iDreamPost
android-app
ios-app

కోరికలకు బానిసగా మారి.. కిల్లర్ తో ప్రేమ.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

OTT Suggestions Best Watch Alone Series Dark Desire: మీరు ఓటీటీలో చాలానే సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని చూసుండరు. ఎందుకంటే ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని చూస్తే మాత్రం ఆ థ్రిల్ వేరు ఉంటుంది. కానీ, సింగిల్ గా చూస్తే బెటర్.

OTT Suggestions Best Watch Alone Series Dark Desire: మీరు ఓటీటీలో చాలానే సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని చూసుండరు. ఎందుకంటే ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని చూస్తే మాత్రం ఆ థ్రిల్ వేరు ఉంటుంది. కానీ, సింగిల్ గా చూస్తే బెటర్.

కోరికలకు బానిసగా మారి.. కిల్లర్ తో ప్రేమ.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

ప్రేమ ఎంతో పవిత్రమైన బంధం. ఇప్పుడు చాలామంది ఈ బంధాన్ని తమ అవసరాలు, కోరికలు తీర్చుకోవాడనికి ఒక సాధనంగా వాడుతున్న విషయం తెలిసిందే. అలాగే వారిలో ఉన్న కొన్ని లైం*గిక వాంఛలను తీర్చుకోవడం కోసం కూడా ఈ ప్రేమ అనే బంధాన్ని వాడుతుంటారు. అలాంటి ఒక పాయింట్ మీద క్రేజీ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉందని తెలుసా? అయితే ఇది కాస్త వైలెంట్ గా.. బో*ల్డ్ గా ఉంటుంది. కానీ, మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ కి పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? దాని కథ ఏంటో చూద్దాం.

సాధారణంగా సినిమాలు, సిరీస్లు అంటే ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కథలకు అయితే ఇంకా మంచి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా ఇలాంటి సిరీస్లు వస్తుంటాయి. ఇది అయితే మీరు తరచుగా.. వార్తల్లో చూసే పాయింట్ మీద వచ్చింది. అదే కోరికలకు బానిసలై వికృత చేష్టలు చేస్తారు అని. ఇందులో సరిగ్గా అలాంటి కథనే చూపించారు. పైగా ఇందులో ఆ ప్రియుడు ఒక కిల్లర్ కూడా. ఆ విషయం తెలిసినా హీరోయిన్ అతనికి దూరం కాలేకపోవడం గమనార్హం. అతను ఒక కామన్ మ్యాన్ లా ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అయితే అతని నిజస్వరూపం మాత్రం రివీల్ చేయడు. అలా ఆ అమ్మాయిని మోసం చేస్తాడు. ఎప్పుడైతే వారి మధ్య శారీ*రక సంబంధం స్టార్ట్ అవుతుందో.. ఇంక ఆమె అతని వలలో చిక్కుకుపోతుంది. ఎందుకంటే ఆమె ఎంత అనుకున్నా అతడిని మర్చిపోలేదు.

Dark Season

అతనిపై తనకు కలిగే కోరికలను ఆపుకోలేదు. అతను ఒక కిల్లర్ అని తన శ్రేయోభిలాషులు చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టేస్తుంది. నాకు అతనే కావాలి అని పట్టు పడుతుంది. అది చూసిన అయిన వాళ్లు కూడా నోరెళ్లబెట్టేస్తారు. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే.. పైకి కనిపించేవి అన్నీ నిజాలు కాదు.. మంచిగా కనిపించే వాళ్లంతా మంచోళ్లు కాదు అనేది పాయింట్. దానిని ఒక థ్రిల్లింగ్ వేలో చూపిస్తారు. అలాగే ఇందులో కాస్త బో*ల్డ్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే దీనిని ఒంటరిగా చూడటానికి ప్రయత్నించండి. ఇందులో మొత్తం 2 సీజన్స్ ఉన్నాయి. తొలి సీజన్లో 18 ఎపిసోడ్స్ ఉన్నాయి. రెండో సీజన్లో 15 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ పేరు ‘డార్క్ డిజైర్‘. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి