iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ హారర్ చిత్రం.. ఎంత ధైర్యమున్నా సోలోగా చూడొద్దు!

OTT Suggestions- Best Horror Movie The Inheritance: హారర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. అయితే మీకు ఎంత ఇష్టమైనా కూడా కచ్చితంగా ఈ మూవీ చూస్తే కంగారు పడతారు. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకుని చూడండి.

OTT Suggestions- Best Horror Movie The Inheritance: హారర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. అయితే మీకు ఎంత ఇష్టమైనా కూడా కచ్చితంగా ఈ మూవీ చూస్తే కంగారు పడతారు. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకుని చూడండి.

OTTలో బెస్ట్ హారర్ చిత్రం.. ఎంత ధైర్యమున్నా సోలోగా చూడొద్దు!

ఈ డైలాగ్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదేమో? అదే.. హారర్ చిత్రాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎన్ని అనుకున్నా దానిని మాత్రం మానుకోలేం. హారర్ చిత్రాలు చూస్తే భయమేస్తుందని తెలుసు.. కానీ, భయపడుతూ కూడా చూడాల్సిందే. కనీసం వారానికి ఒక హారర్ మూవీ చూడాలి. అలాంటి కల్ట్ హారర్ మూవీస్ ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే మూవీ తీసుకొచ్చాం. ఇది చూస్తే కాస్త కంగారు కూడా పుడుతుంది. ఎందుకంటే ఇది హారర్ మూవీస్ ప్రియులను కూడా వణికించే చిత్రం. చాలా సింపుల్ కథ. కానీ, ఒక్కో సీన్ కి వణుకు వచ్చేస్తుంది. ఒక తండ్రి తన స్వార్థం కోసం తన కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాడు.

ఈ సినిమా మొత్తం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబ పెద్దకు చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అతని ప్రాణాలు పోయే సమయం ఆసన్నమవుతుంది. ఆ రోజు రాత్రి 12 గంటలకు తన ప్రాణాలు పోతాయి అని అతనికి తెలుస్తుంది. అందుకే తన కుటుంబం మొత్తాన్ని తన మ్యాన్షన్ కి పిలిపిస్తాడు. పిల్లలతో సహా.. కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, మనువళ్లు, మనవరాళ్లు అంతా ఆ మ్యాన్షన్ కి వస్తారు. అతను ఏదో పార్టీనో.. ప్రాపర్టీనో ఇస్తాడు అని సంబర పడతారు. కానీ, వాళ్ల ప్రాణాలు పోగొడతాడని అస్సలు ఊహించరు. అసలు విషయాన్ని అందరూ వచ్చిన తర్వాత రివీల్ చేస్తాడు. మొదట ఎవరూ దానిని నమ్మరు. కానీ, ఆ తర్వాత నమ్మాల్సి వస్తుంది.

ఆ మ్యాన్షన్ లో ఏవో అతీత శక్తులు ఉంటాయి. తాను వ్యాపారంలో ఎదగడానికి చేసిన ద్రోహాలు, మోసాలు, నేరాలు ఇలా తనని వెంటాడుతున్నట్లు చెప్తాడు. తాను అనారోగ్యంతో కాదు.. ఒక ఆత్మ వల్ల చావబోతున్నాను అంటూ అందరికీ అసలు విషయం చెప్తాడు. అయితే ఆ మాటలను ఎవరూ నమ్మరు. కానీ, కొద్దిసేపటికే వారిలో ఒకరిని కోల్పోతారు. స్విమ్మింగ్ పూల్ లో పడి ఒకరు చనిపోతారు. ఆమె ముఖం ఎంతో క్రూరంగా ఉంటుంది. ఎవరో తన ముఖాన్ని ఛిద్రం చేసినట్లు ఉంటుంది. శరీరం అంతా తెల్లగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది.

తాను బతికితేనే తన కుటుంబానికి ఆస్తి దక్కుతుందని.. తాను చనిపోతే చిల్లిగవ్వ కూడా రాదు అని ఆ పెద్దాయన మెలిక పెడతాడు. ఒక హత్య జరిగిన తర్వాత అందరూ వెళ్లిపోవాలి అనుకుంటారు. కానీ, అంతా అక్కడే లాక్ అయిపోతారు. ఎవరికి వాళ్లు వాళ్ల ప్రాణాలు కాపాడుకోవాలి అని తాపత్రయ పడుతుంటారు. అయితే ఈ ప్రయత్నంలో ఆ తండ్రిని కాపాడుకున్నారా? వీళ్లే బలైపోయారా? అసలు వాళ్లని ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు.. ‘ది ఇన్ హెరిటెన్స్’ అనే చిత్రం చూడాల్సిందే. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet