTలో హారర్ సిరీస్.. దెయ్యాన్ని లైవ్ లో చూపిస్తానన్న కాజల్ కి ఏమైంది?

ఓటీటీల్లో ఎన్ని సినిమాలు ఉన్నా.. వారానికి ఒక్క హారర్ సినిమా అయినా చూడకపోతే కొంతమందికి కిక్ ఉండదు. అయినా ఓటీటీలో ఉన్న హారర్ సినిమాలు, సిరీస్ లలో ఏవి బాగుంటాయి? ఏవి చూడాలి అనే విషయం అయతే క్లారిటీ ఉండదు. ఒక్కోసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమా లేదా సిరీస్ బాగోకపోతే బాధ పడాలి. అందుకే మీరు అలా ఫీలవ్వకూడదు అని మేమే మీకు మంచి మంచి సినిమాలు, సిరీస్ లను సజీషన్స్ గా చెప్తున్నాం. అలాగే మరీ ముఖ్యంగా హారర్ సినిమాలను రికమెండ్ చేస్తున్నాం. ఈసారి కూడా ఒక మంచి హారర్ వెబ్ సిరీస్ తో వచ్చేశాం. పైగా ఇందులో లీడ్ క్యారెక్టర్ కాజల్ అగర్వాల్ చేసింది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎలా ఉంటుందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సిరీస్ పేరు లైవ్ టెలికాస్ట్. ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో ప్లే చేసింది. ఒక్క కాజల్ మాత్రమే కాకుండా.. వైభవ్ రెడ్డి, ఆనంది, ప్రేమ్ జీ అమరెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ మొత్తం ఒక సాధారణ వెబ్ సిరీస్ లాగానే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న టెలివిజన్స్ హడావుడి, టీఆర్పీ రేటింగ్ పోటీలు, టాప్ రేటింగ్ కోసం పడే పాట్లను ఈ సిరీస్ లో బాగా చూపించారు. అలాగే ప్రోగ్రామ్ ప్రొడ్యూసింగ్, ఐడియాస్ అంటూ కొందరు చేసే వింత ప్రోగ్రాములు కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి విషయాలను హైలెట్ చేస్తూ ఈ సిరీస్ ని డిజైన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ పేరు లైవ్ టెలికాస్ట్. ఇది 2021 ఫిబ్రవరి 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హాట్ స్టార్ స్పెషల్ గా వాళ్లే నిర్మించారు. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. మొత్తం 7 భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

Kajal live telecast web series in OTT

ఈ సిరీస్ కు ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కాస్త ల్యాగ్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ, వెబ్ సిరీస్ లు అంటే కాస్త అలాంటి ఇబ్బంది ఉంటుంది. ఆ ఒక్కటీ పక్కన పెడితే ఈ లైవ్ టెలికాస్ట్ సిరీస్ మంచి వాచింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. టీఆర్పీ కోసం ఓ ఛానల్ కాజల్ ను ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గా తీసకుంటుంది. ఆమెకు ఉన్న ఎక్స్ పీరియన్స్ తో ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన బంగ్లాని సెలక్ట్ చేస్తారు. అది హాటింగ్ హౌస్ అని అందరూ అంటారు. అక్కడ కొందరు జూనియర్ ఆర్టిస్టులకు దెయ్యాల గెటప్ వేసి కొన్ని ఎఫక్ట్స్ తో ఒక మంచి షో ప్లాన్ చేయాలి అని కాజల్ అనుకుంటుంది.

అక్కడికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉండే అతీత శక్తులు వారిని నిజంగానే భయపెట్టడం మొదలు పెడతాయి. మొదట అది అంతా యాక్టింగ్ అనుకుంటారు. కానీ, కాసేపటికి అందరికీ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు షూటింగ్ అనుకుంటారు. ఆ తర్వాత అందరికీ అది పీడకలలా మారిపోతుంది. వీళ్ల షోని ఎంత ఆపాలి అనుకున్న అది కుదరదు. వీళ్లు దెయ్యాలతో పడే బాధలు లైవ్ టెలికాస్ట్ అవతూనే ఉంటుంది. ఎవరు వచ్చినా వారిని రక్షించడం అవ్వదు. టీఆర్పీ కోసం వీళ్లు చేసిన పని అంతమంది ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ కూడా ఏం చేయలని పరిస్థితి వస్తుంది. అసలు వాళ్లంతా ఎలా ఇరుకున్నారు? అక్కడ ఉన్న దెయ్యాలు ఎవరు? ఎందుకు అంతమందిని ఇబ్బంది పెట్టారు? అనే విషయాలు తెలియాలి అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom