iDreamPost
android-app
ios-app

తప్పు చేస్తే చంపేస్తాడు.. OTTలో వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller Dexter Series: ఓటీటీలో మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే మాత్రం.. ఈ సిరీస్ ని కచ్చితంగా ట్రై చేయండి. ఇందులో హీరోనే విలన్ కూడా అవ్వడం విశేషం. అతనే పట్టిస్తూ ఉంటాడు.. అతనే చంపేస్తూ ఉంటాడు.

OTT Suggestions- Best Thriller Dexter Series: ఓటీటీలో మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే మాత్రం.. ఈ సిరీస్ ని కచ్చితంగా ట్రై చేయండి. ఇందులో హీరోనే విలన్ కూడా అవ్వడం విశేషం. అతనే పట్టిస్తూ ఉంటాడు.. అతనే చంపేస్తూ ఉంటాడు.

తప్పు చేస్తే చంపేస్తాడు.. OTTలో వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్!

మీకు సరైన క్రైమ్ థ్రిల్లర్ తగిలితే దానిని పూర్తే చేసే వరకు నిద్ర పట్టదు. నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తే కచ్చితంగా నిద్ర పట్టదు. అయితే మీరు ఇప్పటి వరకు చూసిన క్రైమ్ సిరీస్లు, థ్రిల్లర్స్ అన్నీ ఈ సిరీస్ ముందు తేలిపోతాయి. ఎందుకంటే ఇందులో ఉండే కాన్సెప్ట్, క్రైమ్ చేసే తీరు, దానిని కవర్ చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. అసలు ఇలా కూడా చంపుతారా? ఇంత క్రూరంగా హత్యలు చేస్తారా? అనే ప్రశ్న మీకు రాకుండా మానదు. అయితే ఇది అంతా మంచి కోసం చేస్తున్నాడా? చెడు కోసం చేస్తున్నాడా? అనే విషయాన్ని పక్కన పెడితే హత్యలు మాత్రం చేస్తాడు.

ఇందులో హీరోకి చిన్నప్పటి నుంచే ఒక అలవాటు ఉంటుంది. అతనిలో తెలియని ఒక ప్రేరణ ఉంటుంది. అది ఎప్పుడూ ఏదో ఒక హత్య చేయాలి అని ఉసిగొలుపుతూ ఉంటుంది. అతనికి రక్తం చూడటం అంటే ఇష్టం. అందుకోసం హత్య చేయడానికి కూడా వెనుకాడడు. అయితే దానిని ఎలా మాయం చేయాలో కూడా అతనికి బాగా తెలుసు. అతని ఇష్టాన్ని కనుగొన్న తన తండ్రి అతడి రేజ్ ని ఒక సన్మార్గంలోకి మార్చే ప్రయత్నం చేస్తాడు. అదేంటంటే.. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు తన ఇష్టాన్ని వాడమని చెప్తాడు. తన కొడుకుని కంట్రోల్ చేయలేను అతను గ్రహించిన తర్వాతే ఆ పని చేస్తాడు.

అప్పటి నుంచి అతను ఎవరైతే చట్టం చేతుల్లో నుంచి తప్పించుకుని నేరస్తులు తిరుగుతూ ఉంటారో.. వారిని గుర్తించి శిక్షిస్తూ ఉంటాడు. అయితే అతను సీరియల్ కిల్లర్ అని.. అతను హత్యలు చేస్తాడు అని ఎవరికీ తెలియదు. మరోవైపు మియామీ మెట్రో పోలీస్ డిపార్టుమెంట్ లో క్రైమ్ అనలిస్ట్ గా ఉంటాడు. అతను ఎవరు ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియకుండా చాలానే జాగ్రత్తగా ఉంటాడు. అయితే కొన్నాళ్లకు అతనిలో ఉన్న ఆ కసి తగ్గుతుంది. కాస్త మంచి వాడిలా మారాలి అని చాలానే ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికీ ఆ కాన్సెప్ట్ 7 సీజన్స్ పూర్తి కూడా అయ్యింది. కుర్రాడిగా ఉన్న హీరో వృద్ధుడిగా మారే వరకు ఈ సిరీస్ సాగడం విశేషం. ఈ సిరీస్ పేరు “డెక్స్ టర్”. అయితే కాస్త వీక్ హార్ట్ ఉన్నవాళ్లు ఈ సిరీస్ చూడకండి. ఎందుకంటే హత్యలు కాస్త వైలెంట్ గా ఉంటాయి. ఈ సిరీస్ మీకు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి