iDreamPost
android-app
ios-app

పిల్లల కోసం కన్న తండ్రి పోరాటం.. OTTలో మంచి థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller Vanished Into The Night: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే.. మీకోసం ఒక అదిరిపోయే థ్రిల్లర్ తీసుకొచ్చాం. కన్న పిల్లల కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఈ మూవీ. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగిస్తాడు.

OTT Suggestions- Best Thriller Vanished Into The Night: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే.. మీకోసం ఒక అదిరిపోయే థ్రిల్లర్ తీసుకొచ్చాం. కన్న పిల్లల కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఈ మూవీ. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగిస్తాడు.

పిల్లల కోసం కన్న తండ్రి పోరాటం.. OTTలో మంచి థ్రిల్లర్!

తల్లిదండ్రులు ఎంత కష్ట పడినా? ఎంత సంపాదించినా దానికి కారణం కన్న పిల్లలు అనే చెప్పాలి. వారికి ఎంత కష్టమొచ్చినా తట్టుకుంటారేమో గానీ.. వారి పిల్లలకు కష్టం వస్తే మాత్రం ఇదిగో ఈ తండ్రిలాగానే అడ్డంగా నిలబడిపోతారు. అలాంటి ఒక తండ్రి కథ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తన పిల్లల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. ఇలాంటి తండ్రిని మనం రియల్ లైఫ్ లో కూడా చూస్తూనే ఉంటాం. అయితే రీల్ లైఫ్ లో ఇంకాస్త నాటకీయ పరిణామాలతో మరింత మెప్పించే విధంగా చూపించారు. మరి.. ఆ మూవీ ఏది? ఆ కథ ఏంటో చూద్దాం.

ఈ సినిమా చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారికి వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపొచ్చాలు వస్తాయి. మన హీరో మంచి గ్యాంబ్లర్. అయితే సంపాదించిన దానికంటే పోగొట్టిందే ఎక్కువ ఉంటుంది. అందుకే వారి వివాహ బంధాన్ని ముంగిచాలని భావిస్తారు. విడాకుల కోసం అప్లయ్ చేసుకుని విడిపోవడానికి వెయిట్ చేస్తుంటారు. అలాంటి సమయంలో వారి పిల్లలను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇంట్లో నిద్రపోతున్న పిల్లలను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లిపోతారు. అతను పిల్లల కోసం ఎంతగానో వెతుకుతాడు. కానీ, వాళ్లు ఎక్కడా కనిపించరు. పిల్లల విషయం తెలుసుకున్న భార్య కూడా కంగారు పడుతుంది. ఎలాగైనా తనకు తన పిల్లలు కావాలి అంటూ గొడవ పడుతుంది.

ఆ తర్వాత హీరోకి ఒక ఫోన్ వస్తుంది. తన పిల్లలను వదిలిపెట్టాలి అంటే మాత్రం కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు. అంత డబ్బు ఇవ్వాలి అంటే అతనికి ఒకటే మార్గం ఉంది. తన పాత కాంటాక్ట్స్ లో ఉన్న వ్యక్తిని కలవాలి. ఆఖరికి అతడిని కలుస్తాడు. అతను డబ్బులివ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ, అందుకోసం తనకి ఒక పని చేయాలి అంటాడు. అది అంత తేలిక కాదు. తన ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ, కన్న పిల్లల కోసం ఆ పని చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత హీరో పరిస్థితి ఎంత దిగజారింది? ఎలాంటి సమస్యల్లో పడ్డాడు? అసలు కిడ్నాప్ చేసింది ఎవరు? ఇంతకీ డబ్బుకోసం హీరో చెప్పిన చేశాడా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘వ్యానిష్డ్ ఇన్ టూ ది నైట్’ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş