200 ఏళ్లున్న దెయ్యంతో ప్రేమ.. OTTలో ‘మై డీమన్’ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు..!

OTT Suggestions- Best Korean Drama My Demon Series: కొరియన్ సినిమాలకు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి కే డ్రామా లవర్స్ కోసం ఒక క్రేజీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది ఒక దెయ్యంతో జరిగే ప్రేమకథ గురించే ఈ సిరీస్.

OTT Suggestions- Best Korean Drama My Demon Series: కొరియన్ సినిమాలకు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి కే డ్రామా లవర్స్ కోసం ఒక క్రేజీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది ఒక దెయ్యంతో జరిగే ప్రేమకథ గురించే ఈ సిరీస్.

ఓటీటీలో అన్నీ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే కొరియన్ సినిమాలు, సిరీస్లకు ఉండే క్రేజ్ వేరుటుందు. భాష రాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటీటీ వినియోగదారులు కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ కొరియన్ సరీస్లు, సినిమాలు చూసేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం.. వాళ్ల మూవీస్ అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. ఈ సిరీస్ ని మీరు స్టార్ట్ చేస్తే ఇంక ఆపడం కష్టం అనే చెప్పాలి. ఇది ఒక దెయ్యంతో జరిగే ప్రేమకథ. ఆ దెయ్యానికి ఏకంగా 200 ఏళ్ల వయసు ఉంటుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అందులో ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా అనేది చూద్దాం.

ఒక మంచి కొరియన్ సిరీస్ చూడాలి అనుకుంటుంటే మీకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఇది ఒక దెయ్యంతో జరిగే ప్రేమకథ. ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెకు ఒక కంపెనీ ఉంటుంది. ఆమెకు కేవలం పని మీదే ధ్యాస. కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా.. కేవలం తన కంపెనీకి సంబంధించిన పనుల మీదే తన దృష్టిని పెడుతుంది. అయితే అలాంటి అమ్మాయి జీవితంలోకి ఒక 200 ఏళ్లున్న దెయ్యం వస్తుంది. ఆ డీమన్ ఆమె కంపెనీలో ఒక ఉద్యోగిగా చేరతాడు. ఆ తర్వాత ఆమెకు చిన్నగా దగ్గరవుతూ వస్తాడు. అతని అందం, తెలివితేటలు, మాటలు, ప్రవర్తన ఇలా అన్నీ నచ్చి ఆమె కూడా అతనికి దగ్గరవ్వడం స్టార్ట్ చేస్తుంది.

కంపెనీలో ఎవరికీ తెలియకుండా ఆ డీమన్ తో ఒక సీక్రెట్ రిలేషన్ షిప్ ని నడుపుతూ వస్తుంది. అయితే అతను ఆఫీస్ లో కూడా ఆమెతో చనువుగా ఉండాలి అని చూస్తూ ఉంటాడు. ఆమె మాత్రం అతని ప్రవర్తనను కంట్రోల్ చేస్తూ వస్తుంది. అయితే ఆమెకు అతనొక డీమన్ అని ముందే తెలియదు. తెలియకుండానే అతని ప్రేమలో పీకల్లోతు మునిగిపోతుంది. అయితే అనూహ్యంగా అతనికి ఉన్న శక్తులు హీరోయిన్ కి వచ్చేస్తాయి. అతను సాధారణమైన మనిషిగా మారిపోతాడు. ఆమె దగ్గరి నుంచి ఆ శక్తులను వెనక్కి తీసుకోవాలి అని చాలానే ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఆమె ఆ విషయాన్ని నమ్మదు. అయితే అసలు అతని శక్తులు ఎలా పోయాయి? ఆమె కూడా డీమన్ గా మారిపోతుందా? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే మీరు.. “మై డీమన్” అనే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments