OTT Suggestions- Best Watch Alone Movie Sleeping Beauty: అందాన్ని ఎరగా వేసి.. జీవితాలతో ఆటలు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

అందాన్ని ఎరగా వేసి.. జీవితాలతో ఆటలు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Watch Alone Movie Sleeping Beauty: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ మాత్రం చూసుండరు. ఇది చాలా కొత్తగా ఉండే కథ. కష్టాలు చెబుతూనే వాటిని అధిగమించడానికి ఒక అమ్మాయి ఎంచుకున్న మార్గాల గురించి చూపిస్తారు. అయితే కాస్త బో*గా ఉంటుంది.

OTT Suggestions- Best Watch Alone Movie Sleeping Beauty: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ మాత్రం చూసుండరు. ఇది చాలా కొత్తగా ఉండే కథ. కష్టాలు చెబుతూనే వాటిని అధిగమించడానికి ఒక అమ్మాయి ఎంచుకున్న మార్గాల గురించి చూపిస్తారు. అయితే కాస్త బో*గా ఉంటుంది.

చాలామంది ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్లర్స్, సస్పెన్స్ డ్రామాలు చూడటం అలవాటు. తర్వాత ఏం జరుగబోతోంది? అనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే థ్రిల్లర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాంటి థ్రిల్లర్స్ లో కూడా కొన్ని మూవీస్ మైండ్ లో నుంచి అస్సలు పోవు. ఇది కూడా అలాంటి ఒక సినిమానే. కాకపోతే ఇందులో కాస్త అందమైన కథ ఉంటుంది. ఆ అందం వెనుక ఒక విషాద గాథ ఉంటుంది. ఒక మనిషి జీవితంలో ఇన్ని కష్టాలు ఉంటాయా అనే ఆలోచన కూడా వస్తుంది. డబ్బు సంపాదన కోసం ఆమె చేసే కొన్ని పనులు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
ఈ మూవీ ఒక అమ్మాయి జీవితం ఆధారంగా జరుగుతూ ఉంటుంది. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంటుంది. లూసీ ఒక యూనివర్సిటీ స్టూడెంట్. ఉదయం పూట ఒక ఆఫీస్ లో కూడా పనిచేస్తూ ఉంటుంది. సాయంత్రం పూట రెస్టారెంట్ లో వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు ల్యాబ్ లో కూడా చేస్తూ ఉంటుంది. అపార్టుమెంట్లో ఉండే ఆమెకు కావాల్సిన ఖర్చుల కోసం రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. ఆమెకు తోడుగా ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఎప్పుడూ తాగుతూ.. తాగుడికి బానిస అయ్యి ఉంటాడు. అయితే అతనితో ఉన్నంతసేపు తన కష్టాలను మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉంటుంది. అతను ఎప్పుడూ తనని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటాడు. కానీ, లూసీ మాత్రం నో చెప్తూనే ఉంటుంది.

అయితే లూసీకి ఒక కొత్త బాధ్యత ఏర్పడుతుంది. దానివల్ల ఇంకో కొత్త జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఒక లేడీని కలుస్తుంది. ఆమె లింగరీ యాడ్ కోసం లూసీని మోడల్ గా తీసుకుంటుంది. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఆ పని కాస్త ఆసక్తిగా ఉంటుంది. అదేంటంటే.. ముక్కు మొఖం తెలియని వారితో నిద్రపోవాలి. ఈమె పక్కనే పడుకుని.. ఆమెను పట్టుకుని వాళ్లు నిద్రిస్తారు. కానీ, ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. అలాంటి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈమె ఒక లగ్జరీ అపార్టుమెంట్ కి కూడా మారుతుంది.

అయితే అలా నిద్రపోవడానికి అంత డబ్బు ఎందుకు ఇస్తారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనే విషయం లూసీ కూడా తెలుసుకోవాలి అనుకుంటుంది. అయితే ఆ లేడీ మాత్రం చెప్పదు. అక్కడ అసలు ఏం జరుగుతోంది? లూసీ లైఫ్ లో అన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కోసం ఈ “స్లీపింగ్ బ్యూటీ” సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వబెసైట్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కథ ప్రకారం కాస్త ఎక్కువగానే బో*గా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments