OTT Suggestions- One Hour Photo On Prime Video: OTTలో ఈ సినిమా చూసిన తర్వాత ఫొటో దిగాలి అంటే వణికిపోతారు!

OTTలో ఈ సినిమా చూసిన తర్వాత ఫొటో దిగాలి అంటే వణికిపోతారు!

OTT Suggestions- Best Suspense Thriller One Hour Photo: ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి మంచి సినిమాల కోసం చాలానే ఎదురుచూపులు చేస్తున్నారు. అయితే మంచి సినిమా అంటే అంత తేలిగ్గా దొరకదు. అందుకే మీకోసం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Suspense Thriller One Hour Photo: ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి మంచి సినిమాల కోసం చాలానే ఎదురుచూపులు చేస్తున్నారు. అయితే మంచి సినిమా అంటే అంత తేలిగ్గా దొరకదు. అందుకే మీకోసం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

ఓటీటీల్లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇందులో ఉండే కథ, కథనం మాత్రమే కాదు.. హీరో కూడా చాలా ప్రత్యేకం. ఆయన ఆస్కార్ విన్నర్ కూడా. తన యాక్టింగ్ తో మిమ్మల్ని మెస్మరైజే చేస్తాడు. ఎక్కడా కూడా మీరు ఒక ఆర్టిస్టుని చూస్తున్నాం అనుకోరు. ఆయన యాక్టింగ్ కి మీరే ఎక్కువ కంగారు పడిపోతారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మీకు కాస్త కంగారు కూడా కలగచ్చు. మనల్ని కూడా ఎవరైనా అలా వెంబడిస్తున్నారేమో? మనల్ని కూడా ఎవరైనా చూస్తున్నారేమో అనే భయం కూడా ఉంటుంది. మొత్తానికి ఈ మూవీ చూస్తే మాత్రం కచ్చితంగా భయపడతారు.

సాధారణంగా మన దేశంలో అయితే అందరూ కలిసి ఉండటం, ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ, విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందని మనకు తెలుసు. రెక్కలొచ్చిన తర్వాత గూడు వదిలి పిట్ట ఎగిరిపోయినట్లు 18 ఏళ్లు దాటిన తర్వాత.. అక్కడి యువత ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. అందులో చాలా మంది కుటుంబంతో కాస్తో కూస్తో సత్సంబంధాలు నెరుపుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం తాము, తమ జీవితం అంటూ ఉంటారు. అలా ఉన్న వారికి కాస్త ఒంటరితనం, ఒత్తిడి, బతుకు మీద ఆశ సన్నగిల్లుతూ ఉంటాయి. అలాంటి ఒక పాయింట్ తోనే ఈ సినిమా తీశారు.

ఈ మూవీలో ఒక మధ్య వయసు వ్యక్తి ఒంటరిగా జీవితం సాగిస్తూ ఉంటాడు. అతను ఫొటో డెవలపర్ గా పని చేస్తూ ఉంటాడు. ఏకంగా 20 ఏళ్లుగా అదే వృత్తిలో ఉంటాడు. అంతేకాకుండా.. అతనికి ఇల్లు, డార్క్ రూమ్ తప్పితే ఏమీ తెలియదు. అతనికి కనీసం ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇంక, ఫ్యామిలీ అంటారా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వ్యక్తి ఒక కుటుంబం మీద ఆశ పెంచుకుంటాడు. వారి కుటుంబాన్ని చూసి ముచ్చట పడిపోతాడు. అలాంటి కుటుంబంలో తాను కూడా ఒక భాగం అయితే బాగుండు కదా అని భావిస్తాడు. అతనికి వాళ్ల గురించి మొత్తం తెలుసు. వాళ్లు ఎక్కడ ఉంటారు? వాళ్ల పేర్లు, వారి వృత్తి, వారి సంపాదన, వారి పిల్లు ఇలా ప్రతి అంశం అతనికి తెలుసు. వారి జీవితాల గురించి అతనికి తెలియని ఒక విషయం ఏదీ ఉండదు.

అలాంటి వ్యక్తి తమ జీవితాల్లోకి బలవంతంగా వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. అసలు అతను ఎవరు? ఎందుకు వారి జీవితాల్లోకి రావాలి అనుకుంటున్నాడు? అసలు అతనికి ఏం కావాలి? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఈ సినిమాలో ముఖ్యంగా రాబిన్ విలియమ్సన్ యాక్టింగ్ కి మీరు ఫిదా అయిపోతారు. అప్పటివరకు ఏం తెలియని అమాయకుడిగా ఉంటూనే.. ఆ తర్వాత అతని అసలు సిసలు రూపం చూపించడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా పేరు ‘వన్ హవర్ ఫొటో‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ రూ.119 రెంట్ కి అందుబాటులో ఉంది. అయితే యూట్యూబ్ లో మీరు ఫ్రీగా కూడా చూడచ్చు.

Show comments