iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ క్రేజీ లవ్ స్టోరీ ‘న్యూనెస్’.. OTTలో ఉంది చుూశారా?

  • Published Aug 13, 2024 | 6:26 PM Updated Updated Aug 13, 2024 | 6:26 PM

OTT Suggestions- Best Love Story Newness Movie: ఓటీటీలో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది మంచి ఎంపిక అవుతుంది. అయితే ఇది కాస్త వెరైటీ లవ్ స్టోరీ కూడా.

OTT Suggestions- Best Love Story Newness Movie: ఓటీటీలో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది మంచి ఎంపిక అవుతుంది. అయితే ఇది కాస్త వెరైటీ లవ్ స్టోరీ కూడా.

  • Published Aug 13, 2024 | 6:26 PMUpdated Aug 13, 2024 | 6:26 PM
హాలీవుడ్ క్రేజీ లవ్ స్టోరీ ‘న్యూనెస్’.. OTTలో ఉంది చుూశారా?

ఎవరికైనా కూడా ఎన్ని జానర్స్ చూసినా రాని కిక్కు ఒక మంచి లవ్ స్టోరీ చూస్తే వస్తుంది. ఒక్క తెలుగులోనో.. పాన్ ఇండియా లెవల్ లోనో కాదు.. ప్రపంచవ్యాప్తంగా లవ్ స్టోరీ అనేది ఒక ఎమోషన్. ఎవరికైనా ఒక మంచి ప్రేమకథ చూడాలి అనే ఉంటుంది. అయితే ఓటీటీలో మంచి ప్రేమకథలు చాలానే ఉంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రం క్రేజీగా ఉంటాయి. ఆ క్రేజీ లవ్ స్టోరీ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కథ పరంగా అలాంటి ఇలాంటి మూవీ కాదు. ఇంక టేకింగ్ అంటే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

సాధారణంగా ప్రేమ అంటే ఎలా అయినా కలగచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది. అలాగే అభిరుచులు, అభిప్రాయాలు కలిసిన తర్వాత కూడా ప్రేమ పుడుతుంది. ఏ మూవీ చూసినా ప్రేమ కలగడానికి ఒక ప్లాట్ ఏర్పాటు చేస్తారు. ఈ మూవీలో మాత్రం ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఈ ప్రేమ చిగురించినట్లు చూపించారు. ఆ తర్వాత వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వారి మధ్య రిలేషన్ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడే వారిలో ఒక కొత్త కోరిక పుడుతుంది.. మనం ఇద్దరం ఎలాంటి దాపరికాలు లేకుండా నచ్చినట్లు ఉందాం అని చెప్పుకుంటారు. అలా చెప్పుకున్న ఒక మాట వారిమధ్య పెద్ద అగాథాన్ని ఏర్పరుస్తుంది.

హీరోకి ఒక అమ్మాయితో రిలేషన్ ఉండేది. అలాగే హీరోయిన్ కి కూడా మరో వ్యక్తితే సంబంధం ఉంటుంది. వీళ్లు హద్దులు దాటే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విషయాలు ఎప్పుడైతే రివీల్ చేసుకుంటారో వారి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా.. అభద్రతా భావం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలని భావిస్తూ ఉంటారు. మొత్తానికి ప్రేమ కాస్తా కోపం, ద్వేషంగా మారుతుంది. ఒకరి గతం గురించి మరొకరు తవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా మంచి ప్రేమకథ అనుకున్నది కాస్త వైలెంట్ లవ్ స్టోరీగా మారుతుంది. అయితే ఈ మూవీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలాగే మీకు ఒక తెలుగు సినిమాకూడా గుర్తొస్తుంది. అసలు వారి ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎలా కంటిన్యూ అయ్యింది? వారి గతం, వారి భవిష్యత్తును అంగీకరించారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఈ “న్యూనెస్” అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. కాకపోతే కాస్త బో*గా ఉంటుంది. కాబట్టి సోలోగా చూస్తే సో బెటర్. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet