OTT లో టాప్ 3 మలయాళ చిత్రాలను కానీ మిస్ అయ్యారా !

OTT Best Malayalam Movies In Telugu: మలయాళ సినిమాలంటేనే ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. తరచూ ఓటీటీ లో చాలానే మలయాళీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ వాటిలో ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయినా బెస్ట్ మలయాళీ చిత్రాలు మాత్రం ఇవే. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

OTT Best Malayalam Movies In Telugu: మలయాళ సినిమాలంటేనే ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. తరచూ ఓటీటీ లో చాలానే మలయాళీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ వాటిలో ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయినా బెస్ట్ మలయాళీ చిత్రాలు మాత్రం ఇవే. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

మలయాళ సినిమాలలో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తో పాటు.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక ఇటు ఓటీటీ లో మంచి టాక్ ను సంపాదించుకుంటున్నాయి. పైగా ఓటీటీ లో మలయాళ సినిమాలు తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులోకి రావడంతో.. ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే మలయాళ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే టాప్ 3 మలయాళ చిత్రాలను కానీ మీరు మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అన్వేషిప్పిన్ కండేతుమ్:

అసలు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయా అనే రేంజ్ లో ఈ మూవీ ఉంటుంది. మొదట థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా తర్వాత.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అంతే కాకుండా ఓటీటీ లో రిలీజ్ అయినా కొద్దీ గంటల్లోనే ఈ మూవీ భారీ వ్యూస్ ను దక్కించుకుంది. రెండు హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతుంది. ఇక ఈ మూవీ మళయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఈ మూవీ ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.

అబ్రహాం ఓజ్లెర్:

మలయాళ మెగా హీరో మమ్ముట్టి, స్టార్ జయరాం ప్రధాన పాత్రలో నటించిన మూవీ.. అబ్రహం ఓజ్లర్. ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ అయినా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మొదటి నుంచి కూడా పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. అనుమానాస్పదంగా జరిగిన వరుస హత్యల కేసును సాల్వ్ చేసే చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. మళయాళంతో పాటు లుగు, హిందీ, తమిళం, కన్నడ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక అసలు మిస్ చేయకండి.

తలవన్:

మలయాళీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే కాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్” సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 10కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా తరువాత ఊహించని రేంజ్ లో ఈ మూవీ 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.

మరి ఈ సినిమాలను కనుక ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments