iDreamPost
android-app
ios-app

ఉద్యోగం కోసం యుద్ధం.. కాబోయే భర్తనే.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

  • Published Jul 17, 2024 | 1:25 PM Updated Updated Jul 17, 2024 | 1:25 PM

OTT Suggestions- Best Love Story Fair Play Movie: ఓటీటీలో మీకోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఇది తర్వాత ఒక మంచి థ్రిల్లర్ గా మారుతుంది. ఉద్యోగం కోసం ప్రేమించుకున్న అబ్బాయి- అమ్మాయి చేసే యుద్ధం మామూలుగా ఉండదు.

OTT Suggestions- Best Love Story Fair Play Movie: ఓటీటీలో మీకోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఇది తర్వాత ఒక మంచి థ్రిల్లర్ గా మారుతుంది. ఉద్యోగం కోసం ప్రేమించుకున్న అబ్బాయి- అమ్మాయి చేసే యుద్ధం మామూలుగా ఉండదు.

  • Published Jul 17, 2024 | 1:25 PMUpdated Jul 17, 2024 | 1:25 PM
ఉద్యోగం కోసం యుద్ధం.. కాబోయే భర్తనే.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

సాధారణంగా ఉద్యోగం అంటేనే పోటీ అని అర్థం. అది మనతో మనకా.. కొలీగ్స్ తో మనకా.. సొసైటీతో మనకా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ఎప్పుడూ ఈ పోటీ ఇంటి దాకా రాకూడదు. అలా వస్తే ఇల్లు ఒక యుద్ధభూమి అయిపోతుంది. ఇదిగో ఈ లవర్స్ మధ్య జరిగింది కదా.. అలాగే. ఈ మూవీ అలాంటి ఇలాంటి మూవీ కాదండోయ్ ఒక మంచి క్రేజీ థ్రిల్లర్. ఉద్యోగం కోసం ఇద్దరు లవర్స్ ఒక పెద్ద యుద్దమే చేస్తారు. చివరికి వారి బంధాన్ని కూడా వదులుకోవడానికి రెడీ అయిపోతారు. అయితే వారికి ఆ ఉద్యోగం ఎందుకు అంత ప్రయారిటీ? ఉద్యోగం కోసం బంధాన్ని కూడా ఎందుకు వదులుకోవాలి అనుకుంటారు? అసలు ఆ సినిమా కథ ఏంటో చూద్దాం.

ఈ సినిమా కంప్లీట్ గా అహం అనే ఫీలింగ్ మీద నడుస్తుంది అని చెప్పాల్సిందే. మొదట ఒక మంచి ప్రేమకథగా సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక అబ్బాయి.. అమ్మాయి ఒకే కంపెనీలో పని చేస్తూ ఉంటారు. వారి మధ్య ఉన్న ప్రేమ గురించి ఎవరికీ తెలియదు. వాళ్లిద్దరు ఒకే ఫ్లాట్ లోనే ఉంటారు. కానీ, కంపెనీలో మాత్రం జస్ట్ కొలీగ్స్ అన్నట్లుగానే ఉంటారు. అయితే వారి ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలి అనుకుంటారు. అందుకు ఒక మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే సడెన్ గా వాళ్ల ఆఫీస్ లో ఒక మేనేజర్ లెవర్ వ్యక్తి ప్రవర్తన వల్ల అతడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఆ పోస్ట్ కోసం ఉన్న వాళ్లలో ఒకరిని సెలక్ట్ చేయాలి. అయితే ఆ అవకాశం అమ్మాయికి దక్కుతుంది.

ఎప్పుడైతే ప్రమోషన్ వస్తుందో అప్పటి నుంచి అంతా మారిపోతుంది. కాబోయే భర్త- భార్యల మధ్య అసలు సిసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ కంపెనీలో కపుల్స్ కి ఛాన్స్ ఉండదు. అందుకని ఇద్దరిలో ఒకరు మానేయాల్సి వస్తుంది. అయితే ఆమె మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్దంగా ఉండదు. అలాగే అతను కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాలి అనుకోడు. దానికి బదులుగా తన ప్రేమ బంధాన్ని వదులుకోవడానికి రెడీ అయిపోతాడు. అతని ప్రవర్తనతో ఆమెకు ఏమీ అర్థం కాదు.

అలాగే ప్రమోషన్ వచ్చిన తర్వాత పైన వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె కూడా కాస్త డర్టీ గేమ్ స్టార్ట్ చేస్తుంది. మొత్తానికి వారి మధ్య ఒక ప్రమోషన్ చాలా పెద్ద చిచ్చు పెడుతుంది. అయితే ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? వాళ్లిద్దరు అసలు కలుస్తారా? వారి ప్రేమ బంధం ఏమౌతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కోసం మీరు ఈ ఫెయిర్ ప్లే సినిమా చూడాల్సిందే. అయితే ఈ మూవీ కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş