iDreamPost
android-app
ios-app

అడవిలో ఆత్మలు.. OTTలో వణికించే హారర్ మూవీ.. సోలోగా చూడొద్దు!

OTT Suggestions Best Horror Movie The Ritual: ఓటీటీల్లో చాలానే హారర్ చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం మనల్ని వణికిస్తూ ఉంటాయి. అలాంటి ఒక హారర్ చిత్రం మీకోసం తీసుకొచ్చాం.

OTT Suggestions Best Horror Movie The Ritual: ఓటీటీల్లో చాలానే హారర్ చిత్రాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం మనల్ని వణికిస్తూ ఉంటాయి. అలాంటి ఒక హారర్ చిత్రం మీకోసం తీసుకొచ్చాం.

అడవిలో ఆత్మలు.. OTTలో వణికించే హారర్ మూవీ.. సోలోగా చూడొద్దు!

హారర్ మూవీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వణుకుతూ కూడా హారర్ సినిమా చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అదొక బ్యాడ్ హ్యాబిట్ అంతే. అయితే మీరు చాలాసార్లు బాగుంటుంది అని స్టార్ట్ చేసి డిజప్పాయింట్ అయిన హారర్ చిత్రాలు చాలానే ఉండి ఉంటాయి. కానీ, ఇది మాత్రం మిమ్మల్ని అలా నిరుత్సాహ పరచదు. అంతేకాదు.. ఈ మూవీని ఒంటరిగా చూడటం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉండే హారర్ ఎలిమెంట్స్, సీన్స్ కి మీరు కచ్చితంగా కంగారు పడతారు. అలాగే పడాల్సిందే కూడా. మరి.. అంత కంగారు పెట్టే సినిమా ఏదో చూద్దాం.

ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు ట్రెకింగ్ చేస్తూ ఉంటారు. తమ మిత్రుడు చనిపోతే అతనికి నివాళులు అర్పించి.. తిరిగి మళ్లీ వెనక్కి వెళ్తూ ఉంటారు. అక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్లు కొండల్లో నడుస్తున్నప్పుడు తమలో ఒకరికి కాలికి గాయం అవుతుంది. అందుకని కొండలు కాకుండా.. అడవుల్లో నుంచి వెళ్లేందుకు డిసైడ్ అవుతారు. అయితే ఆ అడవిలో చాలానే చెడు పనులు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు వారికి తెలియదు. వారిని హెచ్చరిస్తూ ఒక సంఘటన కూడా జరుగుతుంది. కానీ, వాళ్లు దానిని లైట్ తీసుకుంటారు. అదంతా ఒక ప్రమాదం అన్నట్లు ముందుకు వెళ్తారు. అక్కడ ఏవో ప్రాచీన భాషలో అక్షరాలు రాసి ఉంటాయి. ఒక మేకను దారుణంగా బ*లి ఇచ్చినట్లు ఉంటుంది.

వాళ్లు కొంతదూరం అడవిలోకి వెళ్లిన తర్వతా అక్కడ క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్లకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అన్నీ పీడ కలలు వస్తాయి. వారికి ఎవరో మనుషులు, ఏవో మృతదేహాలు, ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరికి కాదు.. ఆ నలుగురికి అలాగే జరుగుతుంది. అయితే వాళ్లు ఏదో జరుగుతోంది అని కొందరు నమ్మితే.. అవి కేవలం పీడ కలలు అని కొందరు కొట్టి పారేస్తారు. అలాగే వాళ్లు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వారికి ప్రమాదం కూడా అంతే దగ్గరగా వస్తూ ఉంటుంది. వాళ్ల ప్రాణాలు ఎంతప్రమాదంలో ఉన్నాయో కూడా వారికి అర్థం కాదు. అయితే వారికి తెలిసే సరికి జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? ఎన్ని మలుపులు తిరిగాయి? అనేది తెలియాలి అంటే మీరు ఈ ‘ది రిట్చువల్’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş