iDreamPost
android-app
ios-app

OTTలో వణుకు పుట్టించే హారర్ సిరీస్.. రాత్రిపూట మాత్రం అస్సలు చూడొద్దు!

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీల్లో మీరు ఇప్పటి వరకు చాలానే హారర్ సినిమాలు, హారర్ వెబ్ సిరీస్లు చాలానే చూసుంటారు. కానీ, ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎంత హారర్ సినిమాలు అలవాటు ఉన్నా కూడా దీనిని రాత్రి పూట మాత్రం చూడకపోవడమే మంచిది.

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీల్లో మీరు ఇప్పటి వరకు చాలానే హారర్ సినిమాలు, హారర్ వెబ్ సిరీస్లు చాలానే చూసుంటారు. కానీ, ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎంత హారర్ సినిమాలు అలవాటు ఉన్నా కూడా దీనిని రాత్రి పూట మాత్రం చూడకపోవడమే మంచిది.

OTTలో వణుకు పుట్టించే హారర్ సిరీస్.. రాత్రిపూట మాత్రం అస్సలు చూడొద్దు!

హారర్ మూవీస్ అంటే మీకు చచ్చేంత ఇష్టమా? అయితే మీకోసం ఒక క్రేజీ హారర్ వెబ్ సిరీస్ ఒకటి తీసుకొచ్చాం. ఈ సిరీస్ ఒంటరిగా మాత్రం చూడొద్దు. అలాగే రాత్రిపూట కూడా ఈ హారర్ సిరీస్ ని చూడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎంత గుండె గట్టిది, గుండె ధైర్యం ఎక్కువ ఉన్నా కూడా ఈ సిరీస్ లో ఉండే సీన్స్ మీకు నిద్ర పట్టకుండా చేస్తాయి. హారర్ చిత్రాల్లో కొన్ని చాలా డిఫరెంట్ గా, టాప్ నాచ్ గా ఉంటాయి. వాటి కోవకు చెందిందే ఈ చిత్రం కూడా. ఈ సిరీస్ ని మీరు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అని తెగ బాధ పడిపోతారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే.. చాలా మంది లైట్ తీసుకున్నారు.

సాధారణంగా హారర్ చిత్రాలు ఎంతో మంది తీస్తారు. కానీ, వెన్నులో వణుకు పుట్టేలా చాలా తక్కువ మంది డైరెక్టర్స్ మాత్రమే తీయగలరు. అలాంటి ఒక సిరీస్ ని ఇవాళ మీకోసం ఒక సజీషన్ రూపంలో తీసుకొచ్చాం. ఈ సిరీస్ లో ఒక్కో సీన్ కి మీరు అయితే కచ్చితంగా వణికి పోతారు. ఈ కథ మొత్తం ఒక ఇంటి చుట్టూ.. ఆత్మల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ కథలో ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అనే విషయం తెలియాలి అంటే కాస్త సమయం పడుతుంది. అలాగే ఈ సిరీస్ లో ఒక పాత టైప్ రైటర్ ఉంటుంది. ఆ టైప్ రైటర్ కు కథకు చాలానే సింక్ ఉంటుంది. ఆ టైప్ రైటరే ఈ సిరీస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది.

అంతేకాకుండా ఈ సిరీస్ లో చూపించే ఇల్లు చాలా స్కేరీగా ఉంటుంది. ఆ ఇల్లు చూస్తేనే కాస్త కంగారు మొదలౌతుంది. ఆ ఇంట్లోకి దిగితే వారు ఇంక జీవితం మీద ఆశలు వదులు కోవాల్సిందే. ఎందుకంటే అక్కడ దిగిన వాళ్లంతా చనిపోతూ ఉంటారు. అక్కడ చనిపోయే వాళ్లంతా న్యాచురల్ డెత్ తరహాలోనే ఉంటుంది. కానీ, అది మాత్రం సాధారణ మరణం కాదు. ఆ హత్యలు మొత్తం ఒక ఆత్మ చేస్తూ ఉంటుంది. పోలీసులకు కూడా ఆ మృతులకు సంబంధించి ఎలాంటి క్లూ ఉండదు. కానీ, కనిపించని ఒక హంతకుడి కోసం వెతుకుతూనే ఉంటారు. అలాంటి ఇంట్లోకి దిగిన హీరోయిన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

ఆ ఇంట్లో ఉన్న అతీత శక్తి ఏంటి? ఎందుకు అసలు ఆ మరణాలు జరుగుతున్నాయి? ఆ టైప్ రైటర్ కి ఆ ఇంట్లో జరిగే హత్యలకు ఏంటి సంబంధం? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం కావాలి అంటే.. మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టైప్ రైటర్’ అనే సిరీస్ చూడాల్సిందే. అయితే ఈ సిరీస్ వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు కావొస్తోంది. కానీ, చాలా మందికి ఈ సిరీస్ గురించి తెలీదు. మరి.. ఇప్పటికే మీరు ఈ టైప్ రైటర్ వెబ్ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet