iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ హారర్ చిత్రం.. ‘యు ఆర్ నెక్ట్స్’ మూవీకి వెన్నులో వణుకు పుడుతుంది!

  • Published Aug 14, 2024 | 10:53 AM Updated Updated Aug 14, 2024 | 10:53 AM

OTT Suggestions Best Horror Movie You're Next: ఓటీటీలో ఒక మంచి హారర్ చిత్రం కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక ది బెస్ట్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాం.

OTT Suggestions Best Horror Movie You're Next: ఓటీటీలో ఒక మంచి హారర్ చిత్రం కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక ది బెస్ట్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాం.

  • Published Aug 14, 2024 | 10:53 AMUpdated Aug 14, 2024 | 10:53 AM
OTTలో క్రేజీ హారర్ చిత్రం.. ‘యు ఆర్ నెక్ట్స్’ మూవీకి వెన్నులో వణుకు పుడుతుంది!

ఓటీటీలో సినిమాలు చూడటం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంతి కచ్చితంగా చూసే జానర్ ఏదైనా ఉందా అంటే కచ్చితంగా హారర్ చిత్రం అవుతుంది. అయితే హారర్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సూపర్ న్యాచురల్, దెయ్యాలు ఉండే హారర్ చిత్రాలు. రెండోది మాత్రం కథ, వైలెన్స్, నరేషన్ తో భయపెట్టే హారర్ చిత్రాలు. ఇప్పుడు మీకు చెప్పబోయే యాక్షన్ తో భయపెట్టే హారర్ చిత్రం గురించే. ఇది స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఎందుకంటే.. కథ, నరేషన్ అంత గ్రిప్పింగ్ గా ఉంటాయి కాబట్టి. అలాగే ఇందులో వచ్చే ట్విస్టులు, పతాక సన్నివేశాలు కంగారు పెట్టేస్తాయి. దెయ్యం లేకుండా ఇంత బాగా భయ పెట్టొచ్చా అనిపిస్తుంది.

ఈ మూవీలో కథ మొత్తం ఒక కుటుంబానికి చెందిందే. ఆ కుటుంబంలో ఒకరి పెళ్లిరోజు సందర్భంగా అంతా ఒకటవుతారు. అందరూ కలిసి ఎంతో హ్యాపీగా గడపాలి అని ఒకచోటుకు చేరతారు. అలా వాళ్లు అనుకున్నట్లు రోజులు ఎంతో సంతోషంగా గడుస్తూ ఉంటాయి. అయితే ఆ రాత్రి మాత్రం మొత్తం మారిపోతుంది. వీళ్లంతా హ్యాపీగా డిన్నర్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వీరిపై దాడి జరుగుతుంది. నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు. వారి కుటుంబంలో ఒకరి ప్రాణం వాళ్ల కళ్ల ముందే పోతుంది. ఒక్కసారిగా అంతా గందరగోళంగా మారిపోతుంది. ఆ కుటుంబాన్ని కొన్ని రోజుల నుంచి తీక్షణంగా పరిశీలించి. ఆ ఇంటి గురించి మొత్తం తెలుసుకుని ఈ దాడికి పాల్పడతారు.

you are next movie

కుటుంబం మొత్తం చెల్లాచెదురు అవుతుంది. ఎవరికి వాళ్లు తమ ప్రాణాలు కాపోడుకోవాలి అని పరుగులు పెడతారు. ఇంట్లో కరెంట్ కట్ చేసి.. వాళ్లు ఇంట్లోకి వచ్చేస్తారు. అంతేకాకుండా.. ఒక్కొక్కరిగా వేటాడటం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నువ్వే అంటూ గోడల మీద, అద్దాల మీద రక్తంతో రాసి పెడతారు. అయితే వాళ్లకి తెలియని విషయం ఏంటంటే.. ఆ కుటుంబంలో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నవాళ్లు ఒకరు ఉంటారు. అక్కడి నుంచే కథ రక్తి కడుతుంది. అసలు చంపడానికి వచ్చింది ఎవరు? చంపుతోంది ఎవరిని? ఆ కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఈ కథ మొత్తం ఏంటి? తెలియాలి అంటే మీరు ఈ “యు ఆర్ నెక్ట్స్” సినిమా చూడాల్సిందే. ఒక్కో సీన్ కి, ఒక్కో ట్విస్టుకి పిచ్చెక్కిపోతారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఈ సినిమా ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom