iDreamPost
android-app
ios-app

ప్రియురాలి కోసం యువతి వరుస హత్యలు.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller The Roommate: ఓటీటీల్లో చాలానే థ్రిల్లర్స్ ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే ది బెస్ట్ అనిపించుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక బెస్ట్ థ్రిల్లర్ నే మీకోసం తీసుకొచ్చాం. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, ట్విస్టులు పిచ్చెక్కిస్తాయి.

OTT Suggestions- Best Thriller The Roommate: ఓటీటీల్లో చాలానే థ్రిల్లర్స్ ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే ది బెస్ట్ అనిపించుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక బెస్ట్ థ్రిల్లర్ నే మీకోసం తీసుకొచ్చాం. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, ట్విస్టులు పిచ్చెక్కిస్తాయి.

ప్రియురాలి కోసం యువతి వరుస హత్యలు.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

ఓటీటీల్లో మీకు ఏ జానర్ మూవీ అయినా దొరుకుతుంది. కానీ, ది బెస్ట్ మూవీ దొరకాలి అంటే మాత్రం కాస్త వెతుకులాట తప్పనిసరి. అలా వెతుకుతూ వెతుకుతూ సినిమా చూడాలి అనే మూడు.. ఉత్సాహం రెండూ పోతాయి. అందుకే మీకోసం మంచి మూవీస్ ని సజీషన్ రూపంలో తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఇది ఆలాంటి ఇలాంటి థ్రిల్లర్ కాదండోయ్.. చూస్తే గుండె జల్లు మంటుంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని ఎందుకు అన్నామంటే.. ఇందులో అమ్మాయి కోసం అమ్మాయే హత్యలు చేస్తూ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి దగ్గరకు ఎవరు వచ్చినా వారి ప్రాణం తీసేస్తుంది.

ఓటీటీలో ఇది నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పాల్సిందే. ఇందులో హీరోయిన్ ఒక హాస్టల్ కు వెళ్తుంది. అక్కడ తనకు ఒక రూమ్ అలాట్ చేస్తారు. అందులో రెబెకా అనే యువతి కూడా ఉంటుంది. వీళ్లిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. చాలా తక్కువ సమయంలోనే రెబెకా కూడా ఆమెపై ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఆమె మాత్రం ఒక మంచి ఫ్రెండ్ గా చూస్తుంది. వాళ్లిద్దరు కలిసి తింటారు.. కలిసి పడుకుంటారు.. కలిసి అల్లరి చేస్తారు. అయితే ఒకరోజు ఆ యువతి పబ్ లో ఒక అబ్బాయిని చూస్తుంది. అతనితో డేట్ కి కూడా వెళ్తుంది. అలాగే వాళ్ల మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. కానీ, ఆ విషయం రెబెకాకు నచ్చదు.

ఇలా కొన్నిరోజులు గడిటే వరకు అసలు రెబెకా మనస్తత్వం ఏంటో ఎవరికీ తెలియదు. ఒకసారి ఆ యువతిని తన విల్లాకు తీసుకెళ్తుంది. రెబెకా చాలా రిచ్ గర్ల్. ఆమె ఇల్లు చూసి ఈ యువతి నోరెళ్లబెడుతుంది. రెబెకా తల్లితో ఈ యువతి మాట్లాడుతుంది. ఆ సమయంలో ఆమె మందులు సరిగ్గానే వేసుకుంటోందా అని తల్లి అడుగుతుంది. అదేంటి మందులు దేనికి అని ఆశ్చర్యపోతుంది. అప్పుడు తెలుస్తుంది. అసలు రెబెకా ఎవరు అని. ఆమెకు మానసికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ విషయం ఈ యువతికి తెలియదు. రెబెకాను దాటి ఎవరు ఆ యువతికి దగ్గరైనా కూడా వారి అంతు చూస్తుంది.

ఆ యువతి ప్రేమించిన అబ్బాయిని కూడా హత్య చేస్తుంది. అయితే అసలు ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో చేస్తోంది అనేది తెలియాలి. అలాగే ఆ యువతి రెబెకా నుంచి తప్పించుకుందా? తన ప్రాణాలకు కూడా హాని చేస్తుందా? అనే ప్రశ్నలు ఉంటాయి. ఈ సినిమా కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది. పైగా ఇందులో ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా పేరు ‘ది రూమ్మేట్’. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హాలీవుడ్ మూవీ కాబట్టి కొన్ని కొన్ని చోట అభ్యంతరకర సన్నివేశాలు ఉండే ప్రమాదం ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş