iDreamPost
android-app
ios-app

కరప్షన్.. పొల్యూషన్.. OTTలో బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!

  • Published Jun 29, 2024 | 6:50 PM Updated Updated Jun 29, 2024 | 6:50 PM

OTT Suggestions- Best Investigative Movie IRADA: ఓటీటీలో ఒక అదిరిపోయే ఇన్వెస్టిగేటివ్ మూవీ ఉంది. దానిని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ, స్టార్ట్ చేశాక మాత్రం మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీరు కూడా ఆ కేస్ సాల్వ్ చేయాలి అని లీనమైపోతారు.

OTT Suggestions- Best Investigative Movie IRADA: ఓటీటీలో ఒక అదిరిపోయే ఇన్వెస్టిగేటివ్ మూవీ ఉంది. దానిని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ, స్టార్ట్ చేశాక మాత్రం మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీరు కూడా ఆ కేస్ సాల్వ్ చేయాలి అని లీనమైపోతారు.

  • Published Jun 29, 2024 | 6:50 PMUpdated Jun 29, 2024 | 6:50 PM
కరప్షన్.. పొల్యూషన్.. OTTలో బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!

ఎన్ని థ్రిల్లర్స్.. ఎన్ని డ్రామాలు చూసినా.. ఒక బెస్ట్ కాప్ స్టోరీ చూస్తే మాత్రం మజా వస్తుంది. దానికి తోడు సమాజంలో జరిగే క్రైమ్, మోసాలు, కుంభకోణాలు, సిస్టమ్ లో జరిగే అవినీతి అనే పాయింట్స్ మీద సినిమా అయితే ది కచ్చితంగా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఒక అదిరిపోయే మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి క్రైమ్ స్టోరీ కాదండోయ్.. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడే ఒక బిజినెస్ మ్యాన్ స్టోరీ. మనుషుల శవా*ల మీద వ్యాపారం చేసే కరుడు గట్టిని అవినీతి పరుడికి చెందిన స్టోరి. ఈ సినిమా చూస్తే మీకు కూడా రక్తం ఉడికిపోతుంది.

సాధారణంగానే కాప్ డ్రామా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇది సొసైటీ, కరప్షన్ అనగానే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో అలాంటి పాయింట్స్ చాలా బాగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఈ సినిమా చూసే సమయంలో అన్ని రకాల ఎమోషన్స్ ని పలికుతారు. అంటే కాసేపు నవ్వుకుంటారు.. కాసేపు ఆశ్చర్యపోతారు.. ఇంకాసేపు కోప్పడతారు కూడా. అంతేకాకుండా.. మొదట మీకు అతి పెద్ద ప్రశ్న వస్తుంది. అదేంటంటే.. ఇలా కూడా జరుగుతుందా? ఇలా చేసేవాళ్లు కూడా ఉన్నారా? అని కంగారు పుడుతుంది. ఒక ఎన్ఐఏ ఆఫీసర్ తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఒక కేసు కోసం వస్తే.. అసలు విషయం వెలుగులోకి వస్తుంది.

ఒక ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా ఒక పేలుడు జరుగతుంది. అసలు ఆ పేలుడు ఎలా జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? అది ప్రమాదమా? ప్లాన్ చేసిందా? అనే విషయాలను తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఎన్ఐఏ అధికారి చాలా సింపుల్ గా ఉంటాడు. అసలు కేసును పట్టించుకోవడం లేదు అని అంతా అనుకుంటారు. కానీ, ఆ కేసు మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న అసలు కుంభకోణాన్ని కూడా బయటకు లాగుతాడు. అప్పుడే అసలు అక్కడ ఏం జరుగుతోంది? అసలు ఫ్రాడ్ ఏంటి? అక్కడ ప్రజల ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలు అవుతుంది. ఒక వ్యాపారవేత్త వల్లే అంతా జరుగుతోంది అని తెలుస్తుంది. ఇందులో చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ‘ఇరాడా(IRADA)’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక ఇప్పటికే ఈ మూవీ చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet