బాల్యం- అంటరానితనం.. OTTలో జై భీమ్ ని మించిన మూవీ!

OTT Suggestions- Best Movie Fandry: ఓటీటీలో కొన్ని సినిమాలు కచ్చితంగా చూడాల్సిందే. అలాంటి మూవీనే ఇది కూడా. ఈ చిత్రాన్ని చూస్తే మాత్రం మీ హృదయం కచ్చితంగా ద్రవించిపోతుంది. కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు.

OTT Suggestions- Best Movie Fandry: ఓటీటీలో కొన్ని సినిమాలు కచ్చితంగా చూడాల్సిందే. అలాంటి మూవీనే ఇది కూడా. ఈ చిత్రాన్ని చూస్తే మాత్రం మీ హృదయం కచ్చితంగా ద్రవించిపోతుంది. కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు.

ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. వాటిలో చాలావరకు యాక్షన్, డ్రామా, కామెడీ, లవ్ స్టోరీలు ఉంటాయి. వాటిని చూస్తూ కాలం గడిపేయచ్చు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం హృదయాలను పిండేస్తాయి. వాటిని చూస్తున్నంతసేపు మీ కళ్లు చెమ్మగిల్లుతూనే ఉంటాయి. అలాంటి సినిమాలను కనీసం నెలకు ఒకటి అయినా చూడాలి. ఎందుకంటే అంత మంచి కథతో గ్రిప్పింగ్ వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, అలాంటి మూవీస్ వస్తే మాత్రం అస్సలు వదలకూడదు. ఆ సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. ఆ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీతో మాట్లాడుతుంది. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలాంటి ఒక మూవీనే మీకోసం తీసుకొచ్చాం.

ఇప్పుడు చెప్పుకునే కథ గురించి మీకు చాలా సింపుల్ గా అర్థమవ్వాలి అంటే ఒక సినిమాని ఉదాహరణగా చెప్పచ్చు. అది మరేదో కాదు.. జై భీమ్ మూవీ. హీరో సూర్య తన కెరీర్లో తీసిన కొన్ని బెస్ట్ చిత్రాల్లో ఈ మూవీ కూడా ఒకటి. ఆ రోజుల్లో ఉన్న అంటరానితనం, వివక్ష, కొన్ని జాతులపై అగ్రవర్ణాల పేరిట జరిగిన దారుణాలు, కొందరు వ్యక్తుల పట్ల వ్యవస్థలు వ్వహరించిన తీరును కళ్లకు కట్టిన చిత్రం. అది పైగా ఒక బయోపిక్ అని అందరికీ తెలిసిందే. అంటే నిజంగా జరిగిన విషయాలనే వెండితెర మీద ఆవిష్కరించారు. ఇది కూడా అలాంటి ఒక కోవకు చెందిన చిత్రమే. ఈ మూవీలో ముఖ్యంగా బాల్యంలో పిల్లలు ఆ వివక్షను ఎలా అనుభవించారు అనే దానిపై ఉంటుంది.

ఈ సినిమా అంతా మహారాష్ట్ర నేపథ్యంలో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక మరాఠీ చిత్రం. ఈ మూవీ మరాఠీ అనగానే లైట్ తీసుకోకండి. ఈ చిత్రానికి ఏకంగా 8 అవార్డులు దక్కాయి. ఇంక ఇందులో కథ అయితే మీ హృదయాలను మెలిపెడితుంది. కల్మషం అంటే తెలియని పసి హృదయాలపై ఆ రోజుల్లో ఉన్న జాతి వివక్ష, అంటరానితనం ఎంత ప్రభావం చూపిందో ఈ మూవీలో కళ్లకు కట్టారు. అసలు ఆడ, మగ అనే తేడా కూడా సరిగ్గా తెలియని వయసులో.. జాతి, కులం అంటూ దూరం పెడుతుంటే ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లాయో ఈ చిత్రంలో చూడచ్చు.

పసి వయసులో ఒకరిపై ఒకరికి కలిగే ఇష్టం, దానిని వేరు చేస్తూ పెద్దలు పెట్టిన కట్టుబాట్లను ఈ మూవీలో స్పష్టంగా చూడచ్చు. అలాగే అప్పటే ఉండే ఆచర వ్యవహారాలు, వాటి పేరిట జరిగే దారుణాలను కూడా బాగా చూపించారు. ఈ మూవీ నిజానికి 2013లోనే వచ్చింది. కాకపోతే ఆ చిత్రం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు మీరు ఓటీటీలో చూడచ్చు. ఈ చిత్రం పేరు ఫడ్రీ. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. భాష మాత్రం మరాఠీలోనే ఉంటుంది. కానీ, ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ఉంటాయి. మీరు గనుక ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments