iDreamPost
android-app
ios-app

బ్రిటిష్ ఆర్మీ ఆత్మలుగా వస్తే.. OTTలో భయపెట్టే హారర్ సిరీస్!

  • Published Aug 03, 2024 | 5:24 PM Updated Updated Aug 03, 2024 | 5:24 PM

OTT Horror Web Series In Telugu: కొన్ని వెబ్ సిరీస్ లు ఎన్ని సార్లు చూసినా కానీ అసలు బోర్ కొట్టవు.. అలాంటి వెబ్ సిరీస్ లలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఒకటి. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

OTT Horror Web Series In Telugu: కొన్ని వెబ్ సిరీస్ లు ఎన్ని సార్లు చూసినా కానీ అసలు బోర్ కొట్టవు.. అలాంటి వెబ్ సిరీస్ లలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఒకటి. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

  • Published Aug 03, 2024 | 5:24 PMUpdated Aug 03, 2024 | 5:24 PM
బ్రిటిష్ ఆర్మీ ఆత్మలుగా వస్తే.. OTTలో భయపెట్టే హారర్ సిరీస్!

హర్రర్ కాన్సెప్ట్ కు మైథలాజి టచ్ ఇస్తే .. ఇక ఆ సినిమా కానీ, సిరీస్ కానీ కంప్లీట్ అయ్యేంతవరకు ఎక్కడికి కదలాలని అనిపించదు. ఇలా మిక్స్డ్ కాన్సెప్ట్ లో చాలా తక్కువ సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉంటాయి. ఇక ఈ జోనర్ లో వచ్చే వెబ్ సిరీస్ లైతే నెక్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పి తీరాల్సిందే. వీటిలో కొన్ని వెబ్ సిరీస్ లు ఎన్ని సార్లు చూసినా కానీ అసలు బోర్ కొట్టవు.. అలాంటి వెబ్ సిరీస్ లలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఒకటి. మరి ఈ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. సిరీస్ స్టార్టింగ్ లో నీళ్జా అనే ఊరిని చూపిస్తారు. అక్కడ ప్రజలంతా కూడా దెయ్యాల రాజైన బేతాళ్ ను పూజిస్తూ ఉంటారు. అదే ఊరిలో ఉంటున్న ఓ మహిళ సహాయంతో ఆ ఊరి ప్రజలు బేతాళ్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఆమె పేరు మౌసీ. బలి ఇచ్చిన గొర్రె రక్తాన్ని ముందు మౌసీతో తాగించి.. తర్వాత దానిని బేతాళ్ విగ్రహాన్ని తగ్గించడంతో.. బేతాళ్ ఆత్మ ఆమెలోకి వస్తుంది. ఇలా ఓ రోజు ఆ ఆత్మ వాళ్ళతో.. కొండమీద ఉన్న గుహను ధ్వంసం చేయడానికి కొంతమంది వస్తున్నారు. దానిని మీరు కాపాడండి అని చెప్తుంది. ఆ గుహ బ్రిటిష్ కాలం నాటిది.. అలాగే బ్రిటిష్ మిలటరీ కి సంబంధించిన ఓ ఇళ్ళు కూడా ఉంటుంది. ఆ ఇంట్లోనే మౌసీ ఉంటుంది. ఆ తర్వాత రోజు..బేతాళ్ ఆత్మ చెప్పినట్లే తర్వాత రోజు కొంతమంది ఆఫీసర్స్ అక్కడకు వస్తారు. ఆ ఊరిలో ఉండే గుహను కొట్టేసి.. ఆ దారి నుంచి డైరెక్ట్ గా సిటీకి కనెక్ట్ అయ్యే హై వే ను కంస్ట్రక్ట్ చేయాలనీ అనుకుంటారు.

కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం దానికి అసలు ఒప్పుకోరు. ఇలా చేయడానికి వీలు లేదని గొడవ చేస్తారు. ఆ ఆఫీసర్ తో పాటు తన ఫ్యామిలీ కూడా రావడంతో.. ఆ ఆఫీసర్ గవర్నమెంట్ నుంచి ఓ పోలీస్ స్క్వాడ్ ను పిలిపిస్తాడు. డ్యాగి అనే అమ్మాయి ఆ స్క్వాడ్ కు హెడ్ గా ఉంటుంది. ఆ టీమ్ అంతా కూడా డ్యాగి మాటలు ఫాలో అవుతారు. వీరు వచ్చి వార్నింగ్ ఇచ్చినా కానీ ఆ ఊరి ప్రజలు మాట వినరు. దీనితో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ విషయం మౌసీ కి కూడా చెప్తారు. ఆ తర్వాత ఏమైంది ? ఆ విలేజర్స్ కు వారికి మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “బేతాళ్ ” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş