iDreamPost
android-app
ios-app

కడుపుతో ఉన్న మహిళకు నరకం.. OTTలో వణికించే హారర్ సిరీస్!

OTT Suggestions- Best Horror Series Ahs Delicate: ఓటీటీలు వచ్చిన తర్వాత హారర్ సినిమాలు, సిరీస్లకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే హారర్ ప్రియుల కోసం ఒక సైంటిఫిక్ హారర్ సిరీస్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Horror Series Ahs Delicate: ఓటీటీలు వచ్చిన తర్వాత హారర్ సినిమాలు, సిరీస్లకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే హారర్ ప్రియుల కోసం ఒక సైంటిఫిక్ హారర్ సిరీస్ తీసుకొచ్చాం.

కడుపుతో ఉన్న మహిళకు నరకం.. OTTలో వణికించే హారర్ సిరీస్!

హారర్ చిత్రాలు అనగానే కచ్చితంగా అందరూ అమెరికన్ మూవీస్ అంటారు. ఎందుకంటే గతంలో వాళ్లు తీసిన చిత్రాలు కూడా అదే తరహాలో ఉన్నాయి. ఇప్పుడు మీకోసం అలాంటి ఒక హారర్ సిరీస్ ని తీసుకొచ్చాం. ఈ సిరీస్ చూస్తుంటే మీకు తెలియకుండానే కంగారు పడిపోతారు.. భయపడిపోతారు. ముఖ్యంగా వణికిపోతారు. ఒక మంచి హారర్ సిరీస్ కోసం మీరు గనుక ఎదురు చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అంతేకాకుండా.. ఇందులో ఉండే ట్విస్టులు, కథ, కథనం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక మహిళా సూపర్ స్టార్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు ఆ దుష్ట శక్తులకు ఏంటి సంబంధం అనేదే అసలు కథ.

ఈ సిరీస్లో ఒక లేడీ సూపర్ స్టార్ ఉంటుంది. ఆమె సినిమాల్లో ఎంతో గొప్ప స్థాయికి వెళ్తుంది. ఆమె ఉంది అంటే మూవీ బ్లాక్ బస్టర్ అన్నట్లే. ఆమె ఎంతో సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. చక్కగా పెళ్లి చేసుకుంటుంది. ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అని కలలు కంటూ ఉంటుంది. ఆ స్టార్ కోరుకున్నట్లు ఆమె కడుపు పండుతుంది. అప్పటి నుంచే తన జీవితంలో అసలు కష్టాలు మొదలవుతాయి. ఆమె జీవితం ఆమె చేతిలో లేదు అనే విషయం గ్రహిస్తుంది. అలాగే తన భర్త కూడా తన చుట్టూ ఏదో వల పన్నుతూ ఉంటాడు. ఆ బిడ్డ కోసం ఆ స్టార్ హీరోయన్ ఆస్కార్ ని కూడా వదులుకుంటుంది. కానీ, ఆ బిడ్డ మాత్రం ఆమెకు దక్కుతాడా అనేదే ప్రశ్న.

ఆ హీరోయిన్ కడుపులో పెరిగే బిడ్డ కోసం కొందరు దుష్టులు పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అసలు ఆమె ఆ బిడ్డను వారి కోసమే మోస్తున్నట్లు చూపిస్తారు. బిడ్డ భూమ్మీదకు రాగానే వాళ్లు తీసుకెళ్లాలి అని చూస్తూ ఉంటారు. తన చుట్టూ ఏం జరుగుతోంది? తనకు ఎందుకు అలాంటి పీడకలలు వస్తున్నాయి అనే విషయాలు అర్థం కావు. అంతేకాకుండా తన శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్లు కూడా ఆమెకు వ్యతిరేకంగానే పని చేస్తూ ఉంటారు. తనకి తెలియకుండానే తనని ఒక రకమైన ప్రపంచంలో బందీగా ఉంచుతారు. అలాగే ఆమె జీవితం, ఆమె బిడ్డ ఆమెకు సొంతం కాదు అనే సంకేతాలు ఇస్తూ ఉంటారు. నిత్యం ఆమెను కనిపెట్టుకుని ఉండటమే కాకుండా.. తనని అధీనంలో ఉంచుకోవడానికి మందులు కూడా ఇస్తూ ఉంటారు. ఈ సిరీస్ పేరు Ahs: Delicate. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి హారర్ స్టోరీ కావాలి అంటే మాత్రం ఈ సిరీస్ ని చూసేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis