iDreamPost
android-app
ios-app

ఫ్రెండ్ తండ్రితో హద్దులు దాటి.. OTTలో ‘పాయిజన్ ఐవీ’ మూవీకి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions Best Watch Alone Movie Poison Ivy: ఓటీటీలో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది సరైన్ ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఓటీటీలో ఉన్న డిఫరెంట్ థ్రిల్లర్స్ లో ఇది కూడా ఉంటుంది.

OTT Suggestions Best Watch Alone Movie Poison Ivy: ఓటీటీలో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది సరైన్ ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఓటీటీలో ఉన్న డిఫరెంట్ థ్రిల్లర్స్ లో ఇది కూడా ఉంటుంది.

ఫ్రెండ్ తండ్రితో హద్దులు దాటి.. OTTలో ‘పాయిజన్ ఐవీ’ మూవీకి పిచ్చెక్కిపోతారు!

సాధారణంగా థ్రిల్లర్ అంటే అందులో చాలానే ట్విస్టులు ఉంటాయి. అంతకు మించిన కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ట్ చేస్తే ఆపలేము అనే అంత ఉత్కంఠ ఉంటుంది.. అలాగే ఉండాలి కూడా. అయితే ఇవ్వనీ ఉండటమే కాకుండా.. వాటికి అదనంగా మంచి డ్రామా కూడా ఉన్న ఒక సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఒక అదిరిపోయే థ్రిల్లర్ ఎందుకు అయ్యింది అనే విషయం తెలియాలి అంటే మీరు ఈ మూవీని కచ్చితంగా చూడాల్సిందే. అలాగే చూసినందుకు ఏ మాత్రం నిరాశ కూడా చెందరు. మరి.. ఆ సస్పెన్స్ డ్రామా, క్రేజీ థ్రిల్లర్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఓటీటీలో చాలానే థ్రిల్లర్స్ అందుబాటులో ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడనివి ఉంటాయి. వాటిలో ఈ థ్రిల్లర్ కూడా ఒకటి. నిజానికి ఇది హాలీవుడ్ నుంచి వచ్చిందే గానీ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఇద్దరు అమ్మాయిలు.. వారి జీవితాలు చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయికి మంచి కుటుంబం ఉంటుంది. వాళ్లు ఎంతో సంపన్నులు కూడా. వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. కానీ, ఫ్రెండ్ రూపంలో ఒక అమ్మాయి వీళ్ల జీవితాల్లోకి వస్తుంది. తన కాలేజ్ ఫ్రెండ్ అయిన ఐవీని ఈ అమ్మాయి తన కుటుంబానికి పరిచయం చేస్తుంది.

Poison IVy

ఒకరు కోట్లకు పడగలెత్తిన వారు.. ఇంకొకరు తింటానికి తికానా లేనివాళ్లు. వీళ్ల మధ్య స్నేహం చాలా విచిత్రంగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఐవీ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తనకు సంతోషం అంటే తెలిసింది అని ఆమె అనుకుంటుంది. కానీ, అప్పటి నుంచే తనకు తన జీవితం, కుటుంబం దూరం అవుతుందనే విషయాన్ని ఆలోచించలేకపోతుంది. ఐవీ తన ఫ్రెండ్ ఇంటికి తరచూ వెళ్లడమే కాకుండా.. తన తండ్రిపై కన్నేస్తుంది. ఫ్రెండ్ తండ్రితో చనువుగా ఉంటూ వస్తుంది. వృద్ధుడు అయినా కూడా కేవలం జల్సాల కోసం అతడికి వలపు వల విసురుతుంది. తనకు కేవలం డబ్బు, స్పోర్ట్స్ కారు, విలాసాలు కావాలి. వాటికోసం ఎంతకైనా తెగిస్తుంది. అన్నంత పని చేస్తుంది కూడా. ఫ్రెండ్ తండ్రిని వలలో పడేస్తుంది.

ఫ్రెండ్ తండ్రికి ఐవీ బాగా దగ్గరవుతుంది. హద్దులు కూడా దాటేసి అతడిని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. తన ఫ్రెండ్ తల్లిని క్రమంగా భర్తకు దూరం చేస్తుంది. ఇలా ఆమె చేసే పనులు అన్నీ ఇన్నీ కాదు. మంచితనంతో దగ్గరకు రానిస్తే వారికి జీవితమే లేకుండా చేస్తుంది. ఇలాంటి ట్విస్టులు ఇంకా సినిమాలో చాలానే ఉంటాయి. ఈ మూవీ పేరు ‘పాయిజన్ ఐవీ’. ఇదే పేరుతో ఒక మొక్క కూడా ఉంటుంది. దానిని ముట్టుకుంటే దురదలు రావడం, దద్దర్లు వంటివి రావడం జరుగుతుంది. అంటే దానిని పట్టుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అదే అర్థం వచ్చేలా ఈ మూవీకి ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు. ఈ సినిమా ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. అయితే అక్కడక్కడ కాస్త బో* సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూస్తే మంచిది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.