OTTలో ఒక వింటేజ్ క్రేజీ లవ్ స్టోరీ ‘బెట్టీ బ్లూ’.. సెన్సిటివ్ పీపుల్ చూడొద్దు!

OTT Suggestions- Best Watch Alone Movie Betty Blue: మీరు ఒక మంచి ప్రేమకథను చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని చూడొద్దు. ఇది ఒక విచిత్రమైన ప్రేమకథ. పైగా సెన్సిటివ్ పీపుల్ అస్సలు చూడొద్దు.

OTT Suggestions- Best Watch Alone Movie Betty Blue: మీరు ఒక మంచి ప్రేమకథను చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని చూడొద్దు. ఇది ఒక విచిత్రమైన ప్రేమకథ. పైగా సెన్సిటివ్ పీపుల్ అస్సలు చూడొద్దు.

ఓటీటీలో చాలా ప్రేమకథలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇలాంటి ఒక ప్రేమకథను మీరు ఇప్పటి వరకు కచ్చితంగా చూసి ఉండరు. పైగా ఈ మూవీ వచ్చి కూడా ఏకంగా 38 ఏళ్లు కావొస్తోంది. కానీ, ఇలాంటి ఒక మూవీని మళ్లీ సినిమా ఇండస్ట్రీలో మీరు చూసి ఉండరు. అంతేకాకుండా ఈ పిచ్చి ప్రేమకథ వచ్చింది ఇండియాలో కూడా కాదండోయ్.. హాలీవుడ్ నుంచి వచ్చింది ఈ మూవీ. ఇందులో మనం ఇన్నాళ్లు సినిమాల్లో చూసిన ప్రేమకథ ఉండదు. అసలు అది ప్రమో కాదో కూడా క్లారిటీ రాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని మరీ ఇంతలా ప్రేమిస్తారా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ప్రేమకథలు అంటే ఎవరికైనా ఇష్టమే. ఎవరైనా ప్రేమకథలు చూడాలి అనే అనుకుంటారు. కానీ, ఈ లవ్ స్టోరీని మాత్రం సెన్సిటివ్ పీపుల్ అస్సలు చూడొద్దు. ఒక మనిషిని ప్రేమిస్తే మరీ ఇంతలా ప్రేమిస్తారా అనే ప్రశ్న కచ్చితంగా తలెత్తుతుంది. ఓటీటీలో ఉన్న ప్రేమకథల్లో ది బెస్ట్ లవ్ స్టోరీల జాబితాలో ఇది కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక నావలిస్ట్ ఉంటాడు. అతనికి బెట్టీ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అతనితో పాటే అతని ఇంట్లోనే ఉంటుంది. వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తర్వాత ఆ ప్రేమ విడదీయలేని బంధంగా మారుతుంది. వీళ్ల బంధాన్ని చూసి స్థానికులు కూడా కుళ్లుకుంటారు. ఎంత చక్కగా ఉన్నారో అంటూ కళ్లుకుట్టుకుంటారు.

ఏమైద్దో ఏమో తెలియదు.. బెట్టీ మతిస్థిమితం కోల్పోతుంది. ఆమె ఏం చేస్తోంది అనే విషయం ఆమెకు అస్సలు తెలియదు. ఎవరిని పడితో వాళ్లను కొడుతుంది. ఒక్క హీరోతో తప్పితే.. ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వదు. ఆమె ప్రవర్తన వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. హీరో చాలానే ఇబ్బందులు పడతాడు. అయినా కూడా బెట్టీని వదిలించుకోవాలి అనే ప్రయత్నం మాత్రం చేయడు. ఆమెతోనే ఉండాలని.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. తన ప్రియురాలిని తన బిడ్డలా చూసుకుంటాడు. అసలు బెట్టీకి మతిస్థిమితం ఎందుకు పోతుంది? ఆమె అలా అవ్వడానికి కారణం ఏంటి? పిచ్చిది అయ్యాక హీరోకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇందులో చాలా బో* సీన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా సెన్సిటివ్ పీపుల్ ఈ ప్రేమకథను చూడలేరు. ఈ మూవీ పేరు ‘బెట్టీ బ్లూ’. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తే బెటర్. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments