iDreamPost
android-app
ios-app

ఆడవాళ్లను చంపి వారి జుట్టుతో.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు!

  • Published Jun 22, 2024 | 7:30 PM Updated Updated Jun 22, 2024 | 7:31 PM

OTT Suggestions Best Thriller The Stylist: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ కేటగిరీ కచ్చితంగా ఉంటుంది. అలాంటి కేటగిరీ నుంచి ఒళ్లు గగుర్పొడిచే సినిమా తీసుకొచ్చాం.

OTT Suggestions Best Thriller The Stylist: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ కేటగిరీ కచ్చితంగా ఉంటుంది. అలాంటి కేటగిరీ నుంచి ఒళ్లు గగుర్పొడిచే సినిమా తీసుకొచ్చాం.

  • Published Jun 22, 2024 | 7:30 PMUpdated Jun 22, 2024 | 7:31 PM
ఆడవాళ్లను చంపి వారి జుట్టుతో.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు!

సాధారణంగా తెలుగులో అయితే చాలా తక్కువగా సైకో కిల్లర్ మూవీస్ వస్తూ ఉంటాయి. కానీ, హాలీవుడ్ లో మాత్రం చాలా ఎక్కువగానే ఈ సైకో పాథ్ చిత్రాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడనివి ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఇలాంటి మూవీస్ ని మీరు ఒక్కసారి అయినా చూడాలి. కానీ, ఈ మూవీ చూడాలి అంటే మాత్రం కాస్త గుండెధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ మూవీలో కాస్త డిస్టర్బింగ్ దృశ్యాలు ఉంటాయి. కానీ, కథ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎంతో అందంగా ఉండే మహిళ అలాంటి పనులు చేస్తోందో అనే కాస్త బాధ కలుగుతుంది. మొత్తానికి ఇది మాత్రం ఒక మంచి థ్రిల్లర్ మూవీ.

సాధారణంగానే క్రైమ్ థ్రిల్లర్స్ లో ఏదో ఒక బలహీనత ఉన్న పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు హత్యలు చేయడం అంటే సరదా. దానికి ఒక గోల్ పెడతారు. అలా ఈ మూవీలో ఈ లేడీ సైకో కిల్లర్ గోల్ ఏంటి అంటే.. అందమైన అమ్మాయిలకు ఉండే.. అందమైన జుట్టును సేకరించడం. ఆమె అలా ఇలా కాదు.. వాళ్ల తల మీద ఉండే స్కిన్ తో సహా ఆ జుట్టును పీకేస్తుంది. ఆ తర్వాత ఆ జుట్టును తన ఇంట్లో ఉండే సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దంలో జుట్టును తన తల మీద పెట్టుకుని చూసి మురిసిపోతుంది. అలా ఆమె అందమైన అమ్మాయిల జుట్టు కలెక్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే ఆమె అలా ఎందుకు చేస్తోంది అని అనుమానం రావచ్చు. మన దగ్గర లేనిది.. ఎదుటి వాళ్ల దగ్గర ఉన్నప్పుడు మనకి సహజంగానే కుళ్లు పుడుతంది. ఆ కుళ్లుతోనే అందమైన జుట్టు కనిపిస్తే.. దానిని పీకేసే వరకు ఆమెకు నిద్ర పట్టదు. అందులోనూ ఆమెకు ఒక మంచి కుటుంబం ఉండాలి అని.. పెళ్లి చేసుకోవాలి అని.. పిల్లల్ని కనాలి అని కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి ఆ జుట్టు ప్రధాన సమస్య అవుతంది. అందుకే ఎవరైనా అందంగా ఉన్నా.. పెళ్లి చేసుకోబోతున్నా.. సంతోషంగా కనిపించినా వాళ్ల అంతు చూస్తుంది. ఈ సైకో కిల్లర్ పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

ఈ పాత్రలో కనిపించిన నయారా టౌన్ సెండ్ యాక్టింగ్ తో మెప్పిస్తుంది. ఎక్కడా కూడా అనుమానం రాకుండా అమాయకంగా కనిపించే హెయిర్ స్టైలిస్ట్ గా ఉంటుంది. కానీ, రాత్రి అయితే మాత్రం సైకో కిల్లర్ అయిపోతుంది. అయితే ఆమె వైపు నుంచి ఆలోచించేలా.. ఒక శాడ్ స్టోరీ కూడా పెడతారు. ముఖ్యంగా ఆమె ఒంటరితనంగానే అలా అయ్యి ఉండచ్చు. మరి.. ఈ సినిమా పేరు ‘ది స్టైలిస్ట్‘. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. అయితే దీనిని చిన్న పిల్లలతో చూడద్దు. అలాగే భయపడే వాళ్లు కూడా చూడద్దు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet