iDreamPost
android-app
ios-app

OTTలో భయపెట్టే లవ్ స్టోరీ.. ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే వణికిపోతారు!

  • Published Aug 01, 2024 | 2:00 AM Updated Updated Aug 01, 2024 | 2:00 AM

OTT Suggestions- Crazy Love Story You Movie: ఓటీటీలో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ మూవీ జోలికి వెళ్లకండి. కానీ, ఒక అదిరిపోయే థ్రిల్లర్ లవ్ స్టోరీ చూడాలి అంటే మాత్రం ఈ మూవీ తప్పకుండా చూడండి.

OTT Suggestions- Crazy Love Story You Movie: ఓటీటీలో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ మూవీ జోలికి వెళ్లకండి. కానీ, ఒక అదిరిపోయే థ్రిల్లర్ లవ్ స్టోరీ చూడాలి అంటే మాత్రం ఈ మూవీ తప్పకుండా చూడండి.

  • Published Aug 01, 2024 | 2:00 AMUpdated Aug 01, 2024 | 2:00 AM
OTTలో భయపెట్టే లవ్ స్టోరీ.. ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే వణికిపోతారు!

ఓటీటీలో ఒక మంచి ప్రేమకథ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని చూడకండి. ఒక ఇంట్రెస్టింగ్.. ఇన్టెన్స్ ప్రేమకథని చూడాలి అనుకుంటే మాత్రం దీనిని చూడండి. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రేమ ముసుగులో ఒక భయంకరమైన ప్రియుడిని కూడా పరిచయం చేస్తుంది. మొదట్లో ఈ సినిమా అందమైన కావ్యంగా ఉంటుంది. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కాసేపటికే మీ అభిప్రాయం మారిపోతుంది. ఒక భయానక ప్రేమకథను చూస్తున్నాం అనే విషయం చాలా త్వరగానే అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ మిమ్మల్ని కాస్త కంగారు పెడుతుంది. మరి.. ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

ఈ మూవీలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ఇష్ట పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు తెలియకుండానే అన్ని వివరాలు సేకరిస్తాడు. సాధారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్తే ఎవరు ఏంటి అనేది ఇట్టే చెప్పేయచ్చు. అతను కూడా ఆమె సోషల్ ప్లాట్ ఫామ్స్ లోనే ఎక్కువ సమాచారం, పొటోలు సేకరిస్తాడు. ఆ తర్వాత నేరుగా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్తాడు. అలాగే ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె అలవాట్లు, అభిరుచులు, ఆలోచన విధానం తెలుసు కాబట్టి.. ఇట్టే ఆమెను ముగ్గులోకి దించుతాడు.

అతను ఒక మంచి వ్యక్తిగా ఆమె దగ్గరకు చేరతాడు. ఆ తర్వాత వాళ్లు ఇద్దరూ ప్రేమలో పడతారు. కలిసి తిరగడం, మాట్లాడుకోవడం.. దాదాపుగా ప్రేమలో పడిపోతారు. చట్టాపట్టాలేసుకు తిరుగుతూ ఉంటారు. అయితే ఆమె కేవలం అతనికి మాత్రమే సొంతం అనే ధోరణిలో అతని ప్రవర్తన ఉంటుంది. ఆమె ఎవరితో మాట్లాడుతోంది? ఎవరిని కలుస్తోంది? ఇలాంటి వాకబు చేస్తుంటాడు. ఆమె తన ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా అది చాలా పెద్ద తప్పు అన్నట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్లకు ఆమెకు కూడా అతని ప్రవర్తనపై అనుమానం వస్తుంది. తీరా చూస్తే అతను ఒక మెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు అని తెలుస్తుంది. అతను ఆమె ఫ్రెండ్స్ ని చంపడానికి కూడా వెనకాడడు. ఇలా ఈ ప్రేమకథ కాస్త కంగారు పెట్టించే విధంగానే ఉంటుంది. అక్కడక్కడ కాస్త బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్ పేరు “YOU”. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss