iDreamPost
android-app
ios-app

అద్దం లోని దెయ్యాలు మనుషులని చంపేస్తే ! OTT లో వేరే లెవెల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Aug 03, 2024 | 1:00 AM Updated Updated Aug 03, 2024 | 1:00 AM

OTT Best Horror Suspense Thriller : హర్రర్ మూవీస్ అంటే కచ్చితంగా దెయ్యం మనుషులను ఎలా టార్చర్ చేస్తుంది.. ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనేది ప్లాట్. అయితే ఈ సినిమాలో.. అద్దం మనుషులను చంపేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Suspense Thriller : హర్రర్ మూవీస్ అంటే కచ్చితంగా దెయ్యం మనుషులను ఎలా టార్చర్ చేస్తుంది.. ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనేది ప్లాట్. అయితే ఈ సినిమాలో.. అద్దం మనుషులను చంపేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

  • Published Aug 03, 2024 | 1:00 AMUpdated Aug 03, 2024 | 1:00 AM
అద్దం లోని దెయ్యాలు మనుషులని చంపేస్తే ! OTT లో వేరే లెవెల్  హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

హర్రర్ మూవీ కథలు ఎన్ని చూసినా కానీ ఇంకా ఎక్కడో ఓ దగ్గర నుంచి పుట్టుకొస్తున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీ లో సెర్చ్ చేసే కొద్దీ చాలా రకాల హర్రర్ సినిమాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ కాన్సెప్ట్ కు అలవాటు పడి ఉన్నారు కాబట్టి.. ఈజీగా నెక్ట్ సీన్ ఏంటా అనే గెస్ చేసేస్తున్నారు. కానీ ఈ మూవీలో సీన్స్ మాత్రం గెస్ చేయడం కష్టం. హర్రర్ మూవీస్ అంటే కచ్చితంగా దెయ్యం మనుషులను ఎలా టార్చర్ చేస్తుంది.. ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనేది ప్లాట్. అయితే ఈ సినిమాలో.. అద్దం మనుషులను చంపేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలు చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ కాస్త కంఫ్యూజింగ్ గా ఉంటుంది. 2002 లో ఈ మూవీ కథ స్టార్ట్ అవుతుంది. అలెన్ తన భార్య మేరితో కలిసి ఓ కొత్త ఇంట్లోకి వస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉంటారు. కొత్త ఇంట్లోకి వచ్చే ముందు వారు కొంత ఫర్నిచర్ ను తీసుకుంటారు. అందులో ఓ యాంటిక్ మిర్రర్ ఉంటుంది. దానిని అలెన్ తన ఆఫీస్ రూమ్ లో డెకరేట్ చేయడానికి పెట్టుకుంటాడు. వీరు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆ మిర్రర్ లో చూసుకున్న ప్రతి సారి వింత వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. వారు మొక్కలు చనిపోవడం , కుక్క వింత వింతగా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓ రోజు ఆ ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటూ వాళ్ళ నాన్న ఆఫీస్ లోకి చూసినప్పుడు.. అలెన్ వెనుక ఎవరో లేడి అతనికి మసాజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అలెన్ ఏమో అలాంటిది ఏమి జరగలేదని చెప్తాడు. దీనితో అలెన్ భార్యకు అతనిపై అనుమానం స్టార్ట్ అవుతుంది.

ఇక అప్పటినుంచి ఆ భార్య భర్తల ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. దీనితో మేరీ నేరుగా అలెన్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి.. ఆ మిర్రర్ లో చూస్తుంది. కట్ చేస్తే ఆమెలోకి ఎవరో ఆత్మ ప్రవేస్తుంది. ఇంట్లో పిల్లలను , భర్తను కొడుతూ.. వాళ్లపై అట్టాక్ చేస్తుంది. దీనితో అలెన్ ఆమెను బందించి ఓ రూమ్ లో లాక్ చేస్తాడు. అయితే వాళ్ళ ఇంటికి ప్రతి సారి ఓ కాల్ వస్తుంది. ఆ కాల్ లో మీ నాన్న ను ఫోన్ చేయమని చెప్పు అనే ఓ వాయిస్ వినిపిస్తుంది. ఆ పిల్లలేమో వాళ్ళ అమ్మను చూసి భయపడతారు. మరోవైపు వాళ్ళ నాన్న ఆఫీస్ రూమ్ లో ఉంటూ ఆ మిర్రర్ వైపే చూస్తూ ఎదో మాట్లాడుతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆ మిర్రర్ లో వీరికి కనిపిస్తున్నది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే “ఆక్యులస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş