iDreamPost
android-app
ios-app

ప్రేమ- పగ- ప్రాణం కోసం పాకులాట.. OTTలో ఓ రేంజ్ మూవీ!

  • Published May 20, 2024 | 4:56 PM Updated Updated May 20, 2024 | 4:56 PM

OTT Suggestions- Best Romantic Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక బలవంతపు లవ్ స్టోరీ మాత్రం చూసుండరు. కిడ్నాప్ చేసి ప్రేమలో పడేలా చేయడం అంటే కాస్ భిన్నంగానే ఉంటుంది.

OTT Suggestions- Best Romantic Love Story: ఓటీటీలో మీరు చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక బలవంతపు లవ్ స్టోరీ మాత్రం చూసుండరు. కిడ్నాప్ చేసి ప్రేమలో పడేలా చేయడం అంటే కాస్ భిన్నంగానే ఉంటుంది.

  • Published May 20, 2024 | 4:56 PMUpdated May 20, 2024 | 4:56 PM
ప్రేమ- పగ- ప్రాణం కోసం పాకులాట.. OTTలో ఓ రేంజ్ మూవీ!

ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. అలాగే రివేంజ్ డ్రామాలు చూసుంటారు. కానీ, ఎప్పుడైనా మీరు ఒక రివేంజ్ లవ్ స్టోరీ చూశారా? చూడకపోతే మాత్రం మీకోసం ఆల్రెడీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది కూడా. ఈ లవ్ స్టోరీ కాస్త భిన్నంగా కూడా ఉంటుంది. మీరు గతంలో విన్న అనగనగా రాజ కుమారుడు.. ఒక యువరాణిని కాపాడాడు.. అనే వెర్షన్ లోనే ఉంటుంది. అయితే కాస్త ఘాటుగా ఉంటుంది. ఇందులో కొన్ని బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. హాలీవుడ్ సినిమా కాబట్టి కొన్నింటిని భరించాల్సిందే. అందుకే ఈ మూవీని మీరు ఒంటరిగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే సడెన్ గా ఒక సీన్ వచ్చేస్తే.. మీరే ఇబ్బంది పడతారు.

మీరు చూసిన లవ్ స్టోరీస్ లో ఉన్నట్లే పరుగులు, ఛేజింగ్లు, ఫైటింగులు ఈ మూవీలో కూడా ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ని ఒక డాన్ ప్రేమిస్తాడు. ఆ హీరోయిన్ తన ప్రియుడితో అంత ఆనందంగా ఉండదు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఆ అమ్మాయి ఆచూకీ ఆ డాన్ తెగ వెతుకుతాడు. ఆమె ఆచూకీ తెలిసిన తర్వాత ఆమెను కిడ్నాప్ చేస్తాడు. తనను బందీగా తీసుకుంటాడు. అయితే ఆమెకు 365 రోజుల గడువు పెడతాడు. ఆ డాన్ తో ప్రేమలో పడేందుకు ఈ 365 రోజుల్లో ఆ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో తాకను, ఇబ్బంది పెట్టను అని మాటిస్తాడు. అయితే ఈ యువతి మాత్రం ఆ డాన్ ని ప్రేమించకుండా.. అతని సహనంతో ఆడుకుంటూ ఉంటుంది.

అతని ప్రేమను అర్థం చేసుకోకుండా పరీక్షిస్తూ ఉంటుంది. అతడిలో ఆశలు రేపి.. తర్వాత దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది. అలా ఆ యువతి చేసే అన్ని విషయాలను ఆ డాన్ బరిస్తూ వస్తాడు. అయితే ఒకరోజు ఆ డాన్ కు పడని వాళ్లతో ఈ అమ్మాయి సఖ్యతగా ఉంటుంది. వారిని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఒకానొక సందర్భంగా ఆ యువతి ప్రాణాల మీదకు వస్తే.. ఆ డాన్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతాడు. అప్పుడు అతని ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఆ డాన్ ప్రేమలో పడుతుంది. ఇద్దరూ కలిసి శారీర*కంగా కూడా కలుస్తారు.

ఇద్దరి జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. మరి.. వారి ప్రేమ ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? వారి గ్యాంగ్ వార్ ఏమైంది? అసలు ఇద్దరూ సంతోషంగా గడిపారా? అసలు వారి ప్రేమ ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది? అనేదే కథ. ఈ సినిమా పేరు 365 డేస్. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీకి సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఎవరూ లేనప్పుడో.. ఒంటరిగానో చూడండి. అందరూ ఉన్నప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేసి ఇబ్బంది పడకండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio