iDreamPost
android-app
ios-app

కన్న కూతురు తప్పిపోతే? OTTలో ప్రతి తండ్రి చూడాల్సిన మూవీ!

OTT Suggestions- Best Thriller Searching Movie: ఓటీటీలో మీరు ఒక మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీక ఇది చాలా మంచి ఛాయిస్ అవుతుంది. ఒక తండ్రి తన కుమార్తె కోసం చేసే పోరాటం ఇది. ఒంటరిగా ఎలాంటి సహాయం లేకుండా ఆ తండ్రి చేసే పోరాటం మిమ్మల్ని మెప్పిస్తుంది.

OTT Suggestions- Best Thriller Searching Movie: ఓటీటీలో మీరు ఒక మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీక ఇది చాలా మంచి ఛాయిస్ అవుతుంది. ఒక తండ్రి తన కుమార్తె కోసం చేసే పోరాటం ఇది. ఒంటరిగా ఎలాంటి సహాయం లేకుండా ఆ తండ్రి చేసే పోరాటం మిమ్మల్ని మెప్పిస్తుంది.

కన్న కూతురు తప్పిపోతే? OTTలో ప్రతి తండ్రి చూడాల్సిన మూవీ!

తండ్రికి పిల్లల మీద అమితమైన ప్రేమ ఉంటుంది. తన పిల్లలకు కష్టం వస్తే.. ఆ తండ్రి కళ్లు చెమ్మగిల్లుతాయి. అదే వాళ్లు కళ్ల ముందు కనిపించకుండాపోతే? ఆ తండ్రికి జీవితం అంధకారంగా మారిపోతుంది. ముఖ్యంగా తండ్రికి కూతుళ్లతో మంచి అనుంబంధం ఉంటుంది. తన కుమార్తెలో తల్లిని చూసుకుంటాడు. అలాంటి ఒక తండ్రికి పెద్ద కష్టం వస్తుంది. తన కన్నకుమార్తె కనిపించకుండా పోతుంది. అసలు ఆమె ఏమైంది అనే విషయం కూడా తెలియదు. ఆ తండ్రికి ఏం చేయాలో తెలియదు. ఆమెను ఎలా వెతకాలి? ఎక్కడ వెతకాలి? అసలు ఆమెకు ఏమైంది అనే విషయం కూడా తెలియదు. అసలు ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అంత స్పెషల్ ఏముందో చూద్దాం.

ఈ సినిమా ఒక తండ్రీ కూతుళ్ల కథ. ఇందులో హీరో, ఆయన కుమార్తె కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే ఆమెకు తల్లి ఉండదు. వాళ్ల నాన్న వల్లే ఆమె చనిపోయింది అనే భావన ఆ కుమార్తెలో పడిపోతుంది. తండ్రితో అంత సత్సంబంధాలు కూడా ఉంచుకోదు. తండ్రి ఏం అడిగినా అంటీ ముట్టనట్లుగానే సమాధానం చెప్తుంది. అసలు తనకు ఒక తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఆమె పట్టించుకోదు. కేవలం తనకు అవసరం అయినప్పుడు మాత్రమే డబ్బుల కోసం తండ్రితో మాట్లాడుతుంది. అలాంటి కుమార్తెను అర్థం చేసుకుని ఆ తండ్రి ఆమె బాగోగులు చూస్తూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయికి తండ్రికి చెప్పకుండా చాలానే చేస్తూ ఉంటుంది.

తన కుమార్తెతో ఎక్కువగా ఆన్ లైన్, సోషల్ మీడియాలోనే టచ్ లో ఉంటాడు. అయితే ఒకరోజు సడెన్ ఆమె నుంచి ఎలాంటి రిప్లయ్ రాదు. ఆమె అసలు ఇంటికి కూడా రాదు. ఆమె ఏమైంది అనే విషయం తెలియదు. మ్యూజిక్ క్లాస్ కి వెళ్తుంది అనుకుంటాడు. అందుకోసం నెల నెలా ఫీజు కూడా తీసుకుంటుంది. కానీ, ఆమె ఆ మ్యూజిక్ క్లాస్ ని వారంలోనే మానేస్తుంది. ఆ డబ్బు మొత్తం ఏం చేసింది అనే విషయం తెలియదు. అలా కూతురు కోసం వెతుకులాట మొదలు పెడితే అతనికి నమ్మలేని నిజాలు తెలుస్తూ ఉంటాయి.

తన కుమార్తె కనిపించడం లేదు అనే విషయాన్ని పోలీసులకు చెప్తాడు. వాళ్లు కూడా వెతకడం ప్రారంభిస్తారు. ఆ తండ్రి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. పోలీసుల కంటే చాలా మెరుగ్గానే అతను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే అసలు అతని కూతురు బతికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అసలు ఆమెకు ఏమైంది? అనే చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఈ “సెర్చింగ్” అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap