iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ థ్రిల్లర్.. ధనుష్ ని ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడూ చూసుండరు!

  • Published Aug 06, 2024 | 7:51 AM Updated Updated Aug 06, 2024 | 7:51 AM

OTT Suggestions- Dhanush Vada Chennai Movie: ఓటీటీలో మీరు మంచి యాక్షన్ చిత్రం చూడాలి అనుకుంటుంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా ట్రై చేయండి. ధనుష్ కెరీర్లో ఇది ఒక బెస్ట్ యాక్షన్ చిత్రం. కథ, టైకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

OTT Suggestions- Dhanush Vada Chennai Movie: ఓటీటీలో మీరు మంచి యాక్షన్ చిత్రం చూడాలి అనుకుంటుంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా ట్రై చేయండి. ధనుష్ కెరీర్లో ఇది ఒక బెస్ట్ యాక్షన్ చిత్రం. కథ, టైకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

  • Published Aug 06, 2024 | 7:51 AMUpdated Aug 06, 2024 | 7:51 AM
OTTలో బెస్ట్ థ్రిల్లర్.. ధనుష్ ని ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడూ చూసుండరు!

ఓటీటీలో మీకు బాగా నచ్చిన జానర్ ఏది అంటే.. వందకు 70 మంది యాక్షన్ అనేస్తారు. నిజానికి ఎంతో మందికి నచ్చేవి యాక్షన్ చిత్రాలే. అయితే అందులో కూడా హాలీవుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. కానీ, ఇండియన్ సినిమాలో చాలానే యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన యాక్షన్ డ్రామాలు చూస్తే పిచ్చెక్కిపోతారు. అలాంటి ఒక మూవీ గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. అది ఎవరో చిత్రం కాదు.. స్టార్ హీరో ధనుష్ మూవీ. ఈ సినిమా ఓటీటీలో ఉన్నా కూడా చాలమందికి తెలియదు. తెలుగు ఆడియన్స్ లో చాలామందికి ఈ సినిమా తెలిదు. మరి.. ఆ యూక్షన్ డ్రామా ఎందుకు స్పెషలో చూద్దాం.

ఈ మూవీలో ధనుష్ ఎంతో ఫ్యూరోషియస్ యంగ్ మ్యాన్ గా కనిపిస్తాడు. 20 ఏళ్ల కుర్రాడు క్యారెమ్స్ ఆట అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు బెట్ మ్యాచెస్ కూడా ఆడుతూ ఉంటాడు. కానీ, అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక గొడవ వల్ల జైలుకు వెళ్తాడు. అక్కడ ఒక గ్యాంగుకు చెందిన ఫోన్ ని జైలర్ కి ఇచ్చినందుకు గుణ గ్యాంగ్ కు పగోడు అవుతాడు. దాదాపుగా ప్రాణం పోయినంత పని అవుతుంది. కానీ, జైలర్ ధనుష్ ని కాపాడతాడు. గుణ వాళ్లకు శత్రువుగా ఉన్న సెంథిల్ గ్యాంగుకు ధనుష్ దగ్గరవుతాడు. జైలులో 11వ బ్లాక్ నుంచి సెంథిల్ ఉండే 7వ బ్లాక్ కి మారతాడు. అందకంటే ముందు సెంథిల్ మనిషి ప్రాణాలు కూడా కాపాడతాడు. ఈ వ్యవహారలతో ధనుష్ గుణ(సముద్రఖని) గ్యాంగ్ కి శత్రువుగా మారిపోతాడు.

ధనుష్ జీవితంలో ఎన్నో కలలు కంటాడు. కానీ, అవేమీ జరగవు. అతని జీవితం ఎప్పుడూ తాను ఊహించని విధంగానే మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మాదకద్రవ్యాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. వాటి రవాణా, దందా విషయంలోనే సెంథిల్, గుణ గ్యాంగుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవల్లో అన్బు(ధనుష్) కూడా భాగం అయిపోతాడు. అయితే ధనుష్ తన ప్రాంతం కోసం పోరాడుతూ ఉంటాడు. మరోవైపు ముత్తు అనే ఎమ్మెల్యే కూడా ఈ దందాలో పోటీదారుగా ఉంటాడు. అయితే ఈ మొత్తం కథలోకి అన్బు ఎలా వచ్చాడు? ఎలా ఇరుక్కున్నాడు? అతను కూడా ఒక దాదాగా ఎదిగాడా? అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనే విషయాలు తెలియాలి అంటే ఈ ‘వడా చెన్నై’ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom