iDreamPost
android-app
ios-app

ద్వీపంలో వింత ఆస్పత్రి.. పిచ్చి వాళ్లను ఒకచోట చేర్చి. OTTలో క్రేజీ థ్రిల్లర్!

  • Published Jul 16, 2024 | 4:00 AM Updated Updated Jul 16, 2024 | 4:00 AM

OTT Suggestions- Best Thriller Shutter Island: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే.. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి.

OTT Suggestions- Best Thriller Shutter Island: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ కోసం గనుక మీరు చూస్తుంటే.. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి.

  • Published Jul 16, 2024 | 4:00 AMUpdated Jul 16, 2024 | 4:00 AM
ద్వీపంలో వింత ఆస్పత్రి.. పిచ్చి వాళ్లను ఒకచోట చేర్చి. OTTలో క్రేజీ థ్రిల్లర్!

సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అలాంటి అలవాటు మీకు కూడా ఉందా? అయితే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ ని తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తే మీరు కచ్చితంగా వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా చూసిన కోట్ల మంది ఆ మాట అన్నారు కాబట్టి. ఐఎండీబీలో ఈ సినిమాకి ఏకంగా 15 లక్షల మంది రివ్యూస్ ఇచ్చారు. అది కూడా 8.1/10 రేటింగ్ తో. మరి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ మూవీ ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం సినిమా కథ. ఆ తర్వాత మరో కారణం.. లియోనార్డో డికాప్రియో అనే చెప్పాలి. సాధారణంగానే లియోనార్డో ఎంచుకునే కథలు ఎంతో కొత్తగా ఉంటాయి. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ధోరణితో తీసుకొచ్చిన సినిమా ఇది కూడా అని చెప్పచ్చు. ఒక ద్వీపం ఉంటుంది. అక్కడ ఒక ఆస్పత్రి ఉంటుంది. ఆ ఆస్పత్రికి కేవలం వింత వ్యక్తులు, పిచ్చి ముదిరిపోయిన వాళ్లు.. బాహ్య ప్రపంచంలో ట్రీట్మెంట్ చేయడానికి వీలు కాదు అనుకునే వారిని మాత్రమే అక్కడికి పంపిస్తారు.

ఆ ఆస్పత్రికి వస్తున్నారు అంటే వాళ్లు పిచ్చిలో పీహెచ్ డీ చేశారు అని అర్థం. అయితే అక్కడ ఒకరోజు ఒక మహిళా పేషెంట్ అదృశ్యమవుతుంది. ఆమె తన ముగ్గురు పిల్లలను నీటిలో ముంచి చంపేస్తుంది. ఆమెను పరిస్థితిని బట్టి ద్వీపంలోని ఆస్పత్రికి పంపుతారు. అయితే ఆ మహిళ కనిపించకుండా పోతుంది. ఆ కనిపించకుండా పోయిన మహిళ కేసును విచారించేందుకు మన హీరో, అతని పార్టనర్ ఆ షట్టర్ ఐల్యాండ్ కి వెళ్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? జరుగుతోంది? ఆ మహిళ ఎలా కనిపించకుండా పోయింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఆ ఆస్పత్రికి చేరుకుంటారు.

ఆస్పత్రి దగ్గర హై సెక్యూరిటీ ఉంటుంది. అనుమతి లేకుండా పోలీసులు కూడా లోపలికి వెళ్లలేరు. లోపలికి వెళ్లిన వాళ్లు బయటకు కూడా రాలేరు. అలాంటి ఐల్యాండ్ నుంచి ఒక మహిళ తప్పించుకోవడం కాస్త వింతగా అనిపిస్తుంది. ఆ పాయింట్ మీదే హీరో విచారణ ప్రారంభిస్తాడు. అయితే అతని విచారణలో చాలానే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే కొన్ని విషయాలు కూడా బయటపడతాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆ మహిళ ఏమైంది? అనే పాయింట్ తో విచారణ స్టార్ట్ చేస్తారు. అయితే తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. ఈ సినిమా పేరు ‘షట్టర్ ఐల్యాండ్’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు లియోనార్డో డికాప్రియో నటనకు ఫిదా అయిపోతారు. మరి.. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş