iDreamPost
android-app
ios-app

మనసులో వింత కోరికలు.. OTTలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ!

  • Published Jul 30, 2024 | 10:08 PM Updated Updated Jul 30, 2024 | 10:08 PM

OTT Suggestions- Watch Alone Movie Love And Leashes: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. ఈ మూవీలో ఇద్దరు లవర్స్ మధ్య ఒక వింత కథ నడుస్తూ ఉంటుంది. అయితే అది అలాంటి ఇలాంటి వింత కాదు. అది తెలియాలి అంటే మీరే ఆ మూవీని చూసేయండి.

OTT Suggestions- Watch Alone Movie Love And Leashes: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. ఈ మూవీలో ఇద్దరు లవర్స్ మధ్య ఒక వింత కథ నడుస్తూ ఉంటుంది. అయితే అది అలాంటి ఇలాంటి వింత కాదు. అది తెలియాలి అంటే మీరే ఆ మూవీని చూసేయండి.

  • Published Jul 30, 2024 | 10:08 PMUpdated Jul 30, 2024 | 10:08 PM
మనసులో వింత కోరికలు.. OTTలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ!

ప్రేమ కథలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒక మంచి ప్రేమకథ చూస్తే మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు అంత మంచి ప్రేమకథ కాదులెండి చెప్పేది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఇందులో మీకు ప్రేమ కంటే కూడా కొన్ని వింత కోరికలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో మూమెంట్ లో అసలు ఇలా కూడా ప్రేమించుకుంటారా? అనే భావన కలుగుతుంది. ఈ మూవీ చూసిన ఎవరికైనా ఇలాంటి ఒక ఫీలింగే కలుగుతుంది. అందుకే ఒకసారి రొటీన్ కి భిన్నంగా ఇలాంటి ఒక లవ్ స్టోరీని ట్రై చేస్తారు అని తీసుకొచ్చాం. అయితే ఇందులో కాస్త బో*ల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కలిసి కూర్చుని చూసే సినిమా అయితే కాదు.

ప్రతి లవ్ స్టోరీ ఎంతో డీసెంట్ గా, చాలా పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే మరీ ఇలాంటి ఒక ప్రయోగం మనం మన దేశం నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే ఇది కొరియా నుంచి వచ్చిన ఒక ప్రేమకథ. కథ పరంగా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ, దానిని తెరకెక్కించిన తీరు మాత్రం వావ్ అనిపిస్తుంది. అక్కడక్కడ అభ్యంతరకరంగా ఉంటుంది. అయితే సోలోగా చూస్తే అంత ఇబ్బంది ఉండదు. కానీ, కొన్ని సీన్స్ చూస్తే షాకవ్వాల్సిందే. ఒక వ్యక్తి మనసులో ఇలాంటి వింత కోరికలా? అనే నోరెళ్లబెట్టేస్తారు కూడా. ఒక ఆఫీస్ లో ఉండే కొలీగ్స్ మధ్యలో చిగురించే ప్రేమ ఎన్ని వింత పరిస్థితులకు దారి తీస్తుంది అనేది మీరు ఇక్కడ బాగా చూడచ్చు.

ఒక ఆఫీస్ లో హీరో పనిచేస్తూ ఉంటాడు. అదే కంపెనీలోకి కొత్తగా హీరోయిన్ వచ్చి చేరుతుంది. వాళ్ల పేర్లు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. చిన్న ఒత్తు మారిస్తే.. అమ్మాయి పేరు కాస్తా అబ్బాయిగా మారిపోతుంది. అయితే అతనికి వచ్చిన ఒక పార్సిల్ ని హీరోయిన్ ఓపెన్ చేస్తుంది. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ పార్సిల్ లో ఒక కుక్క బెల్ట్ ఉంటుంది. అయితే అది తన కుక్కకు అని కవర్ చేస్తాడు. కానీ, ఆ బెల్ట్ కొనుక్కుంది అతని కోసమే. అతను తనని తాను ఒక జంతువులా ఊహించుకుంటూ.. తనకి ఒక మాస్టర్ కావాలి అని కోరుకుంటాడు.

ఆ మాస్టర్ ఆ యువతి అయితే బాగుంటుంది అనుకుంటాడు. ఆమె మొదట కాస్త కంగారు పడినా కూడా.. తర్వాత మాత్రం అతడిని ఇష్టపడుతుంది. ఇంక అతని ఫాంటసీలు చూసి కొంత పిచ్చెక్కిపోతుంది. కానీ, అతనితో కలిసి ట్రావెల్ అవుతుంది. అయితే అసలు అతను అలా ఎందుకు చేస్తాడు? ఆ ఫాంటసీలు ఏంటి అనేది తెలియాలి అంటే మీరు ఈ ‘లవ్ అండ్ లీషెస్’ మూవీ చూడాల్సిందే. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి. కానీ, కాస్త ఒంటరిగా చూసే సినిమా ఇది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet