iDreamPost
android-app
ios-app

షెఫ్ ముసుగులో హత్యలు.. ఐల్యాండ్ లో బందించి.. OTTలో క్రైమ్ థ్రిల్లర్!

  • Published Jul 22, 2024 | 2:00 AM Updated Updated Jul 22, 2024 | 2:00 AM

OTT Suggestions- Best Thriller The Menu Movie: ఒక మంచి థ్రిల్లర్ కోసం మీరు చెక్ చేస్తుంటో మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ ని మీకోసం ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లేకి పిచ్చెక్కిపోతారు.

OTT Suggestions- Best Thriller The Menu Movie: ఒక మంచి థ్రిల్లర్ కోసం మీరు చెక్ చేస్తుంటో మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ ని మీకోసం ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లేకి పిచ్చెక్కిపోతారు.

  • Published Jul 22, 2024 | 2:00 AMUpdated Jul 22, 2024 | 2:00 AM
షెఫ్ ముసుగులో హత్యలు.. ఐల్యాండ్ లో బందించి.. OTTలో క్రైమ్ థ్రిల్లర్!

ఓటీటీల్లో మూవీస్ చూడటానికే ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. అయితే ఎలాంటి సినిమాలు చూడాలి? అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ, ఎక్కువగా మాత్రం థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక అదిరిపోయే థ్రిల్లర్ తీసుకొచ్చాం. అది కూడా అలాంటి ఇలాంటి థ్రిల్లర్ కాదు. ఇది ఒక క్రేజీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు మిమ్మల్ని మర్చిపోతారు. అక్కడి పాత్రలో ఊహించుకుంటారు. మీకే అలా జరిగితే ఎలా ఉంటుంది అని కంగారు కూడా పడతారు. అలాంటి సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అంత స్పెషల్ ఎందుకో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకునే సినిమా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. ఇది అంతా ఒక ఐల్యాండ్ లో జరుగుతూ ఉంటుంది. సామాన్యంగా డబ్బు బాగా ఎక్కువ ఉన్న వారికి కొన్ని ఫాంటసీస్ ఉంటాయి. అద్భుతమైన ఫుడ్ తినాలి. ఎవరూ వెళ్లలేని హోటల్ కి వెళ్లాలి. ఎవరూ చూడని ప్రాంతాలు చూడాలి. మనకంటూ ప్రైవసీ ఉండాలి. ఇలాంటి చాలానే కోరికలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు అలాంటి కోరికలు తమ ప్రాణాలు కూడా తీస్తాయి అనే విషయం ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇదంతా ఒక షెఫ్ చుట్టూ తిరిగే కథ. ఆ షెఫ్ సామాన్యవాడు కాదు. ఎంతో మందిని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అతని కింద పనిచేసే వాళ్లని తన మాయలో ఉండిపోయేలా చేస్తాడు.

అక్కడకు వచ్చిన వారికి ముందే చెప్తాడు ఈ రాత్రి మీ జీవితంలో మర్చిపోలేనిది అవుతుంది అని. అన్నట్లుగానే వారికి ఆ రాత్రి కాళ రాత్రిగా మారుస్తాడు. అతని కింద పనిచేసే వాళ్లను తాను హిప్నటైజ్ చేస్తాడు. వాళ్లు ఆ షెఫ్ ఏం చెప్తే అదే చేస్తారు. అతను వాళ్లని తన చప్పట్లతో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వచ్చిన అతిథులను మొదట బాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ, తర్వాత తర్వాత అంతా కథ మారిపోతుంది. అందరూ విచిత్రంగా ప్రవరిస్తూ ఉంటారు. ఆ రాత్రి వాళ్ల ప్రాణాలు పోతాయి అని తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. అయితే తప్పించుకోవాలి అని చూసినా కూడా బతకడం కష్టమే. ఎందుకంటే అక్కడున్న వంటవాళ్లు వెంటాడి వాళ్లను వేటాడతారు కాబట్టి. మరి.. వాళ్లు ఎలా తప్పించుకున్నారు? అసలు ఆ ఐల్యాండ్ నుంచి తప్పించుకుంటారా? ఆ షెఫ్ ఎందుకు అలా చేస్తున్నాడు అనే ప్రశ్నలు సమాధానాలు తెలియాలి అంటే మీరు ఈ ‘ది మెను’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio