iDreamPost
android-app
ios-app

భారత మహిళ ప్రేమలో బ్రిటిష్ వ్యక్తి.. OTTలో వీరి లవ్ స్టోరీకి కన్నీళ్లొచ్చేస్తాయి!

OTT Movie Suggestions- Best Love Story: మీకు ప్రేకథలు ఇష్టం అయితే మాత్రం.. మీరు ఈ సిరీస్ ని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ లో క్యూట్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. ఎమోషనల్ సీన్స్ కూడా కావాల్సినన్ని ఉంటాయి.

OTT Movie Suggestions- Best Love Story: మీకు ప్రేకథలు ఇష్టం అయితే మాత్రం.. మీరు ఈ సిరీస్ ని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ లో క్యూట్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. ఎమోషనల్ సీన్స్ కూడా కావాల్సినన్ని ఉంటాయి.

భారత మహిళ ప్రేమలో బ్రిటిష్ వ్యక్తి.. OTTలో వీరి లవ్ స్టోరీకి కన్నీళ్లొచ్చేస్తాయి!

లవ్ స్టోరీలు అంటే ఇష్టపడని సినిమా ప్రేమికులు ఉండరేమో? ఎందుకంటే ప్రేమకథలు అంటే అందరికీ ఇష్టమే. అయితే కొన్ని ప్రేమకథలు మాత్రం ఒకసారి చూస్తే.. మన మనసుల్లోంచి పోవు. మన హృదయాలను తాకుతాయి. అలాంటి ఒక ప్రేమకథనే మీకోసం తీసుకొచ్చాం. ఈ లవ్ స్టోరీకి మీరు ఫిదా కావడమే కాదు.. ఆ ప్రేమికుల కోసం కన్నీళ్లు కూడా పెట్టేసుకుంటారు. ఓటీటీలోనే ఒక బెస్ట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇద్దరు ప్రేమికులు కలవకుండా కష్టాలు పడటానికి ఉండాల్సిన అన్నీ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. కాన్ ఫ్లిక్ట్ పాయింట్స్ కి మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రేమకథ ఒక భారతీయ మహిళ- ఒక బ్రిటిష్ వ్యక్తి మధ్య జరుగుతుంది.

సాధారణంగా బ్రిటిష్ వాళ్లు అంటే మనకు అంత గౌరవం, మర్యాద, సరైన అభిప్రాయం ఉండదు. ఎందుకంటే మనల్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించి మనం ఎంతో వెనుకబడి పోయాలా చేశారు. మనల్ని బానిసలు చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలకు ప్రతీకగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే అప్పట్లో ఇండియా కోసం పోరాడిన, నిలబడిన బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు. మన హీరో కూడా ఆ కోవకు చెందిన వాడే. అతను అవకాశం ఉన్నప్పుడల్లా ఇండియన్స్ కి మద్దతు తెలుపుతూ ఉంటాడు. అలాగే ఒక మహిళ ప్రేమలో పడతాడు. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కన్ను తిప్పుకోలేని ఆకర్షణ ఆమె సొంతం.

అలా వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలాగే ఆ ప్రేమ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చేలా చేస్తుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం అతను ఎక్కడా బయటపెట్టుకోలేడు. ఎందుకంటే అతను ఆ విషయాన్ని చెప్పిన మరుక్షణం నుంచి ఆ మహిళకు కష్టాలు తప్పవు. ఆమె ప్రాణం కూడా ప్రమాదంలో పడచ్చు. అందుకే అతను ఆమెతో ఉన్న సంబంధాన్ని చాలా గుట్టుగా నడిపిస్తూ వస్తాడు. కథ అన్న తర్వాత కచ్చితంగా సీక్రెట్స్ బయటకు రావాల్సిందే. అలాగే వీరి ప్రేమ వ్యవహారం కూడా బయటపడుతుంది.

అంతేకాకుండా అతను భారత్ కు సపోర్ట్ చేస్తున్నాడని వీలైనంత పెద్ద విషయంలో ఇరికించాలని బ్రిటిష్ అధికారి గట్టి ప్రయత్నాలు చేస్తాడు. అందులో అతను సక్సెస్ కూడా అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఆ మహిళతో ప్రేమను కొనసాగించాడా? అసలు వాళ్లిద్దరు కలిశారా? వారి కథకు శుభం కార్డు పడిందా? వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీద కథ ముందుకు వెళ్తుంది. ఇది ఒక వెబ్ సిరీస్.. దీని పేరు బీకం హౌస్. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. అంతేకాకుండా మధ్యలో బ్రిటిష్ వాళ్లు ఇండియాలో చేసిన దారుణాలు కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి