పోలీస్ స్టేషన్ లో ప్రేమ.. OTTలో క్రేజీ లవర్స్ స్టోరీ!

OTT Suggestions- Best Watch Alone Movie Monday: మీరు ఒక క్రేజీ లవ్ స్టోరీ కోసం ఓటీటీల్లో వెతుకుతుంటే మాత్రం.. ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మీరు కచ్చితంగా దీనిని చూడాలి కూడా. కాకపోతే సోలోగా చూస్తే సో బెటర్.

OTT Suggestions- Best Watch Alone Movie Monday: మీరు ఒక క్రేజీ లవ్ స్టోరీ కోసం ఓటీటీల్లో వెతుకుతుంటే మాత్రం.. ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మీరు కచ్చితంగా దీనిని చూడాలి కూడా. కాకపోతే సోలోగా చూస్తే సో బెటర్.

ఓటీటీలో మీకు చాలానే క్రేజీ థ్రిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి కొన్ని లవ్ స్టోరీస్ మాత్రం కనిపించడం కష్టం అనే చెప్పాలి. లవ్ స్టోరీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం అందుకే ప్రేమకథలు అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లవ్ స్టోరీస్ లవ్ చేసే ఓటీటీ ప్రియులు ఎవరైనా ఉంటే వారికోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. మీరు కచ్చితంగా ఈ క్రేజీ లవర్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ల ప్రేమ కథ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా తప్ప తాగేసి.. ఒంటిపై నూలుపోగు లేకుండా పోలీసులకు చిక్కుతారు.

ఈ సినిమా అలాంటి ఒక విచిత్రమైన సీన్ తో స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా.. వాళ్లు ఒకరికి ఒకరు తెలియకుండానే అలా బీచ్ లో ఒకరిని ఒకరు వాటేసుకుని నిద్రపోతూ ఉంటారు. అది చూసిన పోలీసులు వాళ్లని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అలా కారులో వెళ్తూ ఇద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. ఆ ఫ్రెండ్ షిప్ కాస్తా.. ప్రేమగా మారి.. శారీ*రక సంబంధం కూడా ఏర్పడుతుంది. వారికి పరిచయం లేకముందే ఆ బంధం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రోపర్ గా పరిచయం చేసుకున్నాక మరోసారి బలపడుతుంది. అలా కాస్త కొత్తగానే ఈ కథ ముందుగకు వెళ్తూ ఉంటుంది.

వీళ్లిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్లు ఇద్దరికీ తింగరి పనులు అంటేనే ఇష్టం. ఏం చేసినా తింగరి తింగరిగా చేస్తూ ఉంటారు. అంటే తప్ప తాగి రోడ్ల మీద గోల చేయడం. నూలు పోగు లేకుండా.. ఇద్దరూ కలిసి బండి మీద షికారు చేయండి. నైట్ క్లబ్, పబులు అంటూ పార్టీలు చేసుకోవడం చేస్తారు. అలా వాళ్లిద్దరికి ఒకరిపై ఒకరికి చచ్చేంత ప్రేమ పుట్టుకొస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఆ సిటీకి వెకేషన్ కోసం వస్తుంది. ఆమె వెకేషన్ పూర్తైన తర్వాత తిరిగి వెళ్లిపోవాలి అనేది ఆమె ప్లాన్.

ఆమె తిరిగి వెళ్లిపోతుంది అనే విషయం తెలుసుకున్న హీరో గుండె పగులుతుంది. అయితే ఉన్న కొన్ని రోజులు అయినా అతనితో హ్యాపీగా ఉండాలి అని ఆమె అలా చేస్తుంది. మరి.. హీరోని వదిలేసి వెళ్లిపోయిందా? అక్కడే అతనితో ఉండిపోయిందా? లేక అతడినే తన వెంట తీసుకువెళ్లిందా? వంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలి అంటే మాత్రం మీరు ఈ ‘మండే (Monday)’ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఉంది. అయితే కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments