OTT Suggestions- Best Patriotic Movie Shershaah: ప్రాణం పోతున్నా శత్రువులతో జవాన్ పోరాటం.. OTTలో ఈ మూవీకి గూస్ బంప్స్ పక్కా!

ప్రాణం పోతున్నా శత్రువులతో జవాన్ పోరాటం.. OTTలో ఈ మూవీకి గూస్ బంప్స్ పక్కా!

OTT Suggestions- Best Patriotic Movie Shershaah: ఓటీటీలో మీరు ఎన్నో దేశభక్తి సినిమాలు చూసి ఎమోషనల్ అయ్యి ఉంటారు. ఈ మూవీ చూస్తే మాత్రం ఎమోషనల్ అవ్వడమే కాదు.. ప్రతి సీన్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మరి.. ఆ మూవీ ఏదో చూసేయండి.

OTT Suggestions- Best Patriotic Movie Shershaah: ఓటీటీలో మీరు ఎన్నో దేశభక్తి సినిమాలు చూసి ఎమోషనల్ అయ్యి ఉంటారు. ఈ మూవీ చూస్తే మాత్రం ఎమోషనల్ అవ్వడమే కాదు.. ప్రతి సీన్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మరి.. ఆ మూవీ ఏదో చూసేయండి.

దేశభక్తి సినిమాలు అంటే ఇష్టం ఉండని సినిమా ప్రేక్షకుడు ఉండడేమో? ఏ భాషలో వచ్చినా.. ఎప్పుడు వచ్చినా ఈ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే అది ఎవరగ్రీన్ జానర్ అంటారు. అలాంటి జానర్ వచ్చిన అన్ని సినిమాలు మీరు చూసే ఉంటారు. కానీ, ఈ సినిమాని ఎందుకు లైట్ తీసుకున్నారు? ఇది హిందీ సినిమానే కావచ్చు. కానీ, కథ- స్క్రీన్ ప్లే- యాక్షన్ సీక్వెన్స్ అన్నీ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. అసలు ఈ మూవీని ఎందుకు ఇంతకాలం మిస్ అయ్యామా అనే భావన కూడా కలుగుతుంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమాలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఇప్పటికే మీకు ఈ మూవీపై ఒక అంచనా వచ్చి ఉండాలి. ఎందుకంటే.. ఇలాంటి పాత్రలకు సిద్ధార్థ్ మల్హోత్రా పెట్టింది పేరు. నిజానికి ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న యోధా కంటే కూడా ఈ మూవీ ముందే వచ్చింది. ఆ మూవీలో ఒక లెఫ్టినెంట్ పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించాడు. అతని యాక్షన్, యాటిట్యూడ్ తో ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. ఈ మూవీలో కావాల్సినంత యాక్షన్ ఉంటుంది. అంతకు మించిన ఎమోషన్ ఉంటుంది. వాటన్నింటికి మించిన దేశభక్తి ఎలిమెంట్స్ ఉంటాయి. కథ పరంగా ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు పడతాయి. అదే టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్ కి అయితే నూట యాభై మార్కులు వేసేస్తారు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకి ఒక కోరిక ఉంటుంది. జవానుగా ఎప్పటికైనా ఒక్కసారి అయినా యుద్ధభూమిలో అడుగుపెట్టాలి అని. అలాంటిది ఒక టీమ్ ని తీసుకుని పాకిస్థాన్ స్థావరాలపైకే అటాక్ చేసే బాధ్యతను హీరోకి ఇస్తారు. అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. తన టీమ్ తో కలిసి హీరో ఎలా పోరాడాడు? పాక్ స్థావరాలను ధ్వంసం చేయగలిగాడా? హీరో ఎలాగైనా ప్రాణాలతో తిరిగి రావాలి అని కుటుంబం, ప్రేయసి, మిత్రులు అంతా కోరుకుంటారు. మరి.. హీరో ప్రాణాలతో తిరిగి రాగలిగాడా? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్స్.

ఇందులో కియారా అద్వాణీతో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడు యుద్ధానికి వెళ్తే ఆ అమ్మాయి మనసు ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలు అలరిస్తాయి. ఈ సినిమా పేరు షేర్ షా. డైలాగ్స్ హిందోల ఉన్నా.. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే తప్పకుండా కుటుంబంతో కలిసి చూడండి. అలాగే ఈ సినిమా చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీని చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

Show comments